అంతరిక్ష విభాగం
మిషన్ గగన్‌యాన్
Posted On:
23 MAR 2022 1:13PM by PIB Hyderabad
గగన్ యాన్ కార్యక్రమ ప్రస్తుత స్థితిగతులు దిగువన పేర్కొన్నట్టు ఉన్నాయిః
వ్యోమగామి శిక్షణ కేంద్రాన్ని బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. శిక్షణా కార్యక్రమాలు నూతనంగా ప్రారంభించిన వ్యోమగామి శిక్షణా కేంద్రంలో పురోగమన దిశలో ఉన్నాయి.
గగన్ యాన్ కి అవసరమైన వ్యవస్థల, ఉపవ్యవస్థల నమూనా పూర్తి అయింది. అంతరిక్ష నౌక నిర్మాణం వివిధ దశల్లో ఉంది. హ్యూమన్ రేటెడ్ (మానవులను తరలించగల) క్రయోజెనిక్ ఇంజన్ దీర్ఘకాల అర్హత పరీక్ష, హ్యూమన్ రేటెడ్ వికాస్ ఇంజిన్ తొలి దశ పరీక్ష పూర్తి అయింది. గగన్ యాన్ సర్వీస్ మాడ్యూల్ చోదన వ్యవస్థ తలి దశ నిరూపణ పరీక్షలు పూర్తి అయ్యాయి.
సేవలను అందించే వారితో సహా క్షేత్రస్థాయి నెట్‌వర్క్ కోసం కాన్సెప్ట్ డెమాన్‌స్ట్రేషన్ ద్వారా రూఢి చేయడం పూర్తి అయింది.
కక్షీయ మాడ్యూల్ తయారీ కోసం సమగ్ర కేంద్ర నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉంది.
అటు జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో ఎంఒయు, కాంట్రాక్టులు, అమలు ఏర్పాట్లు (ఐఎ)కి సంబంధించిన కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. మానవ కేంద్రంగా వివిధ ఉత్పత్తుల ఆకృతి/ రూపకల్పన పూర్తి అయింది, వివిధ మూలరూపాలకు వాస్తవ రూపం ఇస్తున్నారు. ఎం/ ఎస్ గ్లావ్‌కోస్మోస్ (రష్యా), సిఎన్ఇఎస్ (ఫ్రాన్స్) చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి ఉత్పత్తుల బట్వాడా సంస్థను చేరుకోవడం ప్రారంభమైంది.
క్రూ రికవరీ ఆపరేషన్ల (జాతీయ భద్రతకు అవసరమైన కీలకమైన పరికరాలు, సిబ్బంధి కోసం వెతికి, గుర్తించి, వెనక్కి తేవడంలో పాత్ర, బాధ్యతలు కేటాయించి, రిహార్సిల్స్‌ను ఖరారు చేశారు. నామమాత్రపు మిషన్ల పరిస్థితుల కోసం వివరణాత్మక కార్యాచరణ అవసరాలను రూపొందించారు.
సూక్ష్మగురుత్వాకర్షణ అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ప్రయోగాల కోసం ఊహాత్మక నమూనా సమీక్ష కింద ఉంది.
హార్డ్ వేర్ మూలరూపం, పరికరాల సరఫరా, ఆరోగ్య పర్యవేక్షణా పరికరాలు, వర్చువల్ రియాలిటీ తదితర వివిధ గగన్‌యాన్ కార్యకలాపాల కోసం ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది.
ఈ సమాచారాన్ని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు &పింఛన్లు, ప్రధానమంత్రిత్వ కార్యాలయ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బుధవారం లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
(Release ID: 1808823)
Visitor Counter : 267