ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

181.89 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 52 లక్షలకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 23,087 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య; మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,778

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.36%

Posted On: 23 MAR 2022 9:34AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 181.89 కోట్ల ( 1,81,89,15,234) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,14,87,809 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 52 లక్షలకు పైగా ( 52,10,775 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10403185

రెండో డోసు

9992561

ముందు జాగ్రత్త డోసు

4379371

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18412362

రెండో డోసు

17492689

ముందు జాగ్రత్త డోసు

6703788

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

5210775

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

56396784

రెండో డోసు

36118886

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

553950209

రెండో డోసు

460840292

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202637680

రెండో డోసు

184111064

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126660199

రెండో డోసు

114677771

ముందు జాగ్రత్త డోసు

10927618

ముందు జాగ్రత్త డోసులు

2,20,10,777

మొత్తం డోసులు

1,81,89,15,234

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 23,087 కి కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.05 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. గత 24 గంటల్లో 2,542 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,73,057 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,778 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

 

 

గత 24 గంటల్లో మొత్తం 6,77,218 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.42 కోట్లకు పైగా ( 78,42,90,846 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.36 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.26 శాతం వద్ద ఉంది.

 

****


(Release ID: 1808576) Visitor Counter : 199