ఆర్థిక మంత్రిత్వ శాఖ

సెక్యూరిటీస్ఎండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కు మరియు ఫైనాన్శియల్ రెగ్యులేటరీ కమిశన్,  మంగోలియా కు మధ్యద్వైపాక్షిక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలు చేసేందుకు ఆమోదంతెలిపిన మంత్రిమండలి

Posted On: 08 APR 2022 3:56PM by PIB Hyderabad

సెక్యూరిటీస్ ఎండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ – ‘సెబి’) కి మరియు మంగోలియా కు చెందిన ఫైనాన్శియల్ రెగ్యులేటరీ కమిశన్ (ఎఫ్ఆర్ సి) కి మధ్య ద్వైపాక్షిక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలు చేసే ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ప్రధాన ప్రభావం:

ఎస్ఇబిఐ (‘సెబి’) మాదిరిగానే ఎఫ్ ఆర్ సి అనేది ఇంటర్ నేశనల్ ఆర్గనైజేశన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిశన్ స్ మల్టిలేటరల్ ఎమ్ఒయు (ఐఒఎస్ సిఒ ఎమ్ఎమ్ఒయు) లో సహ సంతకందారు గా ఉంది. ఏమైనా, ఐఒఎస్ సిఒ ఎమ్ఎమ్ఒయు పరిధి లో సాంకేతిక సహాయాని కి సంబంధించిన ఏర్పాటు ఏదీ లేదు. ప్రతిపాదిత ద్వైపాక్షిక ఎమ్ఒయు సమాచారాన్ని వెల్లడి చేసుకొనే ఫ్రేమ్ వర్క్ ను పటిష్ట పరచడం లో తోడ్పడటాని కి అదనం గా సెక్యూరిటీ చట్టాల ను ప్రభావవంతమైన రీతి లో అమలు చేయడాని కి తోడ్పడుతుంది. అంతేకాకుండా, ఒక సాంకేతిక పరమైనటువంటి సహాయాన్ని అందించే కార్యక్రమం ప్రారంభించడం లో కూడా సహాయకారి గా ఉంటుంది. ఈ సాంకేతిక సహాయ కార్యక్రమం వల్ల ప్రాధికార సంస్థల కు కేపిటల్ మార్కెట్ లు, సామర్ధ్య నిర్మాణ కార్యకలాపాలు, సిబ్బంది కి శిక్షణ కార్యక్రమాలతో ముడిపడ్డ అంశాల లో సంప్రదింపుల మాధ్యమం ద్వారా మేలు కలగనుంది.

పూర్వరంగం:

భారతదేశం లో సెక్యూరిటీస్ మార్కెట్ లను క్రమబద్ధం చేయడం కోసం సెక్యూరీటీస్ ఎండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం, 1992 ప్రకారం సెక్యూరిటీస్ ఎండ్ ఎక్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ- ‘సెబి’) ని ఏర్పాటు చేయడం జరిగింది. సెబి యొక్క ఉద్దేశ్యాలు ఏమిటి అంటే ఇన్వెస్టర్ ల ప్రయోజనాన్ని పరిరక్షించడం తో పాటు భారతదేశం లో సెక్యూరిటీస్ మార్కెట్ ల అభివృద్ధి ని ప్రోత్సహించడం మరియు ఆ మార్కెట్ లను క్రమబద్ధం చేయడమూను. సెబి చట్టం, 2022 లోని 11వ సెక్శన్ యొక్క సబ్ సెక్శన్ (2) తాలూకు (ఐబి) క్లాజు అనేది బోర్డు విధుల ను పోలిన ఇతర ప్రాధికార సంస్థల కు అవి భారతదేశం లో, లేదా విదేశాల లో సెక్యూరిటీస్ చట్టాల కు సంబంధించిన ఉల్లంఘనల ను ఆపడం లేదా దర్యాప్తు జరపడానికి సంబంధించిన వ్యవహారాల లో సమాచారాన్ని ఇవ్వడానికి/ఆయా సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించడాని కి అధికారాల ను దఖలు పరుస్తుంది. భారతదేశాని కి వెలుపల ఏదైనా ప్రాధికార సంస్థ కు ఏ సమాచారాన్ని అయినా ఇవ్వడం కోసం, సెబి కేంద్ర ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతి తో సదరు ప్రాధికార సంస్థ తో ఒక వ్యవస్థ ను లేదా అవగాహన ను కుదుర్చుకోవచ్చు. ఈ నేపథ్యం లో, పరస్పర సహకారం మరియు సాంకేతిక సహాయం ల కోసం ఒక ద్వైపాక్షిక ఎమ్ఒయు పై సంతకాలు చేయవలసింది గా సెబి ని ఎఫ్ఆర్ సి అభ్యర్థించింది. ఇప్పటి వరకు సెబి ఇతర దేశాల కేపిటల్ మార్కెట్ నియంత్రణదారు సంస్థల తో 27 ద్వైపాక్షిక ఎమ్ఒయు ల పై సంతకాలు చేసింది.

ఫైనాన్శియల్ రెగ్యులేటరీ కమిశన్ (ఎఫ్ఆర్ సి) అనేది 2006వ సంవత్సరం లో ఏర్పాటైన పార్లమెంటరీ ప్రాధికార సంస్థ. ఇది సెక్యూరిటీస్ మార్కెట్ స్, బీమా మరియు సూక్ష్మ ఆర్థిక సహాయం రంగం లోని పాత్రధారులు సహా నాన్- బ్యాంక్ సెక్టర్ లను పర్యవేక్షించడం, క్రమబద్ధం చేయడం అనే బాధ్యతలను కలిగివుంది. స్థిరమైనటువంటి మరయు సుదృఢ ఆర్థిక బజారు లను అందించే బాధ్యత ను కూడా ఎఫ్ ఆర్ సి దే. కమిశన్ నాన్- బ్యాంక్ ఫైనాన్శియల్ ఇన్ స్టిట్యూశన్స్, బీమా కంపెనీలు మరియు మధ్యవర్తి సంస్థ లు, సెక్యూరిటీస్ సంస్థ లు మరియు పొదుపు, ఇంకా రుణ సహకార సమితుల పై తన అధికారాల ను వినియోగిస్తుంది. దీనితో పాటు, ఇది వ్యక్తిగత ఫైనాన్శియల్ మార్కెట్ క్లయింట్ ల (సెక్యూరిటీస్ హోల్డర్ స్, దేశీయ ఇన్వెస్టర్ లు, విదేశీ ఇన్వెస్టర్ లు మరియు బీమా పాలసీ దారులు) యొక్క హక్కుల కు పూచీ పడుతుంది. అంతేకాకుండా, ఆర్థిక సహాయం రంగం లో ఎటువంటి అవకతవకల కు ఆస్కారం లేకుండా సురక్ష ను కల్పిస్తుంది.

 

***



(Release ID: 1814932) Visitor Counter : 134