వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారులు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుపోవడం ద్వారా ప్రమాణాల ప్రోత్సాహక కార్యకలాపాలను ఉధృతం చేయనున్న బిఐఎస్
Posted On:
19 MAR 2022 1:51PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రతీకాత్మక వారోత్సవాల సందర్భంగా బిఐఎస్ ప్రమాణాల ప్రోత్సాహక కార్యకలాపాలలో వినియోగదారుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుపోయేందుకు బిఐఎస్ కేంద్ర కార్యాలయంలో వెబినార్‌ను నిర్వహించడం జరిగింది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వినియోగదారుల ఉద్యమ ఉద్భవం, నాణ్యత వ్యవస్థను మెరుగుపరచడంలో అది పోషించిన కీలక పాత్రను బిఐఎస్ డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ వెబినార్ ను ప్రారంభిస్తూ వివరించారు. ప్రమాణాల అభివృద్ధిలో వినియోగదారుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పోషించిన పాత్రను, ప్రభుత్వానికి, నియంత్రణదారులు, సామాన్య వినియోగదారుల మధ్య ఈ సంస్థలు ఎలా వారధిలా వ్యవహరిస్తాయి అనే విషయాలను వివరించారు. దీనితోపాటుగా, బిఐఎస్ ప్రమాణాల ప్రోత్సాహక కార్యకలాపాలను తీవ్రతరం చేయవలసిన అవసరాన్ని కూడా శ్రీ తివారీ వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన 200కిపైగా ప్రతినిధులు వెబినార్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా థింక్, నడ్జ్ & మూవ్ విభాగం అధిపతి శ్రీ చందన్ బాల్ మాట్లాడుతూ, బిఐఎస్ చేపట్టిన ప్రమాణాల ప్రోత్సాహక కార్యకలాపాలు, స్వచ్ఛందన, వినియోగదారుల సంస్థలు ఆ కార్యకలాపాలలో ఎక్కడెక్కడ నిమగ్నం కావచ్చో ప్రతినిధులకు వివరించారు. ప్రమాణాల క్లబ్లుల నిర్వహణ, చైతన్యపరిచే కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారాలు సహా ప్రమాణాల ప్రోత్సాహక కార్యకలాపాలలో వినియోగదారుల, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుపోయేందుకు బిఐఎస్ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలను ఆయన వివరించారు.
ఇటీవలే బిఐఎస్ అభివృద్ధి చేసిన కన్స్యూమర్ ఎంగేజ్‌మెంట్ పోర్టల్‌ను పాల్గొన్నవారికి ప్రదర్శించారు. తమ ప్రత్యేక ఎన్జీవో దర్పన్ కార్డును, పాన్ కార్డు నెంబరును వినియోగించి బిఐఎస్‌తో వినియోగదారుల, స్వచ్ఛంద సంస్థలు సులువుగా నమోదు చేసుకోవడం అనే అంశాన్ని ఇందులో పొందుపరిచారు. బిఐఎస్ జారీ చేసిన మార్గర్శకాలను, అందించే కార్యక్రమాలతో సహకరించేందుకు వినియోగదారుల, స్వచ్ఛంద సంస్థలు అందించే ప్రతిపాదనలను చూసేందుకు సంబందించిన ప్రక్రియలను కూడా ప్రదర్శించారు.
వెబినార్‌లో వినియోగదారుల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చురుకుగా పాల్గొని, బిఐఎస్ చొరవను ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ప్రమాణాలు, నాణ్యత సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు బిఐఎస్‌తో సహకరించేందుకు ఎదురుచూస్తున్నామని వారు వెల్లడించారు.
***
(Release ID: 1807444)
Visitor Counter : 200