సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మాన్యువల్ స్కావెంజింగ్ కారణంగా మరణాలు
Posted On:
16 MAR 2022 2:07PM by PIB Hyderabad
ఎంఎస్ చట్టం, 2013లోని సెక్షన్ 5 ప్రకారం నిర్వచించిన విధంగా మానవ విసర్జిత వ్యర్ధాల ప్రక్రియ (మాన్యువల్ స్కావెంజింగ్) కారణంగా మరణాలు సంభవించినట్టు ఎటువంటి నివేదిక అందక పోవడంతో ఈ అంశంపై నేషనల్ సఫాయి కరంచారి ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎలాంటి సర్వే నిర్వహించలేదు.
తమిళనాడులో మాన్యువల్ స్కావెంజింగ్ వల్ల మరణాలు లేవు. అయితే, మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంక్‌లను ప్రమాదకర పరిస్థితుల్లో శుభ్రపరచడం మరియు " ప్రొహిబిషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ రిహాబిలిటేషన్ రూల్స్ , 2013" కింద సూచించిన భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల 43 మంది ప్రాణాలు కోల్పోయారు .
సఫారీ కార్మికుల (ఎస్ఆర్ఎమ్ఎస్) పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తోంది. గుర్తించబడిన సఫారీ కార్మికులకు స్వయం ఉపాధి కల్పించి వారికి పునరావాసం కల్పించేందుకు అమలు చేస్తున్న పథకం కింద సహాయం అందించడానికి క్రింది నిబంధనలు అమలు జరుగుతున్నాయి :-
i. కుటుంబంలో గుర్తించబడిన సఫారీ కార్మికునికి ఒకసారి సహాయంగా నగదు రూపంలో 40,000 రూపాయలు అందించడం
ii. సఫారీ కార్మికులు మరియు వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ. శిక్షణ కాలంలో నెలకు 3,000 రూపాయల చొప్పున రెండు సంవత్సరాల వరకు స్టైపెండ్ .
iii. పారిశుద్ధ్య సంబంధిత ప్రాజెక్టులతో సహా స్వయం ఉపాధి ప్రాజెక్టుల కోసం రుణాలు పొందిన వారికి 5.00 లక్షల రూపాయల వరకు మూలధన సబ్సిడీ.
iv. గుర్తించబడిన మాన్యువల్ సఫారీ కార్మికుల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా.
గత ఐదేళ్లలో పథకం కింద ప్రయోజనం పొందిన సఫారీ కార్మికులు మరియు వారిపై ఆధారపడిన వారి వివరాలు :-
( లబ్ధిదారుల సంఖ్య)
సంవత్సరం
|
ఒక సారి నగదు సహాయం
|
నైపుణ్యాభివృద్ధి శిక్షణ
|
మూలధన సబ్సిడీ
|
2016-17
|
1357
|
4273
|
196
|
2017-18
|
1171
|
334
|
159
|
2018-19
|
18079
|
1682
|
144
|
2019-20
|
13246
|
2532
|
107
|
2020-21
|
14692
|
6204
|
157
|
సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు అందించారు.
***
(Release ID: 1806678)
Visitor Counter : 190