శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
2022 ఏప్రిల్ 24న “పంచాయతీ రాజ్ దివస్” సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్మూ పర్యటన ఏర్పాట్లపై చర్చ కోసం సంయుక్త సన్నాహక సమావేశం జరిగింది.
ఢిల్లీలోని పృథ్వీ భవన్‌లో ఆరు సైన్స్ విభాగాలతో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖల సన్నాహక సమావేశం జరిగింది.
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి గిరిరాజ్ సింగ్ గ్రామీణాభివృద్ధి పంచాయితీ రాజ్ ఇతివృత్తాలతో సైన్స్ & టెక్నాలజీ ఇన్నోవేషన్ ఏకీకరణ, వివిధ అంశాలు, అవకాశాల గురించి చర్చించారు
కార్యక్రమంలో సంప్రదాయ స్టాల్స్‌కు బదులు రైతుల ఆదాయానికి విలువను జోడించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని, పంచాయతీరాజ్ లక్షణాలతో సైన్స్ ఆధారిత ప్రదర్శనలు నిర్వహించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతిపాదించారు.
Posted On:
28 MAR 2022 5:35PM by PIB Hyderabad
ఏప్రిల్ 24, 2022న దేశవ్యాప్త “పంచాయతీ రాజ్ దివస్” వేడుకలను పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో పర్యటించనున్నారు. దీనిపై చర్చించడానికి కేంద్ర సైన్స్ & టెక్నాలజీ కౌన్సిల్ ఆరు సైన్స్ డిపార్ట్‌మెంట్‌లతో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖలు సన్నాహక సంయుక్త సమావేశం నిర్వహించాయి. శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన, డైరెక్టర్ ఆఫ్ బయోటెక్నాలజీ, డైరెక్టర్ ఆఫ్ స్పేస్, డైరెక్టర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లతో ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఈరోజు ఢిల్లీలోని పృథ్వీ భవన్‌లో జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయానికి ఉపయోగపడే అత్యాధునిక సాంకేతికత ఆవిష్కరణలను ప్రదర్శించడం సమావేశం లక్ష్యం.
కేంద్ర రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్; పీఎంఓ (సహాయ), సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, గ్రామీణాభివృద్ధి పంచాయితీ రాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ అంశాలతో సైన్స్ & టెక్నాలజీని ఏకీకృతం చేయడంలో వివిధ అంశాలు అవకాశాలపై చర్చించారు. జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సాంప్రదాయ స్టాల్స్‌కు బదులుగా, రైతుల ఆదాయానికి విలువను జోడించే అత్యాధునిక సాంకేతికతను పంచాయతీ రాజ్ లక్షణాలతో సైన్స్ ఆధారిత ప్రదర్శనను ప్రదర్శించాలని ప్రతిపాదించారు. గ్రామీణాభివృద్ధి పంచాయితీ రాజ్‌కు సంబంధించిన రంగాలలో ఇటువంటి అనేక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు జరుగుతాయని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. జమ్మూలోని పంచాయతీ పల్లి ఈ సంవత్సరం పంచాయతీ రాజ్ దివాస్ ఫంక్షన్‌కు ఎంపికైంది రైతులు, సర్పంచ్‌లు గ్రామ పెద్దలు తమ ఆదాయాన్ని వారి ఉత్పత్తులను మెరుగుపరచుకోవడానికి వీలుగా సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించే ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు. గ్రామీణాభివృద్ధి రైతుల కోసం జియోస్పేషియల్ టెక్నాలజీ, ఐదు రోజుల పాటు వాతావరణ సూచన కోసం రైతులు ఉపయోగించే యాప్‌లు, పర్పుల్ విప్లవంగా ప్రసిద్ధి చెందిన లావెండర్ సాగు, అదే భూమిలో యాపిల్ ఉత్పత్తులను పెంచడానికి బయోటెక్నాలజీ ఆవిష్కరణ వంటి ముఖ్యమైన వాటిని ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పురుగుమందుల పిచికారీ వ్యర్థాల శుద్దీకరణకు డ్రోన్లు వాడటం, అణు వికిరణం ద్వారా పండ్ల జీవితాన్ని పెంచడం మొదలైనవి కూడా ఉంటాయి. ఇలాంటి మరో రెండు సమావేశాల తర్వాత 24 ఏప్రిల్, 2022న జరిగే ఈవెంట్ వివరాలను ఖరారు చేసేందుకు పెద్ద సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. జమ్మూలో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ, లక్షలాది గ్రామ పంచాయతీలు వర్చువల్ పద్ధతిలో అనుసంధానం అవుతాయి. ఈ సమావేశంలో నాగేంద్ర నాథ్ సిన్హా మంత్రిత్వశాఖగ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి , పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్, డీఎస్టీ సెక్రటరీ డాక్టర్ వారి చంద్రశేఖర్, డీఎస్టీ సెక్రెటరీ డాక్టర్ శేఖర్ మండే, డీజీ, సీఎస్ఐఆర్ డాక్టర్ రాజేశ్ గోఖలే, కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ బయోటెక్నాలజీ డాక్టర్ ఎం. రవిచంద్రన్, కార్యదర్శి, మంత్రిత్వశాఖఎర్త్ సైన్సెస్, ఎస్. సోమనాథ్, కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ స్పేస్. జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ గ్రామీణ శాఖ పంచాయతీ రాజ్ కార్యదర్శి మన్‌దీప్ కౌర్ వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు.
***
(Release ID: 1810875)
Visitor Counter : 132