కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జనవరి 2022లో ఈపీఎఫ్ఓ లో కొత్తగా 15. 29 లక్షల సభ్యుల చేరిక

Posted On: 20 MAR 2022 6:02PM by PIB Hyderabad

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) లో 2022 జనవరి నెలలో కొత్తగా 15.29 లక్షల మంది సభ్యులు చేరారు. ఈ రోజు ఈపీఎఫ్ఓ తాత్కాలిక పేరోల్ డేటా విడుదల అయ్యింది. 2021 డిసెంబర్ నెలతో  పోలిస్తే 2022 జనవరి లో ఈపీఎఫ్ఓ లో చేరిన  నికర సభ్యుల సంఖ్య 2.69 లక్షలకు పైబడి ఎక్కువగా ఉంది. 

జనవరి నెలలో   కొత్తగా చేరిన 15.29 లక్షల మంది సభ్యులలో 8.64 లక్షల మంది తొలిసారిగా సామాజిక భద్రత అందిస్తున్న ఈపీఎఫ్, ఎంపీ చట్టం 1952 పరిధిలో  ఈపీఎఫ్ఓ సభ్యత్వం తీసుకున్నారు. ఈపీఎఫ్ఓ నుంచి దాదాపు 6.65  లక్షల మంది నికర సభ్యులు నిష్క్రమించితిరిగి ఇపిఎఫ్‌ఓలో చేరారు. చందాదారులు తుది పరిష్కారం కోసం కాకుండా తమ సభ్యత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈపీఎఫ్ఓ సభ్యత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య 2021 జూలై నెల నుంచి తగ్గుతూ వస్తోంది. 

వయస్సువారిగా సభ్యుల వివరాలను పరిశీలిస్తే జనవరి  నెలలో ఈపిఎఫ్ఓలో 18-25 మధ్య వయసులో ఉన్నవారు అత్యధికంగా సభ్యులుగా చేరారు. 18-25 మధ్య వయస్సు ఉన్న 6.90 లక్షల మంది  ఈపీఎఫ్ఓ లో సభ్యత్వం తీసుకున్నారు. వీరి తర్వాత వారు  ఈపీఎఫ్ఓ లో సభ్యత్వం తీసుకున్నారు. ఈపీఎఫ్ఓ లో 29-35 మధ్య వయస్సు ఉన్న 3.23 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు.  ఈ వివరాలను పరిశీలిస్తే సంఘటిత రంగంలో  తొలిసారిగా ఉపాధి పొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది.  వ్యక్తిగత ఆదాయ అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగాల్లో చేరుతున్న వారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం కలిగి ఉంటారు. 

రాష్ట్రాల వారీగా గణాంకాల విశ్లేషణ  ప్రకారంమహారాష్ట్రహర్యానాగుజరాత్తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలు ఉపాధి కల్పనలో ముందంజలో ఉన్నాయి.మహారాష్ట్రహర్యానాగుజరాత్తమిళనాడుకర్ణాటక రాష్ట్రాల నుంచి  అన్ని వయసులకు చెందిన 9.33 లక్షల మంది ఈపీఎఫ్ఓ నికర చందాదారులుగా చేరారు. మొత్తం చందాదారులు సంఖ్యలో ఇది 61%గా ఉంది. 

జనవరి నెల పేరోల్ డేటాను  స్త్రీ పురుషుల వారీగా  విశ్లేషిస్తే ఈపీఎఫ్ఓ లో 3.20 లక్షల మంది మహిళలు సభ్యులుగా చేరారు. మొత్తం సభ్యుల సంఖ్యలో మహిళలు 21% వరకు ఉన్నారు.    2021 డిసెంబర్   నెలలో ఈపీఎఫ్ఓ లో చేరిన మహిళల సంఖ్యతో పోల్చి చూస్తే   ఈపీఎఫ్ పథకం లో 57,722 మంది మహిళలు ఎక్కువగా చేరారు. 

పరిశ్రమల వారీగా చూస్తే " ప్రత్యేక తరగతి" ( మానవ వనరుల కల్పనా సంస్థలుప్రైవేటు సెక్యూరిటీ సంస్థలుచిన్న కాంట్రాక్టర్లు) జాబితా కిందికి వచ్చే వారు జనవరి నెలలో   అత్యధికంగా 39.95% వరకు సభ్యులుగా ఉన్నారు. భవన నిర్మాణంవ్యాపార సంస్థలుఇంజనీరింగ్ఎలక్ట్రికల్ మెకానికల్సాధారణ ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేస్తున్న వారు కూడా  ఈపీఎఫ్ఓ   సభ్యులుగా ఎక్కువగా  చేరుతున్నారు. 

డేటా ఉత్పత్తి మరియు ఉద్యోగుల రికార్డులను నవీకరించడం నిరంతర ప్రక్రియగా సాగుతుంది. దీనితో ప్రస్తుత వివరాలు తాత్కాలిక వివరాలుగా ఉంటాయి. ప్రతినెలా వివరాలను ఆధునీకరించడం జరుగుతుంది.  ఈపీఎఫ్ఓ   సెప్టెంబర్ 2017 కాలం తర్వాత నమోదైన పేరోల్ డేటాను ఏప్రిల్2018 నుండి విడుదల చేస్తోంది.

సంఘటిత రంగానికి చెందిన ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్భీమా,పెన్షన్ వంటి  సామాజిక భద్రత సౌకర్యాలను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మెసిలేనిస్ చట్టం 1952 కింద    ఈపీఎఫ్ఓ    అందిస్తున్నది.  ఇటీవల కాలంలో ఈపీఎఫ్ఓ  సామజిక మాధ్యమాలను ఎక్కువగా వుప్పగిస్తున్నది. ట్విట్టర్వాట్సాప్పేస్ బుక్ ల ద్వారా సభ్యుల సమస్యల పరిష్కారానికి సంస్థ కృషి చేస్తున్నది. 

 

***


(Release ID: 1807467) Visitor Counter : 176