సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

సులభ్ ఇంటర్నేషనల్ సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ "స్వచ్ఛాగ్రహ: స్వచ్ఛత మరియు స్వాధింత వేడుకలు" నిర్వహించింది


అమృత్ మహోత్సవ్ అనేది ఆత్మనిర్భర్ భారత్గా ప్రధానమంత్రి యొక్క గొప్ప విజన్గురించి: డా.బిందేశ్వర్ పాఠక్

ఆజాదీకా అమృత మహోత్సవ్ వేడుకలో పిల్లలను భాగస్వామ్యం చేయాలి: విజయ్ గోయెల్

Posted On: 06 MAR 2022 10:30AM by PIB Hyderabad

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సులభ్ ఇంటర్నేషనల్ సహకారంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో “స్వచ్ఛత, స్వాధింత మరియు సులభ్” అనే ప్రధాన ఆలోచనతో  సామూహిక అవగాహనను ప్రోత్సహించడానికి మార్చి 5వ తేదీన న్యూఢిల్లీలో “స్వచ్ఛాగ్రహ” కార్యక్రమాన్ని నిర్వహించింది.

గాంధీ స్మృతి వైస్ చైర్మన్ విజయ్ గోయెల్, యోగా గురువు బాబా రామ్‌దేవ్, సులభ్ శానిటేషన్, సోషల్ రిఫార్మ్ & హ్యూమన్ రైట్స్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు  బిందేశ్వర్ పాఠక్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఓఎస్డీ  రత్నేష్ ఝా,  జల శక్తి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రెటరీ రాజీవిజౌహరి, దర్శకురాలు ప్రియాంక చంద్ర, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఉషా చౌమర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

రెండు సెషన్లుగా జరిగిన ఈ కార్యక్రమంలో.. మొదటి సెషన్‌లో సులభ్ పారిశుధ్యం, సామాజిక సంస్కరణ మరియు మానవ హక్కుల ఉద్యమం వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంస్కృతిక  మంత్రిత్వ శాఖ,  గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలు, జల్ శక్తి మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకోవడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో మంత్రిత్వశాఖలతో కలిసి పనిచేయడం గొప్ప అవకాశమని డాక్టర్ పాఠక్ పేర్కొన్నారు.

ఆత్మనిర్భర్ భారత్గా భారతదేశం 2.0 కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గొప్ప విజన్ లో భాగమే ఈ అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నామని పాఠక్ పేర్కొన్నారు. సులభ్ కుటుంబంగా మనమందరం విశ్వాసాన్ని ధృవీకరిద్దామని, మహాత్మా గాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత్ సాకారం కోసం పనిచేద్దామనే సంకల్పం చేద్దామని పిలుపునిచ్చారు.

బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనను అరికట్టేందుకు, దేశంలోని అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతగానో కృషి చేశారని పాఠక్ పేర్కొన్నారు.


ఈ సందర్భంగా పతంజలి యోగపీఠ్ సెంటర్ నుంచి యోగా గురు బాబా రామ్‌దేవ్ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. బాబా రామ్‌దేవ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ... “మనమందరం పరిష్కారంలో భాగం కావాలి.. అంతేకాని సమస్యగా మారకూడదని పిలుపునిచ్చారు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క ఈ దశలో మనం దేశంలో ఐక్యత మరియు సామరస్యాన్ని పెంపొందించుకోవాలని,  స్వదేశీపై కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.  భారతదేశం స్వాతంత్ర్యం పొంది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు శక్తివంతమైన దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. .

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ  ఓఎస్డీ రత్నేశ్ ఝా మాట్లాడుతూ.. పరిశుభ్రత కార్యక్రమాన్ని సులభ్తో కలిసి ఆజాదీకా అమృత్ మహోత్సవ్తో అనుసంధానించడానికి సాంస్కృతిక మంత్రిత్వశాఖ ప్రయత్నిస్తోందని చెప్పారు. అజాదీకా అమృత్ మహోత్సవ్యాక్షన్@75 మరియు రిసాల్వ్@75 యొక్క రెండు స్తంభాలకు సులభ్ ఉత్తమ ఉదాహరణగా అభివర్ణించారు.

 ఈ వేడుక సందర్భంగా అమృత మహోత్సవం చిత్ర విశేషాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాటలు మరియు చలనచిత్ర ప్రదర్శనతో పాటు స్వచ్ఛత, స్వాధింత మరియు సులభ్ల సంఖ్యను పెంచడానికి కొత్త ఆలోచనలు మరియు తీసుకోవలసిన చర్చించారు.  చర్చలో..  స్వచ్ఛతా ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం యొక్క ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు.


‘ఏక్షం సుర్, తాలౌర్ స్వచ్ఛకేనామ్’ అనే అంశంపై సాయంత్రం జరిగిన సెషన్‌లో ముఖ్య అతిథి విజయ్ గోయెల్ ప్రసంగించారు. ఆజాదికా అమృత మహోత్సవ్ అంటే.. మనమందరం భారతదేశం మరియు దాని స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన వారిని గుర్తుంచుకోవాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో చిన్నారులను భాగస్వాములను చేయాలని సూచించారు. బహిరంగ మలవిసర్జనను అంతం చేయడం, దానిని సాధించడంలో సులభ్ ప్రాముఖ్యత గురించి కూడా విజయ్ గోయెల్ ప్రస్తావించారు.

ఈ సందర్భంగా డా.సుస్మితాఝా సరస్వతీస్తుతిని ఆలపించారు.

ఈ కార్యక్రమంలో ధృవ- ది సంస్కృత బ్యాండ్ ప్రదర్శించారు. ఇది ప్రపంచంలోని ఏకైక సంగీత బ్యాండ్. ఇది భారతదేశపు పురాతన సంప్రదాయమైన సంస్కృత భాషలో వేద-గాన్ మరియు స్తోత్ర-గాన్ ఆధారంగా రూపొందించబడింది. భారతీయ జానపద, సూఫీ, ఖవ్వాలి, హిందుస్తానీ మరియు కర్ణాటక శాస్త్రీయ సంగీతం యొక్క అద్భుతమైన మిశ్రమాన్ని మిళితం చేసిన  ప్రముఖ పెర్కషన్ వాద్యకారుడు పండిత అనురాధ పాల్ మరియు సుఫొరె సంగీత బృందం ఈ ప్రదర్శననిచ్చింది.



(Release ID: 1803494) Visitor Counter : 151