సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

య‌ప్ టీవీలో డీడీ ఇండియా - గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫార‌మ్ వేదిక‌గా ఛానెల్ ప‌రిధి మ‌రింత విస్తృతం

Posted On: 07 MAR 2022 12:26PM by PIB Hyderabad

డీడీ ఇండియా ఛానెల్ ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న విస్తృతిని విస్తరించడానికి.. గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో వివిధ అంతర్జాతీయ పరిణామాలపై భారతదేశ దృక్పథాన్ని తెలియజేయడానికి, భారతదేశ సంస్కృతి మరియు విలువలను ప్రపంచానికి ప్రదర్శించడానికి వీలుగా త‌న దృష్టిని కేంద్రీక‌రించింది. దీనికి అనుగుణంగా భారతదేశపు ప్ర‌జా బ్రాడ్‌కాస్టింగ్ వ్య‌వ‌స్థ  ప్రసార భారతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలివిజన్ వీక్షకులకు గేట్‌వే అయిన ఓవర్-ది-టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫారమ్ అయిన ‘య‌ప్‌’ టీవీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో డీడీ ఇండియా ఇప్పుడు అమెరికా, బ్రిట‌న్‌, యూరప్, మిడిల్ ఈస్ట్, సింగపూర్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లలో య‌ప్ టీవీ యొక్క ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండ‌నుంది. డీడీ ఇండియా, ప్రసార భారతి యొక్క అంతర్జాతీయ ఛానెల్, ప్రపంచానికి భారతదేశం యొక్క గ‌వాక్షం. ఛానెల్ తన వివిధ కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ వీక్షకులకు అన్ని దేశీయ మరియు ప్రపంచ పరిణామాలపై భారతదేశ దృక్పథాన్ని అందిస్తుంది.  ఇది 190 కంటే కూడా ఎక్కువ దేశాలలో అందుబాటులో ఉంది, డీడీ ఇండియా భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసుల మధ్య వారధిగా కూడా పనిచేస్తుంది. డీడీ భార‌త్ తన పదునైన విశ్లేషణ & వ్యాఖ్యానం, ఆలోచనను రేకెత్తించే అభిప్రాయాలు మరియు వ్యాఖ్య‌లు మరియు అత్యాధునిక దృశ్య ప్రదర్శన ద్వారా భారతదేశ సంబంధిత సమస్యలపై ప్రపంచ ప్రభావశీలిగా స్థిరపడింది. త‌న లోతైన విశ్లేషణ మరియు పరిశోధన ఆధారంగా ప్రసిద్ధ ప్రదర్శనలలో ఒకటిగా బయో-క్వెస్ట్ నిలుస్తోంది. ఈ సిరీస్ కోవిడ్‌-19  యొక్క మూలం, వ్యాక్సిన్ అభివృద్ధి మరియు కోవిడ్‌కి సంబంధించిన ఇతర శాస్త్రీయ ఆవిష్కరణలతో వ్యవహరిస్తుంది. భార‌త దేశ‌పు ఆలోచ‌న‌లు, వరల్డ్ టుడే, ఇండియన్ డిప్లమసీ, డీడీ డైలాగ్, న్యూస్ నైట్ మొదలైన ఇత‌ర కార్య‌క్ర‌మాలు అధిక వీక్షకులను క‌లిగి ఉన్న‌ ప్రదర్శనలు. య‌ప్ టీవీ ద్వారా, ప్రపంచంలో ఎక్కడైనా టీవీని ఎప్పుడైనా ప్రత్యక్ష ప్రసారంగా  చూడవచ్చు.  య‌ప్ టీవీ భారతీయ టీవీ ఛానెల్‌లను సులభంగా మరియు త‌క్కు వ్య‌యంతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచింది. కంటెంట్ హోస్టింగ్ ఒప్పందంపై ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి, యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ కంటెంట్ హోస్టింగ్ ఒప్పందంపై ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి, యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి సంతకాలు చేశారు.
                                                                 

****


(Release ID: 1803747) Visitor Counter : 218