ఆయుష్
ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా రెండు రోజుల వైజ్ఞానిక సదస్సును నిర్వహించనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ
Posted On:
08 APR 2022 12:10PM by PIB Hyderabad
ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో 9 &10 ఏప్రిల్ 2022న భారతతర్న సి. సుబ్రమణియం ఆడిటోరియంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు అత్యున్నత సంస్థలైన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి రెండు రోజుల సైంటిఫిక్ కన్వెన్షన్ (వైజ్ఞానిక సదస్సు)ను నిర్వహిస్తున్నాయి. హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్టియన్ ప్రెడ్రిక్ శామ్యూల్ హానెమన్ 267వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పీపుల్స్ ఛాయిస్ ఫర్ వెల్‌నెస్ (ఆరోగ్యం కోసం ప్రజల ఎంపిక) అన్నది ఈ వైజ్ఞానిక సదస్సు ఇతివృత్తం.
వైజ్ఞానిక సదస్సు మొదటి రోజు, 9 ఏప్రిల్ 2022న కార్యక్రమాలను కేంద్ర ఆయుష్, రేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి ఎస్‌హెచ్. సర్బానందం సోనోవాల్, ఆయుష్ శాఖ సహాయ మంత్రి, డబ్ల్యసిడి అయిన డాక్టర్ మహేంద్ర భాయి ముంజ్ పారాతో కలిసి ప్రారంభిస్తారు.ఈ సదస్సుకు హాజరయ్యే డెలిగేట్లలో హోమియోపతి పరిశోధకులు, బహుశాస్త్రాంతర శాస్త్రవేత్తలు, ప్రాక్టీసు చేస్తున్నవారు, విద్యార్ధులు, పారిశ్రామికవేత్తలతో పాటుగా వివిధ హోమియోపతి అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇప్పటివరకూ, సాగించిన ప్రయాణం, హోమియోపతి రంగంలో సాధించిన విజయాలను సమీక్షించడమే కాక హోమియోపతి అభివృద్దికి భవిష్యత్ వ్యూహాలను రూపొందించడానికి ఈ సదస్సు అవకాశం ఇస్తుంది. వైద్య పరిశోధనకు సంబంధించిన సమాచారంలో ప్రమాణాలను పాటించడం, వైద్య పరిశోధనలో డాటా ప్రమాణాలు, విధానపరమైన అంశాలు, విద్యా ప్రమాణాలు, బోధనాపరమైన వనరులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు హోమియోపతిలో ప్రధాన భాగస్వాముల మధ్య చర్చను ప్రారంభించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సాంకేతికతలో వేగవంతమైన ఆవిష్కరణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంరక్షణ నిర్వహణ నమూనా మారుతున్న క్రమంలో వైద్య సంరక్షణను అందచేత, పరిశోధనను రెండింటినీ విలీనం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు. సమగ్ర సంరక్షణలో హోమియోపతిని సమర్ధవంతంగా, ప్రభావవంతంగా కలుపుకుపోవడానికి కార్యచరణాత్మక వ్యూహాలను గుర్తించి, ప్రతిపాదించడం అనివార్యం.
ఈ వైజ్ఞానిక సదస్సులో జరుగనున్న చర్చలు హోమియోపతికి ప్రజల ఆమోదాన్ని పెంపొందించం, ప్రజల సంక్షేమం కోసం మొదటి ఎంపికగా హోమియోపతిని అభివృద్ధి చేయడం కోసం భవిష్యత్ రోడ్‌మ్యాప్ కు అంతర్‌దృష్టిని అందించడం లక్ష్యంగా జరుగుతాయి.
***
(Release ID: 1814867)
Visitor Counter : 215