ఆయుష్
తొలి ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన స్థలాన్ని సందర్శించిన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనవాల్
Posted On:
08 APR 2022 4:04PM by PIB Hyderabad
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రాని ఏప్రిల్ 19న శంకుస్థాపన జరగనుండడంతో , జామ్ నగర్‌లో ఇందుకు సంబంధించిన స్థలాన్ని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనవాల్ సందర్శించారు. ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటెచా కూడా మంత్రి వెంట ఉన్నారు. రెండు వారాల క్రితం ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు .హెచ్.ఒ)తో కలిసి ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రం (జిసిటిఎం) ఇండియాలో ఏర్పాటుకు ఆతిథ్య దేశంగా ఒప్పందంపై సంతకాలు చేసింది.
జిసిటిఎం శంకుస్థాపన కార్యక్రమం గుజరాత్ లోని జామ్ నగర్ లో ఏప్రిల్ 19న జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్ఇర శ్రీ నరేంద్రమోదీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రొస్ ఘెబ్రెఎసస్ హాజరవుతారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి,ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి జామ్ నగర్ లో ఈ సంస్థ ఏర్పాటు కానున్న స్థలానికి వెళ్లి అక్కడ శంకు స్థాపనకు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం జిల్లా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ కేంద్రం ఏర్పాటు విషయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖకు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు మధ్య గల భాగస్వామ్యం గురించి మంత్రి వివరించారు. కోవిడ్ అనంతర ప్రపంచంలో సంప్రదాయ వైద్యానికి పెరిగిన ప్రాధాన్యతను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
త్వరలోనే జరగనున్న శంకుస్థాపన కార్యక్రమం గురించి తెలియజేస్తూ శ్రీ శర్వానంద్ సోనవాల్, సంప్రదాయ వైద్యానికి సంబంధించిన అంతర్జాతీయ కేంద్రం ప్రధాన ఉద్దేశం, ప్రపంచవ్యాప్తంగా గల సంప్రదాయ వైద్యాన్ని ఆధునిక శాస్త్ర ,సాంకేతిక విజ్ఞానంతో అనుసంధానం చేయడమని అన్నారు. దీనివల్ల తక్కువ ధరకు,నమ్మకమైన ఆరోగ్య సేవలు భారతదేశానికి, ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇందుకు మనం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకోవలసి ఉందన్నారు.ఆధునిక శాస్త్ర విజ్ఞానం,ఆవిష్కరణలు , సంప్రదాయ వైద్యం సుస్థిర ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటుకు దోహదం చేస్తాయన్నారు. జామ్‌నగర్ లో త్వరలోనే జరగబోయే ఈ కేంద్రం శంకుస్థాపనకు ఎదురు చూస్తున్నామని,భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థల సమిష్టి ,వ్యూహాత్మక కృషిని ఉత్సవంలా జరుపుకోనున్నామని ఆయన అన్నారు.
జామ్‌నగర్ సంప్రదాయ వైద్యానికి అంతర్జాతీయ హబ్‌గా సేవలు అందిస్తుంది. దీనివల్ల ప్రపంచంలోని అన్ని ప్రాంతాలూ ప్రయోజనం పొందే విధంగా దీనిని రూపొందిస్తున్నారు. జిసిటిఎం నాలుగు ముఖ్యమైన వాటిపై దృష్టి సారిస్తుంది. సంబంధిత సమాచార సేకరణ-అధ్యయనం, డాటా- విశ్లేషణ ,సుస్థిరత, భాగస్వామ్యం , ఆవిష్కరణ -సాంకేతికత వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. సంప్రదాయ వైద్య విధానాలు , ఉత్పత్తులకు సంబంధించి విశ్వసనీయమైన పునాది, విధానాల రూపకల్పనకుఇది దోహదపడుతుంది. ఈ ఫలితాలను ఆయా దేశాలు తమ ఆరోగ్యవ్యవస్థలతో అనుసంధానం చేసుకోవడానికి , గరిష్ఠస్థాయిలో దీనిని ఉపయోగించుకోవడానికి నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించడం వంటివి ఇందులో ఉన్నాయి.
***
(Release ID: 1815137)
Visitor Counter : 160