మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జాతి వైవిధ్య సున్నితత్వం పై సదస్సును నిర్వహించిన జాతీయ మహిళా కమిషన్

Posted On: 26 MAR 2022 5:20PM by PIB Hyderabad

భారతదేశంలోని వివిధ సంస్కృతుల పట్ల అవగాహన పెంపొందించడానికి, విభిన్న ఆచారాల మధ్య పరస్పర అవగాహనను బలోపేతం చేయడానికి వ్యూహాలను సిఫారసు చేయడానికి ఢిల్లీ పోలీస్ కు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అండ్ నార్త్-ఈస్టర్న్ రీజియన్ స్పెషల్ పోలీస్ యూనిట్ (ఎస్ పి యు ఎన్ ఇ ఆర్) సహకారంతో జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సి  డబ్ల్యు) ఈ రోజు ఇక్కడ 'జాతి వైవిధ్య సున్నితత్వం' అనే అంశంపై ఒక సదస్సు ను నిర్వహించింది.

 

ఈ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాలు,విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ కుమార్ రంజన్ సింగ్, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి రేఖా శ ర్మ , జాతీయ మైనారిటీ

కమిషన్ ఆఫిషియేటింగ్ చైర్ పర్సన్ శ్రీమతి సయ్యద్ షాహెజాదీ, బిపిఆర్ అండ్ డి డైరెక్ట ర్ జనరల్ శ్రీ బాలాజీ శ్రీవాత్స వ , ఎస్ పి యు ఎన్ ఇ ఆర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ హిబు తమంగ్ ఈ సదస్సుకు హాజరయ్యారు.

 

ముఖ్య అతిధిగా హాజరైన విదేశీ వ్యవహారాలు , విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ కుమార్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, ఈ సదస్సు జాతీయ సమగ్రత, సమైక్యతా  స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఏర్పాటయిందని, ఇటువంటి సున్నితత్వ

కార్యక్రమాలు మన ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధాసక్తులు పెంచడానికి కచ్చితంగా దోహద పడతాయని అన్నారు.

 

జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్  శ్రీమతి రేఖాశర్మ  మాట్లాడుతూ, 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' ముఖ్యోద్దేశం గురించి నొక్కి చెప్పారు సమాచారాన్ని వ్యాప్తి చేయడం , సంస్కృతి సున్నితత్వాన్ని మార్పిడి చేయడం ఈ సమయం యొక్క అవసరం అని అన్నారు

పరస్పర అవగాహన , నమ్మకం భారతదేశం బలానికి పునాదులని,  పౌరులందరూ భారతదేశం అన్ని మూలలలో సాంస్కృతికంగా ఏకీకృతం కావాలని శ్రీమతి శర్మ అన్నారు. పోలీసులలో  సున్నితత్వం ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు . పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించడానికి కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను  వివరించారు.

 

వివిధ అభిప్రాయాలను తెలుసుకోవడానికి పొందడానికి, కమిషన్ వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించింది; వీరిలో బైచుంగ్ భూటియా - భారత ఫుట్ బాల్ మాజీ కెప్టెన్, సోనమ్ వాంగ్ చుక్, లద్దాఖ్ కు చెందిన ఇండియన్  ఇంజినీర్/ ఇన్నోవేటర్/ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్,  జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిబు తమాంగ్ - స్పెషల్ పోలీస్ కమిషనర్, నార్త్ ఈస్ట్ రీజియన్ స్పెషల్ పోలీస్, ఆదిత్య రాజ్ కౌల్- ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, టీవీ9/ నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ అఫైర్స్, రాబిన్ హిబు- ఐపీఎస్, స్పెషల్ కమిషనర్ ఫర్ పోలీస్, ఆర్మ్డ్ పోలీస్ డివిజన్, ఢిల్లీ పోలీస్,  అండ్ ప్రెసిడెంట్, హెల్పింగ్ హ్యాండ్స్, ఎన్జీవో, తజేందర్ సింగ్ లూథ్రా-నేషనల్ పోలీస్ మిషన్ డైరెక్టర్ , రించెన్ లామో -నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ సభ్యుడు, సోసోషైజా-మాజీ మెంబర్, ఎన్ సి డబ్ల్యు,  పూజా ఎలంగ్బామ్, ఐఎఎస్, ఎస్డిఓ, పోరోంపాట్, ఇంఫాల్ ఈస్ట్,  ప్రొఫెసర్ అజయ్యునియునై- సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్ క్లూజన్ అండ్ ఇన్ క్లూజివ్ పాలసీ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్  ఉన్నారు.

 

మన దేశ భిన్నత్వంలో ఏకత్వ ప్రత్యేకతను ఉత్సవంగా జరుపుకోవడం ,మన దేశ ప్రజల మధ్య సాంప్రదాయకంగా ఉన్న భావోద్వేగ బంధాలను కొనసాగించడం , ఇంకా బలోపేతం చేయడం ఈ సదస్సు లక్ష్యంగా పెట్టుకుంది.విభిన్న జాతులు, సంస్కృతుల పట్ల ఫ్రంట్లైన్ వర్కర్లకు అవగాహన కల్పించడం, ఢిల్లీలో నివసిస్తున్న వివిధ అల్పసంఖ్యాక వర్గాల ప్రతినిధుల్లో జాతి ఘర్షణల వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడంపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఈ చర్చ జరిగింది. విభిన్న జాతులు , సంస్కృతుల పట్ల ఫ్రంట్‌లైన్ కార్మికులకు అవగాహన కల్పించడం , జాతి వివాదాల వల్ల తలెత్తే సమస్యలపై ఢిల్లీలో నివసిస్తున్న వివిధ మైనారిటీ వర్గాల ప్రతినిధులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చ జరిగింది.

 

ప్యానలిస్టుల ప్రసంగాల నుండి కొన్ని భాగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

బైచుంగ్ భూటియా, భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్

 

క్రీడలు అనేది నేపథ్యం ఆధారంగా వివక్షకు గురి కాని మాధ్యమం. ఈశాన్య రాష్ట్రాలకు మరింత ప్రాతినిధ్యం తీసుకురావడంలో క్రీడాకారులు ముఖ్యమైన పాత్ర పోషించారు.

 

సోనమ్ వాంగ్ చుక్, లద్దాఖ్ కు చెందిన ఇంజినీర్/ఇన్నోవేటర్/ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్

 

ఇది భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడే దేశం. ఇది అన్ని దేశాలు చేసేది కాదు. సమగ్రత పరిరక్షణ లో మీడియా మరింత ముఖ్యమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.సినిమాలు, డిజిటల్ , ఎలక్ట్రానిక్ మీడియాతో సహా అన్ని రకాల మీడియా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించ గలదు

 

హిబు తమాంగ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఈశాన్య ప్రాంత స్పెషల్ పోలీస్

 

ఈశాన్య ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఢిల్లీ పోలీసులు అనేక కార్యక్రమాలు చేపట్టారు.

ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకంగా జాతిపరమైన వ్యాఖ్యలు తగ్గాయని, ప్రజలు మరింత అవగాహన పెంచుకున్నారని గత 5 సంవత్సరాల నా సేవలో నేను చూశాను.

 

రిన్చెన్ లామో, సభ్యుడు, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్

 

లడఖ్ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది.  ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలను తెరిచినందుకు, లద్దాఖ్ లో  జరుగుతున్న అభివృద్ధికి ప్రభుత్వానికి ధన్యవాదాలు.

 

అజయ్యునియుమై, హెడ్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్ క్లూజన్ & ఇన్ క్లూజివ్ పాలసీ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్.

 

ఈశాన్యం నుండి వచ్చిన మహిళలను సులభమైన ఎరగా భావిస్తారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల పట్ల జాతిపరమైన వైఖరి అజ్ఞానం నుండి ఉద్భవించింది.. అనేక జాతి పరమైన సంఘటనలు జరిగాయి, అవి చాలా దురదృష్టకరమైనవి, అయినప్పటికీ పరిస్థితులు ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయి.

 

పూజా ఎలంగ్బమ్, ఐఎఎస్, ఎస్డిఓ, పోరోంపాట్, ఇంఫాల్ ఈస్ట్

 

లింగం సామాజిక నిర్మాణం అయినట్లే జాతి కూడా ఒక సామాజిక నిర్మాణం. వివిధ విభాగాలు మరియు సంస్థలకు చెందిన వ్యక్తులు కలిసి రావడానికి ఇది ఒక ముఖ్యమైన వేదిక. సమస్యను పరిష్కరించగల ప్రముఖ రంగాలలో విద్య ఒకటి. మన విద్యావిధానం , పాఠ్యప్రణాళిక భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది చిన్న వయస్సు నుండి అవసరమైన సున్నితత్వాన్ని పెంపొందిస్తే, అది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

 

సోసో షైజా, మాజీ సభ్యుడు, ఎన్ సి డబ్ల్యు

 

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన విభేదాలను అంగీకరించడం. భారతదేశ పౌరులుగా, మనం ఇతర వర్గాలను అంగీకరించి, గౌరవించగలిగితే, అప్పుడు మనం దూరమైనట్లు భావించము. అందువల్ల, అంగీకారం అనేది అత్యంత ముఖ్యమైన సాధనం.

 

తేజేందర్ సింగ్ లూథ్రా, డైరెక్టర్, నేషనల్ పోలీస్ మిషన్

 

ప్రకృతి మనందరినీ ప్రత్యేకంగా చేసింది మనకు విభిన్న రంగులు ఉన్నప్పటికీ , మనం విభిన్న భాషలను మాట్లాడినప్పటికీ, మనమందరం విశ్వసనీయం, ప్రత్యేకం, విలక్షణం మన సొంతం.

*****



(Release ID: 1810099) Visitor Counter : 212