ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2021-22 ఆర్థిక సంవత్సరంలో 13,63,038 కోట్ల రూపాయల మేరకు

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 48.4% కంటే ఎక్కువ వృద్ధి సాధించిన పన్ను వసూళ్లు

2021-22 ఆర్థిక సంవత్సరం (4వ విడత వరకు)లో 16.03.2022 నాటికి 6,62,896.3 కోట్ల రూపాయల వరకు ముందస్తు పన్ను వసూళ్లు


40.75% వరకు పెరిగిన ముందస్తు పన్ను వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,87,325.9 కోట్ల రూపాయల మేరకు పన్ను వాపసు

Posted On: 17 MAR 2022 6:29PM by PIB Hyderabad

దేశంలో  2021-22 ఆర్థిక సంవత్సరంలో 16.03.2022 నాటికి 13,63,038 కోట్ల రూపాయల మేరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి పన్ను వసూళ్లు  9,18,430.5 కోట్ల రూపాయలుగా ఉన్నాయి . 2020-21 ఆర్థిక సంవత్సరం వసూళ్లతో పోల్చి చూస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు 48.41% మేరకు పెరిగాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే పన్ను వసూళ్లలో 42.50% వృద్ధి కనిపించింది. 2019-20లో 9,56,550.3 కోట్ల రూపాయలు  ప్రత్యక్ష   పన్నులు గా వసూలు అయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే  ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 34.96% వృద్ధి నమోదయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో 10.,982.9 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. 

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 16.03.2022 నాటికి ఉన్న  13,63,038.3 కోట్ల రూపాయలలో 7,19,035.0 రూపాయల   కార్పొరేషన్ పన్ను (సీఐటీ ), 6,40,588.3 కోట్ల రూపాయల వరకు వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ ( పిట్   )(నికర వాపసు  ) ఉన్నాయి.   16.03.2022 నాటికి11.08 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేయాలని (బీఈ) నిర్ణయించుకుని   13,63,038.3 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది.  సవరించిన అంచనా (ఆర్ ఈ) లక్ష్యం  12.50 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.  

 

 2021-22 ఆర్థిక సంవత్సరంలో  (16.03.2022 నాటికి) ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు  (వాపసుల కోసం సర్దుబాటు చేయడానికి ముందు)  15,50,364.2 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.   2019-20 ఆర్థిక సంవత్సరంలో 11,34,706.3 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు జరిగాయి. 2018-19 ఆర్థిక  సంవత్సరంలో పన్ను వసూళ్లు 11,68,048.7 కోట్ల రూపాయల వరకు జరిగాయి. 

 15,50,364.2 కోట్ల రూపాయల స్థూల పన్ను వసూళ్లలో  8,36,838.2 కోట్ల రూపాయల కార్పొరేషన్ పన్ను (సిఐటి) ,  మరియు వ్యక్తిగత ఆదాయపు పన్ను ( పిట్  సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ( పిట్  ) 7,10,056.8 కోట్ల రూపాయలు ఉన్నాయి.   మైనర్ హెడ్ వారీగా   (16.03.2022 నాటికి) 6,62,896.3 కోట్ల రూపాయల   అడ్వాన్స్ పన్ను, మూలం వద్ద పన్ను మినహాయించబడిన   6,86,798.7 కోట్ల రూపాయలు సెల్ఫ్ అసెస్‌మెంట్ పన్ను   1,34,391.1 కోట్ల రూపాయలు రెగ్యులర్ అసెస్‌మెంట్ పన్నుగా  55,249.5 కోట్లుడివిడెండ్ పంపిణీ పన్నుల రూపంలో  రూ. 7,486.6 కోట్లు మరియు ఇతర మైనర్ హెడ్స్ కింద  3,542.1 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు ఉన్నాయి. 

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంచిత అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు  16.03.22 నాటికి 6,62,896.3 కోట్ల రూపాయలుగా ఉన్నాయి ముందస్తు పన్ను వసూళ్లు గత ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే  40.75% (సుమారు) వృద్ధిని కనబరిచాయి.  ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 లో  సంబంధిత కాలానికి ఈ మొత్తం 4,70,984.4 కోట్ల రూపాయలుగా ఉంది.   16.03.2022 నాటికి ( 2021-22 ఆర్థిక సంవత్సరం )  సంచిత అడ్వాన్స్ పన్ను వసూళ్లు జరిగిన  6,62,896.3 కోట్లు ముందస్తు పన్ను వసూళ్లు (సంచిత) 2019-20 ఆర్థిక సంవత్సరంలో సంబంధిత కాలంలో జరిగిన   4,40,281.4 కోట్ల రూపాయలతో పోల్చి చూస్తే   50.56% వృద్ధిని చూపుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి ముందస్తు పన్ను వసూళ్లు (సంచితం) రూ. 5,06,714.2 కోట్లుగా ఉంది.2018-19 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే  2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 30.82%గా ఉంది. 

16.03.2022 నాటికి  6,62,896.3 కోట్ల రూపాయలుగా ఉన్న అడ్వాన్స్ ట్యాక్స్ లో  కార్పొరేషన్ ట్యాక్స్ (సిఐటి) రూ. 4,84,451.8 కోట్లు మరియు వ్యక్తిగత ఆదాయపు పన్ను (  పిట్   రూ. 1,78,441.1 కోట్ల రూపాయలు ఉన్నాయి.  బ్యాంకుల నుంచి  మరింత సమాచారం కోసం వేచి ఉన్నందున ఈ మొత్తం పెరుగుతుందని భావిస్తున్నారు.

 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,87,325.9 కోట్ల రూపాయల వరకు రిఫండ్ చేయబడింది. 

***


(Release ID: 1807072) Visitor Counter : 261