గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆది బజార్ - గుజరాత్, నర్మదా జిల్లాలోని కేవడియా, ఏక్తా నగర్‌లోని ఐక్యతా స్థూపం వద్ద గిరిజన సంస్కృతి, వంటకాల స్పూర్తి వేడుక
ఈ 11 రోజుల వేడుకలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన హస్తకళలు, కళ, పెయింటింగ్‌లు, వస్త్రాలు, ఆభరణాల ప్రదర్శన, అమ్మకాలు
Posted On:
27 MAR 2022 9:39AM by PIB Hyderabad
గిరిజిన సంస్కృతి, వంటకాల స్ఫూర్తి వేడుక అయిన ఆది బజార్ల శ్రేణిలో భాగంగా గుజరాత్, నర్మదా జిల్లాలోని కేవడియా, ఏక్తా నగర్‌లోని ఐక్యతా స్థూపం వద్ద 26 మార్చి 2022న మరొక కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ట్రైఫెడ్ నిర్వహిస్తున్న ఈ 11 రోజుల ప్రదర్శన 26 మార్చిన ప్రారంభమై 5 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని గుజరాత్ రాష్ట్ర , ఉన్నత, సాంకేతిక విద్య, శాసన, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మన్సుఖ్‌భాయ్ దిండోర్, ట్రైఫెడ్ చైర్మన్ శ్రీ రామ్ సింన్హ్ రాత్వా, ఇతర ప్రముఖల సమక్షంలో రాష్ట్ర గిరిజనాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య మంత్రి శ్రీమతి నిమిషాబెన్ సుతార్ ప్రారంభించారు.
ప్రతిష్ఠాత్మకమైన చిహ్నమైన ఐక్యతా స్థూపం వద్ద నిర్వహిస్తున్న ఈ 11 రోజుల ప్రదర్శనలో సేంద్రీయ ఉత్పత్తులు, హస్త కళలతో కూడిన 11 దుకాణాలు దేశంలోని 10 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత తొలి డిప్యూటీ ప్రధాన మంత్రి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమికంగా చేసిన కారణంగానే నేడు భారత్ ఐక్యదేశంగా ఉనికిలో ఉందని పేర్కొన్నారు. కనుక, దేశం ఐక్యతతో, అందరినీ కలుపుకుపోయేలా ఉండాలన్నది ఆయన ప్రధాన ఆకాంక్షలలో ఒకటి. సర్దార్ పటేల్ అవలంబించి, సమర్ధించిన జాతీయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ ప్రతిష్ఠాత్మక స్మారక చిహ్నం నిదర్శనం. పైగా ప్రాథమికంగా ఇది గిరిజన ప్రాంతం. గిరిజన జీవితం, సంస్కృతి, సంప్రదాయాల ఉత్సవమైన ఆదిబజార్ గిరిజనలు అధికంగా ఉన్న ఈ ప్రాంతం జరగడం ఎంతో ఆనంద దాయకంగా ఉంది. ఇది సర్వతోముఖాభివృద్ధికి దారి తీస్తుందని ఆశిస్తూ, వారికి శుభాశీస్సులు తెలియచేస్తున్నాను.
భారతదేశంలో గిరిజనుల ఉపాధిని పెంచడంలో ట్రైఫెడ్ తన కృషిని తీవ్రవతరం చేయడాన్ని కొనసాగించడం హర్షణీయం. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సంస్కృతి మరింతమందికి తెలిసేందుకు ఆది బజార్ తోడ్పడుతుంది. ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా రద్దీతో ఉండడం ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడుతుందని, ప్రారంభోత్సవ సందర్భంగా ట్రైఫెడ్ చైర్మన్ రామ్ సిన్హ్ రాథ్వా అభిప్రాయపడ్డారు.
ఈ 11 రోజుల ఉత్సవంలో దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన హస్తకళలలు, కళలు, పెయింటింగ్‌లు, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన ప్రదర్శన, విక్రయ కేంద్రాలు ఉంటాయి.
మరొక ఆది బజార్‌ను ఒడిషాలోని రూర్కేలాలోని సెయిల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 30 మార్చి నుంచి 8 ఏప్రిల్ 2022వరకు నిర్వహించనున్నారు. గిరిజన జీవనంలోని ప్రాథమిక సంప్రదాయాలు, శైలులకు ప్రాతినిధ్యం వహించే ఈ ఆది బజార్లు, ప్రధానంగా గత రెండేళ్ళలో భారీ ప్రభావితమైన వెనుకబడిన గిరిజనుల ఉపాధులను, మెరుగుపరిచేందుకు ట్రైఫెడ్ చేస్తున్న కృషిలో భాగం. ఈ ఆదిబజార్లు ఈ సామాజిక వర్గాల ఆర్థిక సంక్షేమానికి తోడ్పడడమే కాక వారిని ప్రధాన స్రవంతి అభివృద్దికి చేరువ చేసే చొరవ.
***
(Release ID: 1810346)
Visitor Counter : 168