గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
‘లక్ష్య జీరో డంప్‌సైట్’: మహారాష్ట్రకు చెందిన ₹433.74 కోట్ల లెగసీ వేస్ట్ రెమెడియేషన్ ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఆమోదించింది
గ్రేటర్ ముంబై సుమారు 355 ఎకరాల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా దాని పరిస్థితిని మార్చడానికి 2.6 కోట్ల ఎంటీల లెగసీ వ్యర్థాలను సరిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Posted On:
30 MAR 2022 10:21AM by PIB Hyderabad
స్వచ్ఛ భారత్ మిషన్ పాన్-ఇండియా చొరవలో భాగంగా చేపట్టిన పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించిన విధానం విస్తృతంగా ప్రశంసించబడింది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 2021న ప్రారంభించిన తర్వాత స్వచ్చ భారత్ మిషన్- అర్బన్ 2.0 మారుతున్న ప్రవర్తనల పరంగా ఒక నమూనా మార్పును తీసుకొచ్చింది.
డంప్‌సైట్‌ల వద్ద భారీ చెత్త కుప్పల ఏర్పాటుకు దారితీసిన చెత్త మరియు డ్రెగ్‌లను నిర్మూలించడానికి చేపట్టిన కార్యక్రమాల్లో 'లక్ష్య జీరో డంప్‌సైట్' లక్ష్యం ఒకటి. మిషన్ వ్యవధిలో సాధించడానికి ఎస్‌బిఎం-యు2.0 కృషి చేస్తుంది. వ్యర్థాల నివారణ ద్వారా దేశాన్ని చెత్త రహితంగా ఉండాలనే మిషన్ కలలను ఇది చేరువ చేస్తుంది. అలాగే వనరుల పునరుద్ధరణ మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ యొక్క సూత్రాలను మరింత ముందుకు తీసుకువెళుతుంది.
చెత్త డంప్‌సైట్‌లు చాలా నగరాలకు పెద్ద సమస్యగా మారాయి. మహారాష్ట్రలోని గ్రేటర్ ముంబై రాష్ట్రంలో అత్యధిక మొత్తంలో వ్యర్థాలను కలిగి ఉంది. ఇది సుమారు 355 ఎకరాల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా దాని పట్టణ రూపురేఖలను మార్చడానికి 2.6 కోట్ల ఎంటీ లెగసీ వ్యర్థాలను సరిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. థానే మునిసిపల్ కార్పొరేషన్ నగరంలోని డంప్‌సైట్‌లో పడి ఉన్న 8.3 లక్షల ఎంటీ వ్యర్థాలను సరిచేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే మీరా-భయందర్ సుమారు 9 లక్షల ఎంటీల వ్యర్థాలను తొలగించాలని యోచిస్తోంది. తద్వారా సరైన వినియోగం కోసం పెద్ద మొత్తంలో భూమిని తిరిగి పొందుతుంది. ఈ వ్యర్థాల సమస్యలను పరిష్కరించేందుకు మహారాష్ట్రకు చెందిన 28 యూఎల్‌బిలు డంప్‌సైట్‌ల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళికలను సమర్పించాయి.
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో మహారాష్ట్రకు మద్దతుగా గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 3.7 కోట్ల ఎంటీ వ్యర్థాలను పరిష్కరించడానికి 28 యూఎల్‌బిలకు ₹433.72 కోట్లను ఆమోదించింది. విభిన్న మరియు భారీ జనాభాను కలిగి ఉన్న వివిధ రకాల యూఎల్‌బీలతో ప్రాజెక్ట్ సుమారు 1532 ఎకరాల భూమిలో పర్యావరణ సమతుల్యతను నిర్ధారిస్తుంది.
దేశంలోని రాష్ట్రాలు మరియు నగరాలు ప్రమాదకర లెగసీ డంప్‌సైట్‌లను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తించాయి. చెత్త రహిత నగరాల విజన్‌ను బలోపేతం చేస్తూ వివిధ నగరాలు కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం కోరుతూ ముందుకు వచ్చాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ మొదలైన రాష్ట్రాల్లోని దాదాపు 500 నగరాల ప్రతిపాదనను వ్యర్థాల నివారణ కోసం ఆమోదించింది.
ఈ వ్యర్థాల నివారణ ద్వారా ప్రస్తుతం దశాబ్దాల నాటి వ్యర్థాల కింద పూడ్చిపెట్టిన ప్రాంత లభ్యతను సులభతరం చేస్తుంది. స్వచ్ఛ్ భారత్ మిషన్ 'చెత్త రహిత నగరాలు' శాస్త్రీయ వ్యర్థాల ప్రాసెసింగ్ మరియు వ్యర్థాల నుండి వృత్తాకార ఆర్థిక వ్యవస్థను నిర్ధారించడానికి స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థల రూపకల్పనపై నిరంతరం కృషి చేస్తోంది.
రెగ్యులర్ అప్‌డేట్‌ల కోసం దయచేసి స్వచ్ఛ భారత్ మిషన్ అధికారిక వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా ప్రాపర్టీలను అనుసరించండి:
Facebook:Swachh Bharat Mission - Urban | Twitter: @SwachhBharatGov|
YouTube: Swachh Bharat Mission-Urban | Instagram:sbm_urban
****
(Release ID: 1811474)
Visitor Counter : 200