ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మరియు యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ కు మధ్య వర్చువల్ పద్ధతి లో జరిగిన సమావేశం

Posted On: 11 APR 2022 10:12PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ ల మధ్య ఈ రోజు న వర్చువల్ మాధ్యమం ద్వారా సమావేశం జరిగింది. ఇండియా- యుఎస్ 2+2 మంత్రుల స్థాయి సంభాషణ కోసం వాశింగ్ టన్ డిసి కి వెళ్లిన రక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ లు ఈ సమావేశం జరిగిన వేళ తమ తమ శాఖ లకు చెందిన అమెరికా మంత్రులు- అంటే యుఎస్ రక్షణ మంత్రి శ్రీ లాయడ్ ఆస్టిన్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎంటనీ బ్లింకన్- లతో పాటు వైట్ హౌస్ లో ఉన్నారు.

ఇద్దరు నేత లు కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచ దేశాలు ఆర్థికం గా కోలుకొంటూ ఉండడం, జలవాయు సంబంధి కార్యాచరణ, దక్షిణ ఆసియా లో మరియు ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఇటీవలి ఘటన క్రమాల తో పాటు యూక్రేన్ లో స్థితి సహా అనేక ప్రాంతీయ అంశాల పై మరియు ప్రపంచ అంశాల పై వారి వారి అభిప్రాయాల ను విస్తారం గా ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకొన్నారు.

ఇటీవల కొన్ని సంవత్సరాల లో ద్వైపాక్షిక సంబంధాల లో చోటు చేసుకొన్నటువంటి మహత్వపూర్ణమైన ప్రగతి ని గురించి కూడా వారు సమీక్షించారు.

‘ఇండియా- యుఎస్ కాంప్రిహెన్సివ్ గ్లోబల్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను మరింత గా బలోపేతం చేసుకొంటే రెండు దేశాల కు మహత్తర ప్రయోజనం సిద్ధిస్తుంది; అంతేకాదు, దాని వల్ల ప్రపంచ శాంతి కి, ప్రపంచ సమృద్ధి కి మరియు ప్రపంచ స్థిరత్వాని కి కూడాను తోడ్పాటు లభించగలదు అంటూ నేత లు ఇద్దరు వారి సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

***

 



(Release ID: 1815972) Visitor Counter : 155