ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌పై అప్‌డేట్
Posted On:
05 APR 2022 3:49PM by PIB Hyderabad
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్-ఏబీడీఎం అని పిలుస్తున్నారు)ను 2020 ఆగస్టు 15న ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు- అండమాన్ & నికోబార్, చండీగఢ్, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ, లడఖ్, లక్షద్వీప్ మరియు పుదుచ్చేరిలో పైలట్‌గా ప్రారంభించబడింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పౌరుల ఆరోగ్య వివరాలను రూపొందించడానికి, డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ ద్వారా ఆరోగ్య సేవలను సులభతరం చేయడానికి సాఫ్ట్ వేర్ ఆధారిత కంప్యూటర్ వ్యవస్థ ద్వారా నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేయడం ఆయుష్మాన్ భారత్ యొక్క లక్ష్యం.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ యొక్క మూడు కీలక రిజిస్ట్రీలు.. అంటే హెల్త్ ఐడీ, హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ (హెచ్ పీఆర్), హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (హెచ్ ఎఫ్ ఆర్) మరియు డేటా మార్పిడి కోసం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో అభివృద్ధి చేయడంతోపాటు అమలు చేస్తున్నారు. సెప్టెంబర్, 27 2021న ఆయుష్మాన్ భారత్ యొక్క లక్ష్యాన్ని నిర్ధారించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కోసం నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ ఏ)కి రూ.45 కోట్లు విడుదలయ్యాయి.
మార్చి, 28 2022 వరకు దేశవ్యాప్తంగా 20,97,55,222 హెల్త్ ఐడీలు (ఏబీహెచ్ఏల నంబర్) సృష్టించబడ్డాయి. రాష్ట్రాల వారీగా రూపొందించబడిన ఆరోగ్య ఐడీల (ఏబీహెచ్ఏలు) వివరాలు అనుబంధంలో ఉన్నాయి.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను అమలు చేసే ఏజెన్సీగా.. నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ ఏ) ఐఈసీ మెటీరియల్స్ ద్వారా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలపై అవగాహన, ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఔట్‌రీచ్ కార్యకలాపాలలో భాగంగా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో అవగాహన పెంచడానికి మరియు భాగస్వామ్యాన్ని పెంచడానికి బహుళ సంక్షిప్త సందేశాల ప్రచారాలు ప్రారంభించబడ్డాయి. అంతేకాకుండా వైద్యులతో వెబ్‌నార్లు నిర్వహించబడ్డాయి.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
***
(Release ID: 1813965)
Visitor Counter : 226