ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
పునరుద్ధరించిన కేంద్ర ప్రాయోజిత పథకం -
రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్ జిఎస్ఎ) ను 01.04.2022 నుండి 31.03.2026 వరకు కొనసాగించడానికి మంత్రివర్గం ఆమోదం
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డీ జి ) l లక్ష్యాలను సాధించడంలో 2.78 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలకు సహాయపడనున్న
ఆర్ జిఎస్ఎ
Posted On:
13 APR 2022 3:25PM by PIB Hyderabad
పంచాయితీ రాజ్ సంస్థ (పిఆర్ఐ) ల పరిపాలన సామర్థ్యాలను అభివృద్ధి చేయడం కోసం పునరుద్ధరించిన కేంద్ర ప్రాయోజిత పథకం -రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్ జిఎస్ఎ) ను 01.04.2022 నుండి 31.03.2026 వరకు (15 వ ఫైనాన్స్ కమిషన్ వ్యవధితో కో టెర్మినస్ ) కొనసాగించడానికి ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఆర్థిక వ్యయం:
ఈ పథకం మొత్తం ఆర్థిక వ్యయం రూ.5911 కోట్లు. కేంద్ర వాటా రూ.3700 కోట్లు కాగా రాష్ట్ర వాటా రూ.2211 కోట్లు.
ఉపాధి కల్పన సామర్ధ్యంతో సహా ప్రధాన ప్రభావం:
· ఆమోదం పొందిన ఆర్ జిఎస్ఎ పథకం దేశవ్యాప్తంగా సంప్రదాయ సంస్థలతో సహా 2.78 లక్షలకు పైగా గ్రామీణ స్థానిక సంస్థలకు పరిపాలనా సామర్థ్యాలను పెంచుకోవడానికి, అందుబాటులో ఉన్న వనరులను గరిష్టంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించి, సమ్మిళిత స్థానిక పాలన ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి, సహాయపడుతుంది. లింగ సమానత్వంతో పాటుగాఎవరినీ విస్మరించకుండా , అత్యంత సుదూరం లోని మొదటి , మరియు సార్వజనీన కవరేజీని చేరుకోవడం వంటి ఎస్ డి జి ల కీలక సూత్రాల ను శిక్షణలు, ట్రైనింగ్ మాడ్యూల్స్ మెటీరియల్స్ తో సహా అన్ని సామర్ధ్య పెంపు జోక్యాల రూపకల్పనలో పొందుపరుస్తారు. ప్రధానంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు ముఖ్యంగా (1) గ్రామాల్లో పేదరిక నిర్మూలన మరియు మెరుగైన జీవనోపాధి, (ii) ఆరోగ్యవంతమైన గ్రామం, (3) బాలల సంక్షేమ హిత ( చైల్డ్ ఫ్రెండ్లీ) విలేజ్, (4) తగినంత నీటి వసతి గ్రామం, (v) పరిశుభ్రమైన మరియు హరిత గ్రామం, (viii) గ్రామంలో స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలు, (viii) సామాజికంగా సురక్షితమైన గ్రామం, (viii) సుపరిపాలన కలిగిన గ్రామం, (ix) గ్రామంలో అభివృద్ధి వైపు పురోగమిస్తున్న గ్రామం మొదలైన వాటికి ప్రాధాన్యత ఇస్తారు.
· పంచాయితీలకు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు ,మహిళల ప్రాతినిధ్యం ఉంది, ఇంకా అట్టడుగు వర్గాలకు దగ్గరగా ఉన్న సంస్థలు కాబట్టి, పంచాయితీలను బలోపేతం చేయడం వల్ల సామాజిక న్యాయం, సమాజ ఆర్థిక అభివృద్ధితో పాటు సమానత్వం, సమ్మిళితను పెంపొందిస్తుంది. పిఆర్ఐల ద్వారా ఇ-గవర్నెన్స్ అధిక వినియోగం మెరుగైన సర్వీస్ డెలివరీ, పారదర్శకతను సాధించడంలో సహాయపడుతుంది. ఈ పథకం పౌరులను ముఖ్యంగా నిస్సహాయ సమూహాలను సామాజికంగా సమ్మిళితం చేయడంతో గ్రామసభలను సమర్థవంతమైన సంస్థలుగా పనిచేయడానికి బలోపేతం చేస్తుంది.ఇది జాతీయ, రాష్ట్ర ,జిల్లా స్థాయిలో పిఆర్ఐల సామర్థ్యాన్ని పెంపొందించడానికి తగిన మానవ వనరులు ,మౌలిక సదుపాయాలతో సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
· సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పంచాయితీల పాత్రలను గుర్తించడానికి, ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడానికి జాతీయంగా ముఖ్యమైన ప్రమాణాల ఆధారంగా ప్రోత్సహించడం ద్వారా పంచాయితీలు క్రమంగా బలోపేతం చేయబడతాయి.
· ఈ పథకం కింద ఎలాంటి శాశ్వత పోస్ట్ సృష్టించబడదు, అయితే ఈ పథకం అమలును పర్యవేక్షించడానికి , ఈ పథకం కింద లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక మద్దతును అందించడానికి అవసరమైన ఒప్పంద మానవ వనరులను అందించవచ్చు.
లబ్ధిదారుల సంఖ్య
దేశవ్యాప్తంగా సంప్రదాయ సంస్థ సహా సుమారు 60 లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామీణ స్థానిక సంస్థల ఇతర వాటాదారులు ఈ పథకం ప్రత్యక్ష లబ్ధిదారులు అవుతారు.
వివరాలు:
(i) పునరుద్ధరించబడిన ఆర్ జి ఎస్ ఎ లో కేంద్ర , రాష్ట్ర భాగాలు ఉంటాయి. ఈ పథకం కేంద్ర భాగాలకు భారత ప్రభుత్వం పూర్తిగా నిధుల సమకూరుస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర వాటా 90:10గా ఉన్న జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం ఈశాన్య, పర్వత రాష్ట్రాలు మినహా, రాష్ట్ర భాగాల నిధుల వాటా వరసగా 60:40 నిష్పత్తిలో ఉంటుంది. అయితే, ఇతర కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర వాటా 100% ఉంటుంది.
(ii) ఈ పథకంలో సెంట్రల్ కాంపోనెంట్ - జాతీయ స్థాయి కార్యకలాపాలు రెండూ ఉంటాయి. సాంకేతిక సహాయ జాతీయ ప్రణాళిక, ఇ-పంచాయతీపై మిషన్ మోడ్ ప్రాజెక్ట్, పంచాయతీల ప్రోత్సాహకం, యాక్షన్ రీసెర్చ్ అండ్ మీడియా రాష్ట్ర భాగం - పంచాయితీ రాజ్ సంస్థల సామర్థ్యం పెంపు & శిక్షణ (సి బి అండ్ టి)కి సంస్థాగత మద్దతు, దూరవిద్యా సౌకర్యం, గ్రామ పంచాయతీ (జి పి ) భవన నిర్మాణానికి మద్దతు, జి పి లో ఉమ్మడి సేవా కేంద్రాల (సి ఎస్ సి లు) ఏర్పాటు, ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టితో జి పి ల కోసం భవనాలు మరియు కంప్యూటర్, పి ఇ ఎస్ ఏ ప్రాంతాలలో గ్రామసభలను బలోపేతం చేయడానికి ప్రత్యేక మద్దతు, ఆవిష్కరణలకు మద్దతు, ఆర్థికాభివృద్ధికి ,ఆదాయ వృద్ధికి మద్దతు.
(iii) పథకం కార్యకలాపాల అమలు , పర్యవేక్షణ సుస్థిర అభివృద్ధి (ఎస్ డి జి) లక్ష్యాలను సాధించడానికి విస్తృతంగా సమలేఖనం చేయబడుతుంది.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్ లు , రాష్ట్ర ప్రభుత్వ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలుకు పంచాయితీలు కేంద్ర బిందువులుగా ఉంటాయి.
(iv) పునరుద్ధరించబడిన ఆర్ జి సి ఏ కింద నాయకత్వ పాత్రల కొరకు పిఆర్ఐల ఎన్నుకోబడిన ప్రతినిధులను సమర్థవంతులుగా తయారు చేయడానికి, సమర్థవంతమైన మూడవ అంచె ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయడానికి సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా మంత్రిత్వ శాఖ తన దృష్టిని మళ్ళిస్తుంది, ఇది ప్రధానంగా తొమ్మిది ఇతివృత్తాలను ఎస్ డి జి ల స్థానికీకరణపై వారికి అందించడానికి వీలు కల్పిస్తుంది,
అవి: (1) పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి, (2) ఆరోగ్యవంతమైన గ్రామం, (3) బాలలకు స్నేహపూర్వక గ్రామం, (4) తగినంత నీటి వసతి గల గ్రామం, (5) పరిశుభ్రమైన మరియు హరిత గ్రామం, (6) గ్రామంలో స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, (viii) సామాజికంగా సురక్షితంగా ఉన్న గ్రామం, (viii) సుపరిపాలన కలిగిన గ్రామం, (9) గ్రామంలో అభివృద్ధి.
(v) సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ఇతర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్ ల యొక్క సామర్థ్య పెంపుదల కార్యక్రమాలను కూడా ఈ పథకం ఏకీకృతం చేస్తుంది. సంప్రదాయ సంస్థలతో సహా గ్రామీణ స్థానిక సంస్థల సెక్టార్ ఎనేబులర్స్ ను విభిన్న మంత్రిత్వ శాఖలు/డిపార్ట్ మెంట్ ల ట్రైనింగ్ కార్యక్రమాల్లో చేర్చాలి, సంబంధిత డొమైన్ లో అధికారులు ఇతర భాగస్వాములకు శిక్షణను అందిస్తుంది.
(vi) సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో పంచాయితీల పాత్రలను గుర్తించడం మరియు ఆరోగ్యవంతమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడం. పంచాయితీల పనితీరును మదింపు చేయడంలో నోడల్ మంత్రిత్వ శాఖలకు గొప్ప పాత్ర మరియు ఊహించిన సంబంధిత ప్రాంతాల్లో అవార్డులను స్పాన్సర్ చేయడం.
(vii) లోతైన విశ్లేషణను అందించడం కోసం పిఆర్ఐలకు సంబంధించిన ఫీల్డ్ ల్లో సాక్ష్యాధారిత పరిశోధన అధ్యయనాలు మదింపు జరుగుతుంది. అవగాహన పెంపొందడానికి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వ విధానాలు , పథకాలను ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ ,సంప్రదాయ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం వంటి కార్యక్రమాలను చేపడతారు.
అమలు వ్యూహం -లక్ష్యాలు:
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పాత్రలకు ఆమోదం పొందిన
కార్యకలాపాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాధాన్యాలు, అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుండి సహాయాన్ని పొందడం కోసం తమ వార్షిక కార్యాచరణ
ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ పథకం డిమాండ్ ఆధారిత పద్ధతిలో అమలు జరుగుతుంది.
పరిధి లోకి వచ్చే రాష్ట్రాలు/జిల్లాలు:
ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలు ,
కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్త రిస్తుంది పంచాయితీలు లేని పార్టు 9 వ భాగం కాని ప్రాంతాల్లో గ్రామీణ స్థానిక ప్రభుత్వ సంస్థల lను కూడా చేర్చ నుంది.
నేపథ్యం:
అప్పటి ఆర్థిక మంత్రి 2016-17 బడ్జెట్ ప్రసంగంలో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్ డిజిలు) నెరవేర్చడానికి పంచాయితీ రాజ్ సంస్థల (పిఆర్ఐలు) పాలనా సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి కొత్త పునర్నిర్మాణ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్
(ఆర్ జి ఎస్ ఎ) పథకాన్ని ప్రకటించారు. ఈ ప్రకటన , నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అధ్యక్షతన గల కమిటీ సిఫారసులకు అనుగుణంగా, కేంద్ర ప్రాయోజిత పథకం ఆర్ జి ఎస్ ఎ ను 2018-19 నుండి 2021-22 (01.04.2018 నుండి 31.03.2022) వరకు అమలు చేయడానికి కేంద్ర మంత్రివర్గం 21.04.2018 న ఆమోదం తెలిపింది.
2021-22లో చేపట్టిన ఆర్ జి ఎస్ ఎ థర్డ్ పార్టీ మదింపు. మూల్యాంకన నివేదిక ఆర్ జిఎస్ఎ పథకం కింద చేసిన జోక్యాలను ప్రశంసించింది పిఆర్ఐలను బలోపేతం చేయడానికి దాని కొనసాగింపును సిఫారసు చేసింది. ఇంకా, సి బి అండ్ టి అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మెజారిటీ పంచాయితీ ప్రతినిధులు కొత్తగా ఎన్నుకోబడతారు, స్థానిక పాలనలో తమ పాత్రలను నిర్వర్తించడానికి నాలెడ్జ్, అవగాహన, దృక్పథం , నైపుణ్యాల పరంగా సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అందువల్ల, వారికి ప్రాథమిక ఓరియెంటేషన్ ,రీఫ్రెషర్ ట్రైనింగ్ లను అందించడం, వారి “ తప్పనిసరి విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వారిని సంసిద్ధం చేయడం అనేది అనివార్య బాధ్యత. అందువల్ల, 01.04.2022 నుండి 31.03.2026 వరకు (15 వ ఫైనాన్స్ కమిషన్ కాలంతో సహ-టెర్మినస్) అమలు చేయడానికి పునరుద్ధరించబడిన ఆర్జిఎస్ఎ కొనసాగింపు కోసం ప్రతిపాదన తయారు చేయబడింది.
ఒకవేళ ఇప్పటికే అమలు అవుతున్నట్లయితే పథకం యొక్క వివరాలు - పురోగతి
I)2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయడానికి ఆర్ జి ఎస్ ఏ కేంద్ర ప్రాయోజిత పథకానికి 21.04.2018న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర స్థాయిలో ఇతర కార్యకలాపాలతో సహా పంచాయితీలను ప్రోత్సహించడం, ఇ-పంచాయితీపై మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ప్రధాన కేంద్ర భాగాలు. స్టేట్ కాంపోనెంట్ ప్రాథమికంగా సి బి అండ్ టి కార్యకలాపాలు, సి బి అండ్ టి కోసం సంస్థాగత యంత్రాంగం తో పాటుగా పరిమిత స్థాయిలో ఇతర కార్యకలాపాలను కలిగి ఉంటుంది.
Ii)పంచాయితీల ప్రోత్సాహం మరియు ఇ-పంచాయితీపై మిషన్ మోడ్ ప్రాజెక్ట్ తో సహా ఆర్ జి ఎస్ ఎ పథకం కింద, 2018-19 నుండి 2021-22 వరకు (31.03.2022 నాటికి) రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు/ పంచాయితీలు , ఇతర అమలు సంస్థలకు రూ.2364.13 కోట్లు విడుదల చేశారు.
Ii)2018-19 నుంచి 2021-22 వరకు (31.03.2022 నాటికి) 1.36 కోట్ల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పీఆర్ఐ ల ఇతర భాగస్వాములు ఈ పథకం కింద వివిధ, బహుళ శిక్షణలను పొందారు.
***
(Release ID: 1816989)
Visitor Counter : 418
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam