సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

శిశు సంర‌క్ష‌ణ సెల‌వు (సీసీఎల్‌)

Posted On: 23 MAR 2022 12:27PM by PIB Hyderabad

కేంద్ర ప్ర‌భుత్వ వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసులు మరియు పోస్టులకు నియమించబడిన మహిళా ఉద్యోగులు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్, 1972లోని రూల్ 43-సీ ప్రకారం ఈ కింది సంద‌ర్భాల మేర‌కు  శిశు సంర‌క్ష‌ణ సెల‌వు (చైల్డ్ కేర్ లీవ్-సీసీఎల్‌)న‌కు అర్హులు:
 (i) 18 సంవత్సరాల వయస్సు వరకు  ఇద్దరు పెద్ద పిల్లల సంరక్షణ కోసం మొత్తం స‌ర్వీసులో గరిష్టంగా ఏడు వందల ముప్పై రోజులు.
(ii) వికలాంగ పిల్లల విషయంలో వయోపరిమితి లేదు.
(iii) క్యాలెండర్ సంవత్సరంలో అక్షరాల మూడు సార్ల‌ కంటే ఎక్కువ కాకుండా
(iv) ఒక వేళ ఒంట‌రి మహిళా ప్రభుత్వోద్యోగి విషయంలోనైతే  క్యాలెండర్ సంవత్సరంలో మూడు ద‌ఫాల‌లో సీసీఎల్‌ మంజూరు చేయడాన్ని ఏడాదిరిక ఆరు స్పెల్‌లకు పొడిగించబడుతుంది.
నియమం 43-C (3) ప్రకారం ప్రొబేషనర్‌కు సీసీఎల్‌ సెలవు మంజూరుకు గాను సంబంధిత సెల‌వునిచ్చేఅధికారి సంతృప్తి చెందిన కొన్ని తీవ్రమైన పరిస్థితులలో మినహా.. ప్రొబేషన్ వ్యవధిలో సీసీఎల్ సాధారణంగా మంజూరు చేయబడదు, మంజూరీలో త‌క్కువ మొత్తాన‌ సెలవు అందించబడుతుంది. సీసీఎల్‌ (సెలవు) రూల్స్, 1972 యొక్క రూల్ 43-సీ ప్రకారం, సీసీఎల్ ని హక్కుగా డిమాండ్ చేయలేరు మరియు ఎటువంటి పరిస్థితుల్లోనూ ముందస్తు అనుమతి లేకుండా ఏ ఉద్యోగి సీసీఎల్‌లో కొనసాగకూడదు.
 సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మరియు ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు లోక్‌సభలో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****



(Release ID: 1809031) Visitor Counter : 265