రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఉదజనితో నడిచే కారులో పార్లమెంటుకు వచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ, నిలకడైన అభివృద్ధి కోసం హరిత ఉదజని ఆవశ్యకత గురించి అవగాహనను వ్యాప్తి చేయాలని ఉద్ఘాటన
Posted On:
30 MAR 2022 12:21PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ బుధవారం నాడు ఉదజన ఆధారిత ఇంధన సెల్ విద్యుత్ వాహనం (ఎఫ్‌సిఇవి - హైడ్రోజెన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్)లో పార్లమెంట్ హౌజ్‌కు వెళ్ళారు. హరిత ఉదజనితో నడిచే కారును ప్రదర్శిస్తూ, భారతదేశానికి ఉదజని ఆధారిత సమాజంగా తీర్చిదిద్దేందకు ఉదజని, ఎఫ్‌సిఇవి సాంకేతిక గురించి, వాటి లాభాల గురించి అవగాహనను విస్తరింపచేయాల్సిన అవసరాన్ని శ్రీ గడ్కరీ నొక్కి చెప్పారు.
హరిత ఉదజనిని భారత్‌లోనే ఉత్పత్తి చేస్తామని శ్రీ గడ్కరీ హామీ ఇచ్చారు. అలాగే దేశంలో నిలకడైన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు హరిత ఉదజని రీఫ్యూయెలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హరిత ఉదజని ఎగుమతుల దేశంగా భారత్ త్వరలోనే అవతరించనుందని ఆయన తెలిపారు.
భారత్‌లో స్వచ్ఛమైన, అత్యాధునిక చలనశక్తి అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా, మన ప్రభుత్వం,
జాతీయ ఉదజని మిషన్ ద్వారా ప్రభుత్వం హరిత, స్వచ్ఛ ఇంధనంపై దృష్టి కేంద్రీకరిస్తూ, అందుకు కట్టుబడి ఉందని మంత్రి వివరించారు.
***
(Release ID: 1811473)
Visitor Counter : 167