ఉక్కు మంత్రిత్వ శాఖ

2018-19 , 2020-21 సంవత్సరాలకి ఇస్పాత్ రాజ్‌భాషా అవార్డులో 1వ బహుమతిని 2019-20కి ఇస్పాత్ రాజ్‌భాషా ప్రేరణ అవార్డును అందుకున్న జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ -NMDC


Posted On: 06 MAR 2022 2:05PM by PIB Hyderabad

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC), ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విభాగంలో  2018-19 మరియు 2020-21కి ఇస్పాత్ రాజ్‌భాషా అవార్డులో 1వ బహుమతిని మరియు 2019-20కి ఇస్పాత్ రాజ్‌భాష ప్రేరణ అవార్డును 3 మార్చి 2022న మదురైలో జరిగిన ఉక్కు మంత్రిత్వ శాఖ హిందీ సలాహకర్ కమిటీ సమావేశంలో అందుకుంది. కేంద్ర ఉక్కు మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుమిత్ దేబ్‌కు ప్రశంసలు అందజేశారు. భారతదేశ అధికార భాషని ఆచరణలో పెట్టడంలో అన్ని స్టీల్ ప్రభుత్వ రంగ సంస్థల కృషిని ఆయన అభినందించారు. అవార్డులు గెలుచుకున్నందుకు NMDCని అభినందించారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎండిసి డిప్యూటీ జనరల్ మేనేజర్ (అధికారిక భాష)కి ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని అందించారు. జాతీయ ఖనిజ అభివృద్ధి  సంస్థలో హిందీ భాష అమలు స్థితిపై ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించింది. NMDC చేసిన ఈ వినూత్న ప్రయత్నాన్ని కమిటీ సభ్యులు ఎంతో మెచ్చుకున్నారు.

ఈ సమావేశానికి ఉక్కు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు, హిందీ సలాహకార్ కమిటీ సభ్యులు, అన్ని స్టీల్ పిఎస్‌యుల ఛైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా, శ్రీ సుమిత్ దేబ్ మాట్లాడుతూ, “హిందీ భాషను అమలు చేయడంలో మరియు సంబరాలు చేసుకోవడంలో జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ సహకారం పట్ల నేను గర్విస్తున్నాను. NMDCలో, మేము సాంకేతిక విషయాలపై హిందీలో అసలైన రచనలను రోజువారీ పరస్పర చర్యలలో ఈ భాషను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తాము అని చెప్పారు.

 

*******



(Release ID: 1803483) Visitor Counter : 135