పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

14 ఎఎఐ విమానాశ్ర‌యాల‌లో విమాన ప్ర‌యాణికుల‌కు యాంబు లిఫ్ట్‌ల స‌దుపాయం.

Posted On: 13 APR 2022 2:24PM by PIB Hyderabad

దేశంలోని 14 ఎఎఐ విమానాశ్ర‌యాలలో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం యాంబు లిఫ్ట్ ల స‌దుపాయాన్ని క‌ల్పించారు. సుగ‌మ్య భార‌త్ అభియాన్ కింద , భార‌త ప్ర‌భుత్వం సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణానికి వీలు క‌ల్పిస్తూ ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌యాణికులు ఎక్కువ‌గా తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. దివ్యాంగులైన ప్ర‌యాణికులు వీల్‌ఛైర్‌, స్ట్రెచ‌ర్ తో స‌హా విమానంలోకి పంపేందుకు ఇది ఉప‌క‌రిస్తుంది. ఇందుకు అవ‌స‌ర‌మైన 20 యాంబు లిఫ్ట్‌ల‌ను ఎఎఐ వివిధ విమానాశ్ర‌యాల కో

సం స‌మ‌కూర్చుకుంది. కోడ్ సి, ఇత‌ర అధునాత విమానా ల‌కోసం వీటిని స‌మ‌కూర్చుకున్నారు.అయితే ఎయిరో బ్రిడ్జి స‌దుపాయం ఉండ‌దు. యాంబు లిఫ్ట్ స‌దుపాయాన్ని మేక్ ఇన్ ఇండియా విధానం కింద దేశీయంగా రూపొందించారు.

ఈ స‌దుపాయం ప్ర‌స్తుతం 14 విమానాశ్ర‌యాల‌లో అందుబాటులో ఉంటుంది. అవి డెహ్రాడూన్‌, గోర‌ఖ్‌పూర్‌, పాట్నా, బ‌గ్‌డోగ్రా, ద‌ర్భంగా, ఇంఫాల్‌, విజ‌య‌వాడ‌, పోర్ట్‌బ్లెయిర్‌, జోధ్‌పూర్‌, బెల్గాం, సిల్చార్‌, ఝార్సుగూడ‌, రాజ్‌కోట్‌, హుబ్లి, మ‌రో 6 చోట్ల  అంటే దిమాపూర్‌, జోర్హాట్‌, లెహ్‌, జామ్ న‌గ‌ర్‌, భుజ్‌, కాన్పూర్ విమానాశ్ర‌యాల‌లో ఈ నెలాఖ‌రుకు ఇవి అందుబాటులోకి వ‌స్తాయి.
ఆంబూ లిఫ్ట్‌లు ఆరుచ‌క్రాల కుర్చీలు, రెండు స్ట్రెచ‌ర్‌లు , అటెండెంట్‌ను ఏక కాలంలో  తీసుకువెళ్ల‌గ‌ల‌దు. దీనికి హీటింగ్ వెంటిలేష‌న్‌, ఎయిర్ కండిష‌నింగ్‌సిస్ట‌మ్ కూడా ఉంటుంది. దీనిని ఎఎఐ, భార‌త ప్ర‌భు్త‌వ‌ యాక్సిసిబుల్ ఇండియా కాంపెయిన్ (సుగ‌మ్య భార‌త్ అభియాన్‌) కింద ఏర్పాటు చేశారు.

ప్ర‌యాణికులు సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించ‌డానికి, వీలుగా ఈ ఏర్పాటు చేశారు. అలాగే విమానాశ్ర‌యాల‌లో ఎయిరో బ్రిడ్జి స‌దుపాయం లేని చోట ఇది ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. వీటిని ఒక్కొక్క యూనిట్ ను 63 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేశారు. ఎఎఐ ఆంబు లిఫ్ట్ స‌దుపాయాన్ని త‌మ ఎయిర్ పోర్టుల‌లో కార్య‌క‌లాపాలు సాగించే విమాన‌యాన సంస్థ‌ల‌కు నామ‌మాత్ర‌పు ధ‌ర‌కు అందిస్తారు.


ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు, రైల్వే స్టేష‌న్లు, విమానాశ్ర‌యాల వంటి ప్ర‌జా మౌలిక స‌దుపాయాలు సుగ‌మ్య భార‌త్ అభియాన్ దార్శ‌నిక‌త కింద పూర్తిగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చే సంక‌ల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు భార‌త ప్రభుత్వం కృషి చేస్తోంది. యాంబులిఫ్ట్‌లను వివిధ ఎఎఐ విమానాశ్రాయాల‌లో అందుబాటులోకి తీసుకురావ‌డం వ‌ల్ల  ర‌వాణా వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతం అవుతుంది. అందుబాటులో స‌దుపాయాల‌కు సంబంధించి  అందుబాటులో ప్ర‌యాణ స‌దుపాయాల‌కు సంబంధించి  ఇండియా ప్ర‌చారానికి ఇది కీల‌క‌మైన‌దిగా చెప్పుకోవ‌చ్చు.

***



(Release ID: 1816975) Visitor Counter : 182