వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ ప్రచారం – 2022 జాతీయ వ్యవసాయ సదస్సు ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
2021-22లో రికార్డు స్థాయి అంచనాలతో 3160.1 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 269.5 లక్షల టన్నుల పప్పుధాన్యాలు , 371.5 లక్షల టన్నుల నూనె గింజల ఉత్పత్తి చేయనున్న దేశం
గత 2 సంవత్సరాలుగా అమలు అయిన ఆవాలు మిషన్ రాప్‌సీడ్, ఆవాల ఉత్పత్తిని 26% పెంచి 91.2 నుంచి 114.6 లక్షల టన్నులకు పెంచింది
పురుగుమందులు, విత్తనాల లభ్యత నిర్ధారించడానికి కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి: శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
2022-23 సంవత్సరానికి ఎగుమతుల జాతీయ లక్ష్యాలు: 3280 లక్షల టన్నులు ఆహార ధాన్యాలు 295.5 లక్షల టన్నుల పప్పుధాన్యాలు 413.4 లక్షల టన్నుల నూనె గింజలు
Posted On:
19 APR 2022 4:33PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని జాతీయ కృషి అనుసంధాన పరిషత్-NASC కాంప్లెక్స్ లో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2022-23 కోసం వ్యవసాయంపై జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ర్ తోమర్ ప్రారంభించారు. 2వ ముందస్తు అంచనాల (2021-22) ప్రకారం దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3160 లక్షల టన్నులు గా అంచనా వేయగా ఈ లక్ష్యం సాకారం ఐతే ఎన్నడూ లేని రికార్డ్ అవుతుందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పప్పుధాన్యాలు నూనె గింజల ఉత్పత్తి వరుసగా 269.5, 371.5 లక్షల టన్నులుగా ఉంటుంది. మూడవ అంచె అంచనాల ప్రకారం, 2020-21లో హార్టికల్చర్ ఉత్పత్తి 3310.5 లక్షల టన్నులు, ఇది భారతీయ ఉద్యానవనం రంగంలో ఎన్నడూ లేనంతగా ఉంది. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు పురుగుమందులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు. యూరియా స్థానంలో నానో యూరియా వచ్చేలా వ్యూహరచన చేయాలని కోరారు. సహజ, సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన ప్రకటించారు. ఎగుమతులపై మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ ఎగుమతులు పెరిగినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడేలా నాణ్యమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని, ఎగుమతిదారులు రైతులు ఇద్దరూ ప్రయోజనం పొందాలని అన్నారు.
ఈ కాన్ఫరెన్స్ లక్ష్యం ఏమిటంటే, మునుపటి పంట సీజన్‌లలో పంటల పనితీరును సమీక్షించి, అంచనా వేయడం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఖరీఫ్ సీజన్‌లో పంటల వారీగా లక్ష్యాలను నిర్దేశించడం, కీలకమైన పెట్టుబడుల సరఫరాను నిర్ధారించడం, ఉత్పత్తిని పెంపొందించే ఉద్దేశ్యంతో వినూత్న సాంకేతికతలను అనుసరించడం, పంటల ఉత్పాదకత పెంచడం వంటి కార్యక్రమాలున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యత బియ్యం గోధుమ వంటి నిల్వ ఉన్న పంటల నుంచి వ్యవసాయ-పర్యావరణ ఆధారిత పంట ప్రణాళిక ద్వారా . నూనెగింజలు, పప్పుధాన్యాలు వంటి లోటు సరుకులు అధిక విలువ కలిగిన ఎగుమతి సంపాదించే పంటలకు ఉత్పత్తి సాగును కొత్త దారికి మళ్లించడానికి అవసరం . నూనెగింజలు, పప్పుధాన్యాలలో స్వయం సమృద్ధి ఆయిల్ పామ్ ప్రోత్సాహంపై దృష్టి సారించి పంటల వైవిధ్యీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలో ‘క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్’ కోసం నేషనల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ ను ఖరారు చేసేందుకు ప్రధాన రాష్ట్రాలు, పరిశోధకులు, పరిశ్రమలు విధాన రూపకర్తల వంటి అన్ని వాటాదారులతో సంప్రదింపులు జరిగాయి. వ్యవసాయాన్ని నిలకడగా, లాభదాయకంగా, ఇంతవరకు లేని కొత్త పంటలతో స్వయం సమృద్ధిగా మార్చడానికి అన్ని రాష్ట్రాలు పంటల వైవిధ్యీకరణకు కృషి చేయాలి.
ప్రస్తుత సంవత్సరంలో 3160 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేయగా, 2022-23 సంవత్సరానికి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం జాతీయ లక్ష్యాలను 3280 లక్షల టన్నులుగా కాన్ఫరెన్స్ నిర్దేశించింది. పప్పుధాన్యాలు, ఇతర ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం ఈ ఏడాది 295.5 లక్షల టన్నుల గాను, 2022-23లో 413.4 లక్షల టన్నులుగా నిర్ణయించారు. 2021-22లో 115.3 లక్షల టన్నుల నుంచి 2022-23లో 205.0 లక్షల టన్నులకు న్యూట్రి-తృణధాన్యాల ఉత్పత్తిని పెంచాలి. అంతర పంటల ద్వారా విస్తీర్ణాన్ని పెంచడం తక్కువ దిగుబడినిచ్చే ప్రాంతాలలో అధిక ఉత్పత్తి వంగడాలలను ప్రవేశపెట్టడం తగిన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఉత్పాదకత పెంపుదల పంటల వైవిధ్యం ద్వారా విస్తీర్ణాన్ని పెంచడం ఈ వ్యూహం.
2015-16 నుంచి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం పెరుగుతున్న ఒరవడిని కొనసాగిస్తోందని వ్యవసాయం రైతుల సంక్షేమం కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా అన్నారు. గత 6 సంవత్సరాలలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 25% పెరిగుదలతో 251.54 నుంచి 316.01 మిలియన్ టన్నులకు పెరిగింది. నూనె గింజలు ఇదే ధోరణిని అనుసరించాయి 2015-16లో 25.25 మిలియన్ టన్నుల నుంచి 2021-22లో 37.15 మిలియన్ టన్నులకు 42% వృద్ధిని కనబరిచాయి. భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 2021-22లో 19.92% పెరిగి 50.21 బిలియన్ డాలర్లకు (రూ. 376575 కోట్లు) చేరాయి. గోధుమలు, ఇతర తృణధాన్యాలు, బియ్యం (బాసుమతి కాకుండా), సోయా మీల్, ముడి పత్తి, తాజా కూరగాయలు శుద్ధి చేసిన వస్తువులు కూరగాయలు మొదలైనవి చాలా సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.
“గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం, పోషకాహార భద్రతను నిర్ధారించడానికి వ్యవసాయం, ఉద్యానవన రంగాల ఉత్పత్తి, ఉత్పాదకతను మనం వేగవంతం చేయాలి. ప్రభుత్వం రైతులకు అధిక ఆదాయాలపై దృష్టి సారించే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, సంస్కరణల విధానాలను అవలంబించింది. 3 సంవత్సరాల విత్తన రోలింగ్ ప్రణాళిక (2021-22 నుంచి 2023-24 వరకు) అన్ని నూనె గింజల కోసం రూ. 381.95 కోట్ల కేటాయింపుతో మొత్తం 14.7 లక్షల క్వింటాళ్ల కొత్త అధిక ఉత్పత్తి వంగడాల నాణ్యమైన విత్తనాన్ని వచ్చే 3 సంవత్సరాలలో ఉత్పత్తి చేస్తుంది.
ఖరీఫ్ సీజన్‌లో పంటల నిర్వహణకు సంబంధించిన వ్యూహాలపై వివరణాత్మక ప్రజెంటేషన్ చేస్తూ, వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎ.కె.సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల దేశం ఆల్ టైమ్ అత్యధిక ఆహార ధాన్యాలు, నూనె గింజలు ఉద్యానవన ఉత్పత్తిని నమోదు చేసిందని అన్నారు. ఇప్పుడు, నూనెగింజలు, పప్పుధాన్యాలు న్యూట్రియా-తృణధాన్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రుతుపవనాల తర్వాత, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది, దీని అనుకూలతతో వేసవిలో దాదాపు 55.76 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. ప్రభుత్వ విధానాన్ని అనుసరించి, పప్పుధాన్యాలు నూనె గింజల సాగులో పెరుగుదలతో వరి సాగు విస్తీర్ణం తగ్గింది.
ప్రభుత్వం విత్తనాలు ఎరువుల అవసరాన్ని రూపొందించింది వాటిని సకాలంలో సరఫరా చేస్తుంది. ఎరువుల కార్యదర్శి రాబోయే సీజన్‌లో ఎరువుల సరఫరా స్థానాలపై చర్చించారు. న్యూట్రీ-తృణధాన్యాల ఉత్పత్తిని పెంచడం, 2023లో అంతర్జాతీయ సంవత్సరాన్ని మిల్లెస్‌లో జరుపుకోవడం కోసం తీసుకున్న కొత్త కార్యక్రమాల కోసం వివరణాత్మక ప్రదర్శనలు అందించారు.. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన -RKVY కింద ఫలహారశాల విధానం, వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఉప పథకాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం భాగస్వామ్యం చేశారు. డిజిటల్ వ్యవసాయం, ప్రధాన మంత్రి-కిసాన్ సహజ వ్యవసాయం పై కూడా ప్రదర్శనలు ఇచ్చారు
వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి తో పాటు DA & FW, ICAR నుంచి సీనియర్ అధికారులు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు జాతీయ సదస్సులో పాల్గొన్నారు. గుజరాత్, అస్సాం, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తమ పురోగతిని పంచుకున్నాయి. దీని తర్వాత ఖరీఫ్ సీజన్‌లో ఏరియా కవరేజీ, ఉత్పత్తి ఉత్పాదకతను పెంచడం కోసం తమ రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి అన్ని రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్లు ప్రధాన కార్యదర్శులతో చర్చ జరిగింది.
******
(Release ID: 1818306)
Visitor Counter : 721