గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ఐకానిక్ వీక్ ప్రచారంలో భాగంగా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు మహిళా- ఉపాధి కోర్సుల కొత్త బ్యాచ్‌లను ప్రారంభించాయి.


గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ కార్యక్రమం కింద శిక్షణ పొందిన మొత్తం అభ్యర్థులలో 66 శాతం మంది మహిళలు ఉన్నారు


ప్రారంభం నుండి దాదాపు 26.28 లక్షల మంది మహిళా అభ్యర్థులు శిక్షణ పొందారు. దాదాపు 18.7 లక్షల మంది విజయవంతంగా స్థిరపడ్డారు


మొత్తం 64లో పది శిక్షణా కోర్సులను గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ కింద మహిళా అభ్యర్థులకు మాత్రమే కేటాయించారు.

Posted On: 10 MAR 2022 11:36AM by PIB Hyderabad

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022ను పురస్కరించుకుని గ్రామీణాభివృద్ధి శాఖ (డీఓఆర్డీ) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఐకానిక్ వీక్  వారం రోజుల వేడుకలను ప్రారంభించింది. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థల   ద్వారా మహిళా- ఉపాధి కోర్సుల కొత్త బ్యాచ్‌లుదేశవ్యాప్తంగా 7 మార్చి 2022 నుంచి మొదలయ్యాయి.  అవసర్ కి ఆజాదీ పేరుతో మహిళా అభ్యర్థుల కోసం ఫోకస్డ్ బ్యాచ్‌లను ప్రారంభించింది. తద్వారా వారి నుండి మరింత భాగస్వామ్యానికి భరోసా ఏర్పడింది. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ కార్యక్రమం కింద శిక్షణ పొందిన మొత్తం అభ్యర్థులలో 66 శాతం మంది మహిళలు ఉన్నారు.  ప్రారంభం నుండి సుమారు 26.28 లక్షల మంది మహిళా అభ్యర్థులు శిక్షణ పొందారు.  దాదాపు 18.7 లక్షల మంది విజయవంతంగా స్థిరపడ్డారు.

ఒడిశాలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ బోలంగీర్‌లో కొత్త బ్యాచ్ మహిళా ట్రైనీలు

హోమ్‌మేడ్ అగర్బత్తి మేకర్, సాఫ్ట్ టాయ్స్ మేకర్ అండ్ సెల్లర్, పాపడ్, పికిల్  మసాలా పౌడర్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్ & కాస్ట్యూమ్ జ్యువెలరీ తయారీ మొదలైన ట్రేడ్‌లలో కొత్త బ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ పథకం కింద, మొత్తం 64 కోర్సుల్లో 10 శిక్షణా కోర్సులు ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే కేటాయించడం జరిగింది.

 

 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ గిరిదిహ్, జార్ఖండ్

 

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్డీ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,  స్పాన్సర్ బ్యాంకులతో కలసి నిర్వహిస్తున్నది.  గ్రామీణ యువతకు స్వయం ఉపాధి/ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెంచర్‌లను చేపట్టేందుకు శిక్షణనిచ్చేందుకు బ్యాంకులు తమ లీడ్ జిల్లాలో కనీసం ఒక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థని ప్రారంభించాలని ఆదేశించింది. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ప్రోగ్రామ్ స్వల్పకాలిక శిక్షణ  వ్యవస్థాపకుల దీర్ఘకాలిక  విధానంతో నడుస్తుంది. 18-–45 ఏళ్ల మధ్య ఉన్న గ్రామీణ పేద యువత శిక్షణలో చేరేందుకు అర్హులు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు గ్రామాల పేద యువత  ఆకాంక్షలను అర్థం చేసుకొని వ్యవస్థాపక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా లాభదాయకమైన వ్యవస్థాపకులుగా మార్చడంలో మార్గదర్శకులుగా నిలిచాయి.

 

 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ గొడ్డ, జార్ఖండ్

 

మొత్తం 39.9 లక్షల మంది అభ్యర్థులు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థల కింద 64 కోర్సుల్లో శిక్షణ పొందారు  28.11 లక్షల మంది అభ్యర్థులు 2022 జనవరి 31 వరకు స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం 28 రాష్ట్రాలు  7 కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలు చేయబడుతోంది. 585  గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలకు 23 ప్రముఖ బ్యాంకుల నుంచి స్పాన్సర్షిప్ వచ్చింది.

 

 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ కాజల్‌గావ్, అస్సాం(Release ID: 1805004) Visitor Counter : 193