మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
గౌహతిలో వివిధ భాగస్వాములతో జరిగిన మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ పథకాల జోనల్ సదస్సుకు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరాని
ఈశాన్య ప్రాంతంలోని అంగన్ వాడీలు, వన్ స్టాప్ సెంటర్లకు భౌగోళిక, లాజిస్టిక్ పరమైన సవాళ్లను సత్వరం ఎదుర్కొనేందుకు అవసరమైన క్రియాశీల మద్దతు అందుతుంది: స్మృతి ఇరాని
प्रविष्टि तिथि:
10 APR 2022 6:13PM by PIB Hyderabad
కేంద్ర మహిళా , శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరాని ఈరోజు గౌహతి లో జరిగిన ఈశాన్య ప్రాంతా రాష్ట్రప్రభుత్వాలు, స్టేక్ హోల్డర్ల జోనల్ సదస్సుకు అధ్యక్షత వహించారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.
మహిళా శిశు అభివృద్ధి శాఖ అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ వంటి వాటి పథకాలను కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈశాన్య ప్రాంతంలోని అంగన్ వాడీలు, ఒన్ స్టాప్ కేంద్రాలు భౌగోళిక, లాజిస్టిక్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన క్రియాశీల మద్దతును భారతప్రభుత్వం నుంచ సత్వరం అందుకుంటాయని అన్నారు.
మహిళలు, పిల్లలలో పౌష్టికాహార విలువలను మెరుగు పరచడం ఇవాళ ప్రజాచైతన్యస్థాయికి చేరిందని ఆమె అన్నారు. ఇందుకు వివిధ భాగస్వాములు చేసిన కృషిని మంత్రి అభినందించారు. వారి సహకారం , మద్దతు కారణంగానే మహిళల ఆరోగ్య సమస్యలు, పిల్లల పౌష్టికాహార సమస్యలను పరిష్కరించడం సాధ్యమైనట్టు ఆమె తెలిపారు.
వన్ స్టాప్‌సెంటర్ల గురించి ప్రస్తావిస్తూ మంత్రి, వివిధ ప్రభుత్వ విభాగాలు సమష్టిగా ముందుకు వచ్చి పోలీసు, మానసిక,సామాజిక కౌన్సిలింగ్, న్యాయపరమైన కౌన్సిలింగ్ సేవలను ఒకే గొడుగుకిందికి తీసుకువచ్చినట్టు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా మహిళా హెల్ప్ లైన్ల సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 70 లక్షల మహిళలు ప్రభుత్వం నుంచి సహాయం పొందినట్టు తెలిపారు. ఇలాంటి మరో 300 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తూ మంత్రి జన్ ధన్ యోజన పధకం ద్వారా సుమారు 25 కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందుతున్నట్టు తెలిపారు. వీరందరూ తమ జీవితంలో తొలి సారి బ్యాంకు ఖాతా పొందిన వారన్నారు. ముద్రా యోజన కింద లబ్ధిదారులలో 68 శాతం మంది మహిళలని, అలాగే స్టాండప్ ఇండియా లబ్ధిదారులలో 80 శాతం మంది మహిళలని మంత్రి తెలిపారు.
మహిళ, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయి కాలుభాయ్ మాట్లాడుత మహిళా శిశు, అభివృద్ధి మిషన్ చేపట్టిన మూడు ప్రధాన పథకాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.అ వి మిషన్ పోషణ్, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య పథకాలు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగిన జోనల్ కాన్ఫరెన్సుల గురించి మాట్లాడుతూ మంత్రి, ప్రభుత్వం వివిధ మహిళా పథకాల ద్వారా మహిళా సాధికారత పై దృష్టిసారిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత జోనల్ సమావేశం ఉద్దేశం, తమ మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న మూడు ముఖ్యమైన పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కు మరింత తెలియజేసి అవి క్రియాశీలంగా ఈ పథకాలను రాగల 5 సంవత్సరాలు మరింత ముందుకు తీసుకువెళ్లేట్టు చూడడమన్నారు.
అస్సాం ఆర్థిక, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అజంతా నియోగ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, పిల్లల అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.
భారతదేశ జనాభాలో మహిళలు, పిల్లలు 67.7 శాతంగా ఉన్నారు. దేశ సుస్థిర అభివృద్ధి, సమాన అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి మహిళలు, పిల్లల సాధికారత, రక్షణ ఎంతో కీలకం. పరివర్తనాత్మక ఆర్థిక, సామాజికమార్పునకు ఇది అవసరం. ఈ లక్ష్య సాధనకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల రిగిన కేంద్ర కేబినెట్ సమావేశం, మంత్రిత్వశాఖకు చెందిన 3 ప్రధాన పథకాలను మిషన్ మోడ్ లో అమలు చేసేందుకు నిర్ణయించింది. అవి మిషన్ పోషణ్ 2.0, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య. ఈ మూడు మిషన్‌లను 15వ ఆర్ధిక కమిషన్ కాలమైన 2021-22 నుంచి 2025-26 మధ్య అమలు చేస్తారు. ఈ మిషన్ ల కింద చేపట్టే పథకాలలో కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయి. వీటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కాస్ట్ షేరింగ్ విధానంలో కాస్ట్ షేరింగ్ నిబంధనలకు అనుగుణంగా భరిస్తాయి. ఈ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపడం జరుగుతుంది.
మహిళ, శిశు అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల అమలులో రాష్ట్రాలు తీసుకునే చర్యలలో ఏవైనా అంతరాలు ఉంటే వాటిని సరిచేయడం, అంతర్ మంత్రిత్వశాఖలు, వివిధ రంగాల మధ్య సమన్వయం సాధించి స్త్రీ పురుష సమానత్వం, పిల్లల కేంద్రంగా చట్టాలు విధానాలు కార్యక్రమాలు అమలు అయ్యేట్టు చూడడం, మహిళలు, పిల్లలను అన్ని రకాల వివక్షలకు దూరం చేయడం, వారికి అవసరమైన సహాయాలు అందుబాటులో ఉండేలా చూడడం మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రధాన లక్ష్యం. ఈ దిశగా ఈ పథకాల అమలు బాధ్యత కలిగిన రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మద్దతుతో ఈ స్కీముల లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు తీసుకుంటారు.
***
(रिलीज़ आईडी: 1815599)