ఉక్కు మంత్రిత్వ శాఖ
డ్రోన్ ఆధారిత ఖనిజాన్వేషణకు ఐఐటీ ఖరగ్‌పూర్‌తో ఎన్ఎండీసీ అవగాహన ఒప్పందం
Posted On:
19 MAR 2022 11:39AM by PIB Hyderabad
ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ దేశంలో అతిపెద్ద ముడి ఇనుము ఉత్పత్తిదారు 'నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఎన్ఎండీసీ) డ్రోన్ ఆధారిత ఖనిజ అన్వేషణ చేపట్టనుంది. ఇందుకోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌తో బుధవారం ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. జీ4 స్థాయి నుండి యుఎన్ఎఫ్‌సీ యొక్క వివరణాత్మక జీ1 స్థాయి వరకు రాగి, రాక్ ఫాస్ఫేట్, లైమ్‌స్టోన్, మాగ్నసైట్, వజ్రాలు, టంగ్‌స్టన్ మరియు బీచ్ సాండ్స్ వంటి విస్తృత శ్రేణి ఖనిజాల కోసం ఎన్ఎండీసీ ఆరు దశాబ్దాలుగా ఖనిజాలను అన్వేషిస్తోంది. 'డ్రోన్-ఆధారిత ఖనిజ అన్వేషణ'కు సంబంధించిన అవగాహన ఒప్పందం వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌పై సంతకం చేయబడింది, ఈ కార్యక్రమానికి సీఎండీ శ్రీ సుమిత్ దేబ్ హాజరయ్యారు; ఎన్ఎండీసీ సంస్థ నుంచి శ్రీ అమితవ ముఖర్జీ, డైరెక్టర్ (ఫైనాన్స్); శ్రీ సోమనాథ్ నంది, డైరెక్టర్ (టెక్నికల్); శ్రీ డి.కె.మొహంతి, డైరెక్టర్ (ప్రొడక్షన్) పాల్గొనగా ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఈ అవగాహన ఒప్పందంపై ఎన్‌ఎండీసీ తరపున డైరెక్టర్ (ప్రొడక్షన్) శ్రీ డికె మహంతి మరియు ఐఐటీ ఖరగ్‌పూర్ తరపున జియాలజీ & జియోఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడి ప్రొఫెసర్ ఎస్పీశర్మ మరియు మైనింగ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడి ప్రొఫెసర్ సమీర్ కె పాల్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండీసీ సంస్థ సీఎండీ శ్రీ సుమిత్ దేబ్ మాట్లాడుతూ, “దేశంలో ఖనిజాన్వేషణకు భారతదేశంలో డ్రోన్ ఆధారిత జియోఫిజికల్ సర్వేలు మరియు హైపర్‌స్పెక్ట్రల్ స్టడీస్‌ను నిర్వహిస్తున్న మొదటి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ. ఐఐటీ-ఖరగ్‌పూర్‌తో ఎన్ఎండీసీ సంస్థ జట్టుకట్టడం కొత్త అధ్యాయానికి తెరతీస్తుంది మరియు దేశం కోసం ఖనిజ అన్వేషణ రంగంలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. ” ఎన్ఎండీసీ సంస్థ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఖనిజాల కోసం మరియు చత్తీస్‌గఢ్‌లోని బెలోడా-బెల్ముండి బ్లాక్‌లో వజ్రాల కోసం అన్వేషణలను నిర్వహిస్తోంది. సెంట్రల్ ఇండియన్ డైమండ్ ప్రావిన్స్‌లో స్పేస్ జియోఫిజిక్స్‌ను ఉపయోగించిన మొదటి సీపీఎస్ఈ ఎన్ఎండీసీ. దీనికి తోడుగా సమాచార అన్వేషణ యొక్క ఆన్‌లైన్ పర్యవేక్షణను భువన్ ప్లాట్‌ఫారమ్‌లో డేటా ఉపయోగించిన మొదటిది సంస్థ కూడా ఇదే. అన్వేషణ మరియు మైనింగ్‌కు సంబంధించిన దాని డేటాబేస్ యొక్క సాంకేతిక ఆవిష్కరణ, డిజిటలైజేషన్ వ్యవస్థ పై ఎన్ఎండీసీ ఎక్కువగా ఆధారపడుతోంది. డ్రోన్‌ల విధానాన్ని ప్రారంభించడంతో, భారతదేశంలో డ్రోన్ వినియోగం మరియు కార్యకలాపాలను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి ప్రభుత్వం తొలి అడుగు వేసింది, వీటిని ప్రస్తుతం వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, అటవీ, మైనింగ్, విపత్తు నిర్వహణ, నిఘా, రవాణా మొదలైన రంగాలలో ఉపయోగిస్తున్నారు. మైనింగ్ కోసం డ్రోన్ (యుఏవీ)ని ఉపయోగించి అన్వేషణ కోసం ఎన్ఎండీసీ మరియు ఐఐటీ ఖరగ్‌పూర్ స్పెక్ట్రల్ ఉత్పత్తులు, పద్ధతులు మరియు అల్గారిథమ్‌లను అభివృద్ధి చేస్తాయి. ఎన్ఎండీసీ మరియు ఐఐటీ ఖరగ్‌పూర్ మధ్య సహకారం ఖనిజ తవ్వకం కోసం సాఫ్ట్‌వేర్ స్పెక్ట్రల్ సాధనాల అభివృద్ధికి మరియు మైనింగ్ టెక్నాలజీపై సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు దారి తీస్తుంది.
****
(Release ID: 1807445)
Visitor Counter : 230