హోం మంత్రిత్వ శాఖ

జాతీయ రక్షణ వర్సిటీ జాతికి అంకితం


గుజరాత్.లోని గాంధీనగర్.లో
ప్రధాని మోదీ చేతులమీదుగా కార్యక్రమం...

విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సంలో
ప్రధానమంత్రి ప్రసంగం..

స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా


2003-2013లో, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే
శాంతి భద్రతలపై మోదీ కొత్త దృక్కోణం: అమిత్ షా


గుజరాత్ సి.ఎం.గా మోదీ తొలి చర్య
పోలీసుబలగాల అధునికీకరణే..

ఆయన నేతృత్వంలో పోలీసు స్టేషన్లను
కంప్యూటరీకరించిన తొలి రాష్ట్రం గుజరాత్...


పోలీస్ స్టేషన్ల అనుసంధానం లక్ష్యంగా
అధునాతన సాఫ్ట్.వేర్.కు
పునాది వేసిన నరేంద్ర మోదీ...

దీనితో కంప్యూటర్ల వినియోగ పరిజ్ఞానం ఉన్న వారినే
కానిస్టేబుళ్లుగా నియమించేందుకు ప్రాధాన్యం...

సర్వీసులో ఉన్న కానిస్టేబుళ్ల శిక్షణకోసం కార్యక్రమం
గుజరాత్ పోలీసుశాఖ పూర్తిగా కంప్యూటరీకరణ...

దేశంలో ఉత్తమ న్యాయ విశ్వవిద్యాలయ నిర్మాణం,..

జాతీయ రక్షణ విశ్వవిద్యాలయానికి రూపకల్పన..,

ప్రపంచ శ్రేణి ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ ఏర్పాటు...
గుజరాత్ సి.ఎం.గా మోదీ తీసుకున్న 3 ప్రధాన చర్యలు.

గుజరాత్.లో భారీ వ్యవస్థాత్మక మార్పులతో
దేశంకోసం ఒక నమూనాకు మోదీ

Posted On: 12 MAR 2022 6:08PM by PIB Hyderabad

   గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ రక్షణ విశ్వవిద్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు జాతికి అంకితం చేశారు. విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరై ప్రసంగించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ముఖ్యమత్రి భూపేంద్ర పటేల్ సహా, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

https://ci5.googleusercontent.com/proxy/IdpEOYyd7pLgh-NaXZAHMZwYxMxlsHYpqCdknldc_PTLssacS83iv4fee6pROGe--UdR-P8lFaP-S_eKzLfZeH1nHXshVHtb2QBQHbxd5ISpQoK84ewf09rzzQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001W0JR.jpg

  ఈ సందర్భంగా కేంద్ర హోమ్, సహకార శాఖమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, 2002నుంచి 2013వరకూ నరేంద్ర మోదీ తాను, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే శాంతి భద్రతల అంశాన్ని కొత్త దృక్కోణంలో పరిశీలించసాగారని అన్నారు. బ్రిటిష్ పాలనా కాలంలో శాంతి భద్రతల అంశాన్ని కేవలం ఒక పనిగానే పరిగణించారని, పోలీసు బలగాల్లోని సిబ్బంది కూడా దీన్ని ఓ ఉద్యోగంగా మాత్రమే భావించారని అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే, పోలీసు బలగాలను ఆయన ప్రత్యేక దృష్టితో చూశారని, పోలీసు బలగాల ఆధునికీకరణ ప్రక్రియను ప్రారంభించడమే ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన తొలి చర్య అని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. దీనితో నరేంద్ర మోదీ నాయకత్వంలో పోలీసు స్టేషన్లను కంప్యూటరీకరించిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందన్నారు. పోలీసు స్టేషన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించడానికి తగిన పునాదిని మోదీ తయారు చేశారని అమిత్ షా అన్నారు. తద్వారా, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారని కానిస్టేబుళ్లుగా నియమించేందుకు ప్రాధాన్యం ఇచ్చారని, సర్వీసులో ఉన్న కానిస్టేబుళ్లందరికీ అవసరమైన సంపూర్ణ శిక్షణను అందించారని, దీనితో గుజరాత్ రాష్ట్రంలో పోలీసు బలగం యావత్తునూ కంప్యూటరీకరించగలిగారని ఆయన చెప్పారు. అనంతరం కారాగారాలను, ఫోరెన్సిగ్ పరిశోధన శాలలతో అనుసంధానించే ప్రక్రియను కూడా చేపట్టారని ఆయన అన్నారు.

   అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ మూడు ప్రధాన ప్రధాన చర్యలకు శ్రీకారం చుట్టారని అమిత్ షా చెప్పారు. దేశంలో తొలి న్యాయ విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం, జాతీయ రక్షణ విశ్వవిద్యాలయానికి రూపకల్పన చేయడం, ప్రపంచ శ్రేణి ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని కూడా గుజరాత్.లో ఏర్పాటు చేయడం మోదీ తీసుకున్న ముఖ్యమైన చర్యలని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు సంబంధించిన 3 అంశాలపై తగిన చర్యలు తీసుకోవడం ద్వారా యువతకు ప్రత్యేక సదుపాయం కల్పించారని, యువతకు ప్రారంభదశలోనే శిక్షణా ప్రక్రియతో అనుసంధానం కల్పించారని ఆయన అన్నారు. గుజరాత్ లో భారీ స్థాయిలో వ్యవస్థాత్మక మార్పులను మోదీ చేపట్టారన్నారు. ఏదైనా ఒక ప్రత్యేక అంశంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పక్షంలో వారు మరింత పురోగమించి తాము శిక్షణ పొందిన అంశంలో మెరుగైన సేవలందించగలరని మోదీ రుజువు చేశారని, ఈ విషయంలో దేశం సమక్షంలో ఒక నమూనాను మోదీ నిలిపారని కేంద్రమంత్రి అన్నారు.  పోలీసు బలగాల ఆధునికీకరణ, కంప్యూటరీకరణ తర్వాత గుజరాత్ పోలీసుల్లో విధి నిర్వహణపై చిత్తశుద్ధి కేవలం మూడేళ్లలోనే 22శాతం పెరిగిందన్నారు. పరిశోధన, అభివృద్ధి ప్రక్రియను రూపొందించడం, నిపుణులను, ప్రభుత్వ సిబ్బందిని తయారు చేయడం ఇలా అన్ని అంశాల్లోనూ ఒక కొత్త వ్యవస్థకు ప్రధానమంత్రి నాంది పలికారన్నారు. 

https://ci4.googleusercontent.com/proxy/2eOm94uZea4C6rPWdOxcONSFQU_Pe4f3vopKw0tSWW2_-kariYOSphEo7jRwdqgMahhM72pgDMYqX_B07cZBfHg_v8IwbHSwZaIyaLCcSJhFAhQgKY31dcP0ag=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00285IN.jpg

  దేశ ప్రధానమంత్రిగా ఎన్నుకొనడం ద్వారా నరేంద్ర మోదీకి ప్రజలు 2014లో కేంద్ర ప్రభుత్వ సారథిగా అవకాశమిచ్చినపుడు, కాలాగుణ పరిణామాలకు తగినట్టుగా మార్పులు తెచ్చేందుకు ఆయన ప్రయత్నించారన్నారు. ప్రతి రంగంలోనూ ఇదివరకటి ఆనవాయితీలకు అతీతంగా, విభిన్న పద్ధతిలో మోదీ వ్యవహరించారని, జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా ఇందుకు నిదర్శనమని అమిత్ షా అన్నారు. మోదీ కలలు గన్న జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం, జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం ఇపుడు వాస్తవ రూపం దాల్చాయని అన్నారు. విభిన్న రంగాలకు చెందిన వివిధ సంస్థలతో కలసి జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం పనిచేయడం, ఆయా రంగాల అవసరాలకు తగిన మార్గదర్శకత్వాన్ని విశ్వవిద్యాలయం అందించడం తనకు సంతోషదాయకమని అన్నారు. రానున్న కాలంలో జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం మరింత విస్తరించబోతోందని అన్నారు. అదే పద్ధతిలోనే జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ విస్తరణ  కూడా జరగబోతోందని, ఇందుకోసం ఏడు రాష్ట్రాలతో ఒప్పందాలను కుదుర్చుకుందని ఆయన అన్నారు. జాతీయ ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయానికి చెందిన అనుబంధ సంస్థలను 3 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరిందన్నారు. అలాగే, ప్రాంతాల వారీగా తన శాఖలను ఏర్పాటు చేసేందుకు జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం కూడా కృషి చేస్తుందన్నారు. శాంతి భద్రతల రక్షణలో భాగంగా కానిస్టేబుళ్లు, పోలీసు సబ్ ఇన్.స్పెక్టర్లు, డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్లు వంటి మూడు స్థాయిల నియామకాలకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా మంచి వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి కలలు గన్నట్టుగా సిబ్బందిని కర్మయోగులుగా తీర్చిద్దేందుకు జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందన్నారు.

 https://ci5.googleusercontent.com/proxy/cZFck_HQ7F0GYg3RTn7WFJVMTrFNcUm9307qzxXqwEVWK7aQftGxg3wme1NfE_lXczVmTtuY9KS8X3jiL4NUz0Aw2G9NGkHTYUiW7ocDQFoK3QUquFcNVkjHhw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003C1W7.jpg

వృత్తిపరమైన నైపుణ్యంతో కూడిన వారు, విధినిర్వహణను బాధ్యతగా పరిగణించే కర్మయోగులు శాంతి భద్రతల రంగంలో ఉన్నపుడే ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోగలవని అమిత్ షా అన్నారు. అప్పుడు మాత్రమే సిబ్బంది తమ వృత్తిని గర్వకారణంగా భావిస్తారన్నారు. 2018వ సంవత్సరంనుంచి ఇప్పటివరకూ ఐదు బృందాలుగా తమ శిక్షణను పూర్తి చేసుకున్న 1,091 మంది విద్యార్థులు ఈ రోజు తమ పట్టాలను అందుకోనున్నారని ఆయన చెప్పారు. వారు తాము ఎంచుకున్న రంగంలో ఏదో విధంగా కచ్చితంగా తగిన సేవలందించగలరని తాను చెప్పదలుచుకున్నానని అన్నారు.

  యావద్దేశమేకాక, ప్రపంచం కూడా తమ నేతగా పరిగణించిన ప్రముఖ వ్యక్తినుంచి విద్యార్థులు తమ పట్టాలను అందుకోనున్నారని, ప్రతి రంగంపై ఆయన అభిప్రాయాలను వినేందుకు దేశం, ప్రపంచం కుతూహలంతో ఎదురుచూస్తోందని అన్నారు. దేశంలో శాంతి భద్రతలను నిర్దేశించి, అంతర్గత భద్రతను బలోపేతం చేసేందుకు క్రియాశీలంగా, సావధానంగా పనిచేయడమే లక్ష్యంగా విద్యను అభ్యసించాలని ఇక్కడి విద్యార్థులందరికీ తాను చెప్పదలుచుకున్నారని కేంద్రమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం శాఖలు ప్రారంభమై, విద్యార్థులు విభిన్న రంగాల్లో పోలీసు బలగంలో భాగంగా పనిచేసినపుడు, పోలీసులకు దన్నుగా నిపుణుల వ్యవస్థ క్రియాశీలకమైనపుడు జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం లక్ష్యం నెరవేరినట్టే అవుతుందని ఆయన అన్నారు. సమైక్యతా భావంతో దేశంలోని పోలీసు బలగాలను నిర్వహణా ప్రక్రియను కూడా జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం సాధించినట్టే అవుతుందని అమిత్ షా అన్నారు. 

 

****



(Release ID: 1805605) Visitor Counter : 155