సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భువనేశ్వర్ లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని శాఖల పనితీరును సమీక్షించిన ఎం ఐ బి కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర
ప్రజలకు చేరువయ్యే వినూత్న మార్గాల ద్వారా స్థానిక భాగస్వామ్యం పెంపు: ఎంఐబీ కార్యదర్శి
ప్రాంతీయ , స్థానిక కంటెంట్ పైనే అన్ని మీడియా యూనిట్ల దృష్టి ఉండాలి : శ్రీ అపూర్వ చంద్ర
Posted On:
01 APR 2022 7:58PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ఈ రోజు భువనేశ్వర్ లో మంత్రిత్వ శాఖ లోని అన్ని శాఖల పనితీరును సమీక్షించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ఎన్ ఏ బీ ఎం, సీ బీ ఎఫ్ సీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన (ఫ్లాగ్ షిప్ ) కార్యక్రమాలు , అభివృద్ధి విధానాలు , నూతన చొరవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు పూర్తి స్థాయి లో చేర్చడంపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ఎం ఐ బి కార్యదర్శి నొక్కి చెప్పారు.ప్రజల భాగస్వామ్యాన్ని ఆకర్షించడానికి సృజనాత్మక మార్గాలను రూపొందించాలన్నారు. ప్రజలకు సులువుగా చేరువ కావడానికి ప్రాంతీయ, స్థానిక అంశాలను సేకరించి. ప్రసారం చేయాలని శ్రీ చంద్ర అధికారులకు సూచించారు. "ప్రాంతీయ అంశాలపై దృష్టి సారించాలి. అప్పుడు మాత్రమే ప్రజలు కనెక్ట్ కాగలుగుతారు. అప్పుడే ఆశించిన సందేశాన్ని సమర్థవంతంగా వ్యాప్తి చేయగలుగుతారు" అని ఆయన అన్నారు.మానవవనరుల సమస్యపై స్పందించిన ఆయన, డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న మానవ వనరులను ఆప్టిమైజ్ చేయాలని అన్నారు. ప్రసార భారతి కింద ముఖ్యంగా రేడియో , దూరదర్శన్ ద్వారా ఆదాయ పెంపు అవసరాన్ని కూడా కార్యదర్శి నొక్కిచెప్పారు.ఇందుకోసం తగిన మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించాలని ఆయన అన్నారు. శ్రోతలు/ వీక్షకులను ఆకట్టుకునేలా క్విజ్ పోటీలు వంటి సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ఎఐఆర్ , డిడి అధికారులకు పిలుపునిచ్చారు.
మంత్రిత్వ శాఖ పరిధిలోని రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో వంటి ఫీల్డ్ మీడియా యూనిట్ ల ద్వారా జరిగిన విభిన్న కార్యకలాపాల ప్రభావాన్ని మదింపు చేయడం కోసం సరైన ఫీడ్ బ్యాక్ వ్యవస్థ ను రూపొందించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. "వివిధ అవుట్ రీచ్ కార్యకలాపాల గురించి ప్రజలపై ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రయత్నాలు జరగాలి. ఇది మెరుగైన కమ్యూనికేషన్ వ్యూహాన్ని రూపొందించడానికి మార్గం సుగమం చేస్తుంది" అని కార్యదర్శి చెప్పారు.
మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని విభాగాలు తమకు నిర్దేశించిన బాధ్యతలను అమలు చేయడంలో చేసిన ప్రయత్నాలను కార్యదర్శి అభినందించారు. అనంతరం శ్రీ అపూర్వ చంద్ర భువనేశ్వర్ లోని దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించారు.
*****
(Release ID: 1812903)
Visitor Counter : 156