సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

మాధవపూర్ ఘెడ్ ఉత్సవానికి హాజరైన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్


ప్రస్తుత, భవిష్యత్ తరాలు సాంస్కృతిక మూలాలతో అనుసంధానం కావాలి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈశాన్య ప్రాంతంలో అపూర్వమైన అభివృద్ధి: శ్రీ ఠాకూర్

Posted On: 13 APR 2022 9:16AM by PIB Hyderabad

గుజరాత్‌లో నాలుగు రోజుల పాటు జరిగే 'మాధవ్‌పూర్ ఘెడ్ ఉత్సవాల' మూడో రోజు కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరేన్ సింగ్, గుజరాత్ రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మాధవ్‌పూర్ ఘెడ్ పండుగ భారతదేశ ప్రజలను కలిపే అత్యున్నత ప్రతీక అని అన్నారు. దేశంలోను, ఈశాన్య రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రమే లుక్ ఈస్ట్ పాలసీ...  యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారిందని, ఆ తర్వాత భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలలో అపూర్వమైన అభివృద్ధిని సాధించాయని అన్నారు.

భారతదేశం కోల్పోయిన సాంస్కృతిక వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చురుకుగా పని చేసిందని, ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే కేదార్‌నాథ్‌జీ ఆలయం  గొప్ప పురోగమనాన్ని సాధిస్తోందని  ఠాకూర్ అన్నారు. ఇంకా  కాశీ విశ్వనాథ్ కారిడార్, రామ మందిర నిర్మాణం, చార్ ధామ్ సుందరీకరణ వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి కొనియాడారు.
 

భారతదేశానికి 1947లో రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా సాంస్కృతిక స్వాతంత్య్రం రాలేదని, 2014లోనే సాంస్కృతిక జాతీయవాదం రాజకీయ చర్చలో కీలకంగా మారిందని మంత్రి అన్నారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలు తమ సాంస్కృతిక మూలాలతో ముడిపడి ఉండాలని మంత్రి ఉద్బోధించారు. మన సాంస్కృతిక వారసత్వం నుండి కథలను ప్రజలలో ప్రచారం చేయడం మన బాధ్యత అని అన్నారు.

మంత్రి తాను ఇటీవల అబుదాబి సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రధానమంత్రి కృషి వల్ల ఏర్పడిన సామరస్య సంబంధాల కారణంగా గల్ఫ్ దేశంలో  ఇప్పుడు ఒక గొప్ప స్వామి నారాయణ్ దేవాలయ నిర్మాణం జరుగుతోందని  అన్నారు.

శ్రీ అనురాగ్ ఠాకూర్ మంత్రిత్వ శాఖ తన మీడియా విభాగాలతో కలిసి ఘెడ్ ఉత్సవాలను విస్తృత ప్రచారం కల్పిస్తుందని, దాని వైభవాన్ని పెంచుతుందని హామీ ఇచ్చారు. 

మాధవపూర్ ఘెడ్ ఫెస్టివల్ 2022 ఏప్రిల్ 10 నుండి 13 వరకు జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో గుజరాత్ ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. 

 

***

                                                                                                                       



(Release ID: 1816955) Visitor Counter : 122