నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

బ్లుస్మార్ట్ మొబిలిటీకి 3000 ఎలక్ట్రిక్ కార్లు కొనేందుకు ఐఆర్ఈడీఏ రూ.286 కోట్ల రుణం ఇచ్చింది.

Posted On: 01 APR 2022 1:30PM by PIB Hyderabad

ఢిల్లీ రాజధాని ప్రాదేశిక ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అతిపెద్ద రుణదాత అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ)...బ్లుస్మార్ట్కు 3000 ఎలక్ట్రిక్ కార్డు కొనేందుకు రూ.267.67 కోట్ల రుణం మంజూరు చేసింది.
బ్లుస్మార్ట్ మొబిలిటీ 3000 ఆల్-ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి తాజా మూలధనాన్ని ఉపయోగిస్తుంది.  ఇది దాని ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు దారి తీస్తుంది. మంజూరైన రుణం నుంచి రూ. 267.67 కోట్లలో మొదటి విడతగా రూ. 35.70 కంపెనీకి ఐఆర్ఈడీఏ ద్వారా మంజూరు చేయబడింది.

ఐఆర్ఈడీఏ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ దాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.."భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి భారీ వృద్ధి సామర్థ్యం ఉందని ఐఆర్ఈడీఏ బలంగా విశ్వసిస్తోందన్నారు. బ్లుస్మార్ట్ భారతదేశం యొక్క జాతీయ రాజధాని ప్రాంతంలో తన సేవలను అందిస్తోందని,  తాము తీసుకున్న ఈ నిర్ణయం బ్లుస్మార్ట్ బృందానికి ఎంతో మద్దతుగా నిలుస్తుందన్నారు. భారతదేశాన్ని పరిశుభ్రమైన, హరితదేశంగా మార్చడానికి ఐఆర్ఈడీఏ పెడుతున్న పెద్ద పెట్టుబడి ఇదని ఆయన పేర్కొన్నారు. దేశంలో  కాలుష్య రహిత వనరులతో రవణాను ప్రోత్సహించేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ప్రాజెక్టుకు రుణం మంజూరు చేసేందుకు ఐఆర్ఈడీఏ సిద్ధంగా ఉందన్నారు. దేశ రాజధాని ప్రాదేశిక ప్రాంతంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలోభాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఐఆర్ఈడీఏ గురించి:
ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ), మినీ రత్న (కేటగిరీ– I) మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న భారత ప్రభుత్వ సంస్థ. స్వచ్ఛమైన ఇంధన విస్తరణకు అంకితమైన భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థ. 1987లో ప్రారంభమైనప్పటి నుండి, ఐఆర్ఈడీఏ భారతదేశంలోని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో అత్యధిక వాటాను సమకూర్చింది. ఐఆర్ఈడీఏ సంవత్సరాలుగా పునరుత్పాదక శక్తి & ఇంధన సామర్థ్య విభాగంలోని ప్రాజెక్ట్‌లకు రుణాలను మంజూరు చేసింది. రూ.1,20,522 కోట్ల రుణం మంజూరు చేయగా.. ఇప్పటిదాకా రూ.77,946 కోట్ల రుణాన్ని రుణగ్రహీతలకు అందజేసింది. 2022, మార్చి 31నాటికి దేశంలో 19,453 మెగావాట్ల కంటే ఎక్కువగా రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని అందించింది.

బ్లుస్మార్ట్ గురించి:
బ్లుస్మార్ట్ ఒక అంకుర సంస్థ.  భారతదేశం యొక్క జీరో-ఎమిషన్ మొబిలిటీకి, డ్రైవర్ -భాగస్వాముల జీవిత నాణ్యతను మెరుగు పరచడానికి మరియు వినియోగదారులకు నమ్మకమైన రైడ్- హెయిలింగ్ సేవను అందించడం కోసం ఇది పని చేస్తోంది. బ్లుస్మార్ట్ మొబిలిటీ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతం అంతటా 3,50,000 కంటే ఎక్కువ యాప్ డౌన్‌లోడ్‌లతో.. 35 మిలియన్లకు పైగా క్లీన్ కిలోమీటర్లను కవర్ చేస్తూ.. 1 మిలియన్ కంటే ఎక్కువ  -ఎలక్ట్రిక్ ట్రిప్‌లను పూర్తి చేసింది.

***

 



(Release ID: 1813487) Visitor Counter : 156