పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

53 విమానాశ్రయాలను కృషి ఉడాన్ పథకం కింద చేర్చారు


నిల్వచేయడానికి వీలులేని (నిల్వచేస్తే పాడైపోయే) 1,08,479 మెట్రిక్ టన్నుల సరుకులు 2021-–22 ఆర్థిక సంవత్సరంలో రవాణా చేయబడ్డాయి. (28, ఫిబ్రవరి 2022 వరకు)

Posted On: 04 APR 2022 2:19PM by PIB Hyderabad

అంతర్జాతీయ మరియు జాతీయ మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడంలో రైతులకు సహాయం చేయడానికి, తద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ధరలను మెరుగుపర్చడానికి  2020, ఆగస్టులో కృషి ఉడాన్ పథకం ప్రారంభించబడింది. 2021, అక్టోబర్లో ప్రారంభించిన కృషి ఉడాన్ 2.0 పథకం ప్రస్తుతం అందిస్తున్న సేవలకు మరింత మెరుగైన సేవలు అందించడంతోపాటు త్వరగా పాడైపోయే లక్షణమున్న.. నిల్వ చేయడానికి వీలులేని వ్యవసాయ ఉత్పత్తులను ప్రధానంగా కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాల నుంచి  రవాణా చేయడంపై దృష్టిసారించింది. ఈ పథకం ప్రధానంగా ఈశాన్య ప్రాంతాలు.. ప్రత్యేకించి కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలైన అగర్తల, అగట్టి, బారాపానీ, డెహ్రాడూన్, డిబ్రూఘర్, దిమాపూర్, గగ్గల్, ఇంఫాల్, జమ్ము, జోర్హాట్, కులు (భుంటార్), లేహ్, లెంగ్‌పుయ్, లిలాబరీ తదితర 25 విమానాశ్రయాలపై దృష్టి సారించింది. వీటితోపాటు పాక్యోంగ్, పంత్‌నగర్, పితోరాఘర్, పోర్ట్ బ్లెయిర్, రాయ్‌పూర్, రాంచీ, రూప్సీ, సిమ్లా, సిల్చార్, శ్రీనగర్,  తేజు అడంపూర్ (జలంధర్), ఆగ్రా, అమృత్‌సర్, బాగ్డోగ్రా, బరేలీ, భుజ్, చండీగఢ్, కోయంబత్తూర్, గోవా, గోరఖ్‌పూర్, హిండన్, ఇండోర్, జైసల్మేర్, జామ్‌నగర్, జోధ్‌పూర్, కాన్పూర్ (చాకేరీ), కోల్‌కతా, నాసిక్ , పఠాన్‌కోట్, పట్నా, ప్రయాగ్‌రాజ్, పుణే, రాజ్‌కోట్, తేజ్‌పూర్, తిరుచ్చి, త్రివేండ్రం, వారణాసి మరియు విశాఖపట్నం తదితర 28 విమానాశ్రయాలు కూడా ఈ కృషి ఉడాన్ పథకంలో చేర్చబడ్డాయి.

కృషి ఉడాన్ అనేది.. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం, సరుకు రవాణాను మరింత మెరుగుపర్చడం కోసం  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ,  వ్యవసాయం & రైతుల సంక్షేమ శాఖ, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ, మత్స్య శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి ఎనిమిది మంత్రిత్వ శాఖలు/విభాగాలతోపాటు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వశాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్న బృహత్తర పథకం. ప్రస్తుత బడ్జెట్లో కృషి ఉడాన్ పథకానికి ఎలాంటి కేటాయింపులు లేవు.

ఈ పథకం కింద, భారతీయ సరుకు రవాణా మరియు కార్గోకు ప్రయాణీకుల కోసం ల్యాండింగ్, పార్కింగ్, టెర్మినల్ నావిగేషనల్ ల్యాండింగ్ ఛార్జీలు, రూట్ నావిగేషన్ ఫెసిలిటీ ఛార్జీలు  పూర్తిగా మాఫీ చేయడం ద్వారా వాయు రవాణా ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని సులభతరం చేయడం మరియు ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రధానంగా ఈశాన్య ప్రాంతాలు, కొండ, గిరిజన ప్రాంతాల్లోని 25 ఎయిర్పోర్టులను, ఇతర ప్రాంతాల్లోని 28 ఎయిర్పోర్టులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి ఉడాన్ పథకం కింద చేర్చడం కోసం ఎంపిక చేసింది.


 2021-622 ఆర్థిక సంవత్సరంలో (28 ఫిబ్రవరి, 2022 వరకు) మొత్తం 1,08,479 మెట్రిక్ టన్నుల పెరిషబుల్(నిల్వచేయడానికి వీలులేని) వ్యవసాయ ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో  రవాణా చేశారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రవాణా చేసిన  84, 042 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈ ఏడాది కృషి ఉడాన్ పథకం కారణంగా మరింత మెరుగైన గణాంకాలు నమోదయ్యాయి. కృషి ఉడాన్ నిరంతరం కొనసాగే పథకం. అందుకే సంబంధిత భాగస్వాములతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షించబడుతోంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వి.కె. సింగ్ (రిటైర్డ్) శనివారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. 

 

***



(Release ID: 1813486) Visitor Counter : 184