కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
2021-22 ఆర్ధిక సంవత్సరానికి 8.10 శాతం వడ్డీరేటును సిఫార్సుచేసిన ఇపిఎఫ్ సెంట్ర్ బోర్డ్ ట్రస్టీలు
Posted On:
12 MAR 2022 4:30PM by PIB Hyderabad
ఇపిఎఫ్ సెంట్రబ్ బోర్డుట్రస్టీల 230వ సమావేశం, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వారం సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి , పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగింది. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన, పెట్రోలియం సహజవాయువుల శాఖ సహాయమంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ఉపాధ్యక్షత వహించగా, కో ఛైర్మన్ షిప్‌గా కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సునీల్ బరత్‌వాల్,మెంబర్ సెక్రటరీ శ్రీమతి నీలం షమీరావ్, కేంద్ర పిఎఫ్ కమిషనర్ లు సమావేశంలో పాల్గొన్నారు.
2021-22 ఆర్ధిక సంవత్సరం నాటికి ఇపిఎఫ్ ఖాతాదారుల ఖాతాలలో జమ అయిన మొత్తానికి 8.10 శాతం వార్షిక వడ్డీ రేటు ఇవ్వాలని ఇపిఎఫ్ సెంట్రల్ బోర్డు , సిఫార్సు చేసింది. వడ్డీరేటును ప్రభుత్వ అధికారిక గెజిట్‌లో నోటిఫై చేస్తారు. అనంతరం ఇపిఎఫ్ తన ఖాతాదారుల ఖాతాలలో ప్రకటించిన వడ్డీరేటు ప్రకారం వడ్డీని జమచేస్తుంది.
పెట్టుబడుల విషయంలో ఇపిఎఫ్ఒ కన్సర్వేటివ్ విధానం అనుసరిస్తున్నప్పటికీ అది గత ఎన్నో సంవత్సరాలుగా అధిక రాబడి సాధిస్తూ రావడంతో అది తన ఖాతాదారులకు ఎక్కువ వడ్డీరేటును పంపిణీ చచేస్తూ వచ్చింది. వివిధ ఆర్ధిక సమయాలలో కనీస క్రెడిట్ రిస్క్ తో దీనిని అందిస్తూ వచ్చింది.
సంప్రదాయకంగా ఇపిఎఫ్ఒ ఇతర అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల తో పోల్చినపుడు రిటైర్మెంట్ సేవింగ్స్ పై ఎక్కువ వడ్డీరేటు ఇవ్వగలుగుతూ వచ్చింది. పెట్టుబడి విధానాన్ని జాగ్రత్తగా అనుసరించడం, దీర్ఘకాలిక ,ఎక్కువరాబడి ఇచ్చే సెక్యూరిటీలలో గత ఎన్నోదశాబ్దాలుగా పెట్టుబడి పెట్టడం వల్ల ఇది సాధ్యమైంది.గత దశాబ్దకాలంగా రాబడి తగ్గుతూ వచ్చినప్పటికీ ఇపిఎఫ్ఒ పెట్టుబడులు దశాబ్దకాలంగా పెరుగుతూ వచ్చాయి.
2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇపిఎఫ్ఓ తనకు చెందిన ఈక్విటీలుగా ఉన్న కొన్ని పెట్టుబడులను లిక్విడేట్ చేయాలని నిర్ణయించింది. ఇపిఎఫ్ఒ ప్రస్తుతం సిఫార్సుచేసిన వడ్డీరేటు , రుణ పెట్టుబడుల నుంచి వచ్చే వడ్డీ, ఈక్విటీ పెట్టుబడులపై వచ్చే రాబడి ల ఉమ్మడి రాబడి ఆధారంగా దీనిని సిఫార్సుచేశారు. ఇది ఇపిఎఫ్ఒ తన ఖాతాదారులకు అధిక రాబడిన అందించడానికి వీలు కలుగుతోంది.దీనికి తోడు భవిష్యత్ లో కూడా అధిక రాబడిని అందించడానికి కొంత మిగులును ఉంచడం జరిగింది. ఈ ఆదాయ పంపిణీకొసం ఇపిఎఫ్ ఒ కార్పస్ నుంచి ఓవర్‌డ్రా చేయలేదు.
సిబిటి ఏటా ప్రకటిస్తున్న ఇపిఎఫ్ ఒ ఫిక్స్‌డ్ రిటర్న్ విధానం, పన్నుమినహాయింపులు పి.ఎఫ్ ఖాతాదారుల
పొదుపుమొత్తాన్ని ఆకర్షణీయ పొదుపుగా మలుస్తున్నాయి.
***
(Release ID: 1805637)
Visitor Counter : 207