ఉక్కు మంత్రిత్వ శాఖ
విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ వేడుకలలో ప్రకాశించిన సెయిల్ ఉద్యోగులు
Posted On:
09 MAR 2022 11:56AM by PIB Hyderabad
ఉత్తమ పనితీరు ప్రదర్శించినందుకు 2018 సంవత్సరానికి గాను ఇచ్చిన విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ (విఆర్‌పి) వేడుక సందర్భంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎఐఎల్ - సెయిల్) ఉద్యోగులు తమదైన ముద్ర వేసి ఆకట్టుకున్నారు. ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులను మంగళవారంనాడు న్యూఢిల్లీలో కేంద్ర కార్మిక & ఉపాధి, పర్యావరణం, అడవులు & పర్యావరణ శాఖల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక&ఉపాధి, పెట్రోలియం & సహజవాయువుల శాఖల సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలి కూడా పాల్గొన్నారు.
భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విఆర్‌పి లక్ష్యం జాతీయ స్థాయిలో పారిశ్రామిక సంస్థల కార్మికుల కృషిని గుర్తించి, గౌరవించడం. మొత్తం 96 మంది అవార్డు పొందిన విజేతలలో,52మంది అవార్డీలు సెయిల్‌కు చెందిన వారు. అంటే, మొత్తం గెలుపొందిన వారిలో 54%నికి ప్రాతినిధ్యం వహించారు. 2018 సంవత్సరంలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినందుకు విఆర్‌పిలోని వివిధ విభాగాలలో అందించే 28 అవార్డులలో సెయిల్ ఉద్యోగులు 11 గెలుచుకున్నారు. ఇది మొత్తం అవార్డులలో 39 శాతం.
వేరొక కార్యక్రమంలో, సెయిల్ చైర్మన్ శ్రీమతి సోమా మొండల్‌ను విఆర్‌పి గెలుచుకున్న ఉద్యోగులు సత్కరించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారిని అభినందిస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో ప్రతిష్ఠాత్మక విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కారాన్ని గెలుచుకోవడం అన్నది తమ ఉద్యోగుల నిబద్ధత, అంకిత భావానికి, అద్భుత పనితీరును పునరుద్ఘాటిస్తున్నాయని, శ్రీమతి మొండల్ నొక్కి చెప్పారు. ప్రతిభావంతులైన ఉద్యోగులు సెయిల్‌ను మరింత నూతన శిఖరాలకు తీసుకువెడతారని విశ్వసిస్తున్నాని ఆమె అన్నారు. తమ సంస్థ ఎప్పుడూ సంలగ్నతను, ఆవిష్కరణను, ఆసక్తిని ప్రోత్సహించే సంస్కృతిని కలిగి ఉందని ఆమె చెప్పారు. తమ మేధస్సును, ప్రతిభను ప్రదర్శించేందుకు సెయిల్ తన ఉద్యోగులకు ఎప్పుడూ స్వేచ్ఛను ఇచ్చిందని, అంతటి ప్రముఖ వేదికపై గుర్తింపు పొందడాన్ని హృదయపూర్వకంగా గుర్తిస్తున్నామన్నారు.
***
(Release ID: 1804371)
Visitor Counter : 175