మంత్రిమండలి

భారతదేశానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ కు మరియు యుకె కి చెందిన  ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటి కి మధ్య సంతకాలైన అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి 

Posted On: 09 MAR 2022 1:29PM by PIB Hyderabad

భారతదేశాని కి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసిఎమ్ఆర్ ) కు మరియు యుకె కి చెందిన ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటి కి మధ్య 2021వ సంవత్సరం నవంబరు లో సంతకాలు జరిగినటువంటి మరియు భారత ప్రభుత్వ (వ్యాపార లావాదేవీ) నియమాలు, 1961 తాలూకు రెండో షెడ్యూలు లోని నియమం 7 (డి) (i) కి అనుగుణం గా ఉన్నటువంటి ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) ను గురించిన వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గానికి తెలియజేయడమైంది.

ఎమ్ఒయు తాలూకు ముఖ్య ఉద్దేశ్యాలు :

ఎమ్ఒయు యొక్క ముఖ్య ఉద్దేశ్యాల లో.. భారతీయ శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల కు సామర్ధ్యాల పెంపుదల, అంతర్జాతీయ ప్రమాణాలు మరియు నియంత్రణ సంబంధి అవసరాల కు తులతూగే విధం గా సమాచార సేకరణ, తమ సొంత నిధుల ను ఉపయోగిస్తూ న్యాయబద్ధత ను మరియు సార్వభౌమత్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ సామర్థ్య వికాసం కోసం ఒక రీజినల్ హబ్ గా మారే దిశ లో భారతదేశం అభివృద్ధి చెందడం, ఐసిఎమ్ఆర్ లో ఫలితాల ను సాధించడానికి ఇన్ ఫెక్శస్ డిజీజ్ డేటా అబ్జర్వేటరి (ఐడిడిఒ) సెక్రటేరియట్ ద్వారా కాలబద్ధ ఆతిథ్యాన్ని ఇవ్వడం సహా సంయుక్తంగా నిధుల సమీకరణ, ఇంకా ఆ నిధుల ను పంచుకోవడం, డేటా లోను మరి దానికి మించి భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం, ఇంకా నైపుణ్యాల ను న్యాయబద్ధం గాను, పారదర్శకమైన పద్ధతి లోను పంచుకోవడం వంటివి భాగం గా ఉన్నాయి.

 

చలి జ్వరం (మలేరియా), విసరల్ లీశ్ మేనియాసిస్ అంటే కాలా అజార్, బోదకాలు వంటి వెక్టర్ బార్న్ వ్యాధుల ను మూడింటి ని, ఉత్పన్నం అయ్యేటటువంటి సంక్రమణల ను నివారించడాని కి సంబంధించిన ఆలోచనల ను పరస్పరం వెల్లడి చేసుకోవడాని కి, డేటా మేనేజ్ మెంట్ కోసం సర్వశ్రేష్ఠ అభ్యాసాల తోడ్పాటు కు, డేటా డాక్యుమెంటేశన్ కు, డేటా శేరింగ్ కు, న్యాయబద్ధమైన పరిపాలన రూపురేఖల ను అభివృద్ధిపరచడానికి, పరిశోధన కార్యక్రమాల లో సహకారాని కి వీలు ఉన్న అవకాశాల ను అన్వేషించడానికి, సామర్ధ్య సుదృఢీకరణ విషయం లో మూడు సంవత్సరాల కార్య ప్రణాళిక ను రూపొందించడానికి, రిసర్చ్ ఫెలోస్ ను ఒక దేశం మరొక దేశాని కి పంపడానికి మరియు గణాంకాల విశ్లేషణ లో శిక్షణ ఇవ్వడానికి ఇరు పక్షాలు వాటి సమ్మతి ని వ్యక్తం చేశాయి.

ఆర్థికపరమైన ప్రభావం:


ఈ ఎమ్ఒయు లో పేర్కొన్న ప్రకారం సమన్వయ సాధన కు సంబంధించిన ఖర్చుల ను ఏ పక్షాని కి ఆ పక్షం స్వయం గా భరించుకోవాలి. ఏదైనా ఒక పక్షం తరువాత ఈ ఎమ్ఒయు లో పేర్కొన్న కార్యకలాపాల లో ఏ భాగానికి అయినా నిధి ని సేకరించాయంటే గనక ఆ నిధి లో కొంత వాటా ను అవతలి పక్షాని కి అందజేయాలనే సంకల్పాన్ని దీనిలో పొందుపరచడమైంది. ఈ స్థితి లో సదరు కార్యకలాపానికి సంబంధించి ఒక అదనపు ఒప్పందాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుంది.

 

 

***



(Release ID: 1804482) Visitor Counter : 122