గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా పోషకాహార లోపంపై జరిగిన ప్రదర్శనల్లో పాల్గొని అవగాహన కల్పించిన దాదాపు 5000 మంది మహిళలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘కుపోషన్ సే ఆజాదీ ర్యాలీ’ కార్యక్రమంలో పాల్గొన్న డీడీయూ -జీకేవై, ఆర్ఎస్ఈటిఐ లకు చెందిన 100 కి పైగా మహిళలు
Posted On:
12 MAR 2022 11:40AM by PIB Hyderabad
గ్రామీణ మహిళల్లో పోషకాహార లోపం, రక్తహీనత మరియు తక్కువ జనన శిశువులపై అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ( డీడీయూ -జీకేవై, ) మరియు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు ( ఆర్ఎస్ఈటిఐ ) లలో శిక్షణ పొందుతున్న దాదాపు 5000 మంది దేశం వివిధ ప్రాంతాల్లో 100 కి అవగాహన ప్రదర్శనలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా కింద గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నఐకానిక్ వీక్ వేడుకల్లో భాగంగా 'కుపోషన్ సే ఆజాదీ' ప్రదర్శనలను దెస వ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఆర్ఎస్ఈటిఐ లు,కార్యక్రమాలను అమలు చేస్తున్న సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరించి అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రదర్శనలు నిర్వహించారు. వీటిలో వివిధ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. ప్రదర్శనలో భాగంగా మహిళా అభ్యర్థులు సందేశాత్మక ప్లకార్డులు, పోస్టర్లు పట్టుకుని గ్రామాల్లో సైకిల్‌పై పాదయాత్ర చేశారు.
25 సెప్టెంబర్, 2014న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ( డీడీయూ -జీకేవై ) ప్రారంభించబడింది. కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న నిధులతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చేస్తిన బలహీన వర్గాలకు చెందిన వారికి ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాన్ని కల్పించేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ లోని వివిధ రంగాలలో శిక్షణ పొందినవారు ఉపాధి పొందుతున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో కనీసం 70% మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తప్పనిసరిగా శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉపాధి లభిస్తుందన్న హామీతో పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది.
డీడీయూ -జీకేవై కార్యక్రమం 27 రాష్ట్రాలు మరియు మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో గ్రామీణ పేద యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో అమలు చేయబడుతోంది. 871 కంటే ఎక్కువ మంది పిఐఏలు దాదాపు 2381 శిక్షణా కేంద్రాల్లో ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు లభించే దాదాపు 611 అంశాలలో గ్రామీణ పేద యువతకు శిక్షణ ఇస్తున్నారు. 28 ఫిబ్రవరి, 2022 నాటికి మొత్తంగా 11.52 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వబడింది. వీరిలో 7.15 లక్షల మందికి వివిధ రంగాల్లో ఉపాధి లభించింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ , రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్పాన్సర్ బ్యాంకుల మధ్య మూడు-మార్గం భాగస్వామ్యంతో ఆర్ఎస్ఈటిఐ (గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు) కార్యక్రమం అమలు జరుగుతోంది. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి/పరిశ్రమలను నెలకొల్పేందుకు అవసరమైన శిక్షణ అందించడానికి బ్యాంకులు తమ లీడ్ డిస్ట్రిక్ట్‌లో కనీసం ఒక ఆర్ఎస్ఈటిఐ ని తప్పనిసరిగా ప్రారంభించాల్సి ఉంటుంది . ఆర్ఎస్ఈటిఐ కింది దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించే విధంగా స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 18-45 ఏళ్ల మధ్య ఉన్న గ్రామీణ పేద యువత శిక్షణలో చేరేందుకు అర్హులు. గ్రామీణ పేద యువత ఆకాంక్షలను గుర్తించి వారికి వారి సొంత ప్రాంతాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ పొందిన యువత పరిశ్రమలు స్థాపించి స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇతరులకు వీరు మార్గదర్శకులుగా ఉంటున్నారు. మొత్తం 40.3 లక్షల మంది అభ్యర్థులు ఆర్ఎస్ఈటిఐల క్రింద 64 కోర్సులలో ( గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదం పొందిన 5 కోర్సులు , నేషనల్ స్కిల్ వర్క్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ ఆమోదం పొందిన 59 కోర్సులు ) శిక్షణ పొందారు. 28 ఫిబ్రవరి, 2022 నాటికి 28.39 లక్షల అభ్యర్థులు స్థిరపడ్డారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం 28 రాష్ట్రాలు , ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతోంది. 23 ప్రముఖ బ్యాంకులు (పబ్లిక్ మరియు ప్రైవేటు సెక్టార్ కొన్ని గ్రామీణ బ్యాంకులు ) 585 ఆర్ఎస్ఈటిఐలను స్పాన్సర్ చేశాయి.
(Release ID: 1805604)
Visitor Counter : 201