గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"చెత్త రహిత నగరాల కోసం సామాజిక సంస్థలు : వ్యర్థాల నిర్వహణ లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం" అనే అంశంపై జాతీయ సమ్మేళనాన్ని నిర్వహించిన - ఎస్.బి.ఎం-యు 2.0


ఈ సదస్సులో ప్రారంభమైన - చెత్త రహిత నగరాల కోసం జాతీయ సామర్థ్య నిర్మాణ వ్యవస్థ

Posted On: 05 MAR 2022 9:13AM by PIB Hyderabad

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ) ఆధ్వర్యంలో, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సహకారంతో, స్వచ్ఛ్-భారత్-మిషన్-అర్బన్ 2.0 (ఎస్.బి.ఎం-యు. 2.0),  "చెత్త రహిత నగరాల కోసం సామాజిక సంస్థలు: వ్యర్థాల నిర్వహణలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం" అనే అంశంపై రాయ్‌పూర్‌ లో గురువారం, ఒక జాతీయ సమ్మేళనాన్ని నిర్వహించింది.  19 రాష్ట్రాలు, వారి యు.ఎల్.బి. లకు చెందిన సీనియర్ ప్రభుత్వాధికారులు, సిబ్బంది,  సంబంధిత రంగానికి చెందిన భాగస్వాములతో పాటు, దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలోని వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థల ప్రతినిధులు దాదాపు 100 మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి,  ఛత్తీస్‌గఢ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, శివకుమార్ దహారియా;  రాయ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, ఐజాజ్ ధీబర్; ఎం.ఓ.హెచ్.యు.ఏ., కార్యదర్శి, మనోజ్ జోషి;  ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అమితాబ్ జైన్; ఛత్తీస్‌గఢ్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, అలర్మెల్‌మంగై డి; రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఎస్.బి.ఎం-యు. 2.0 జాతీయ మిషన్ డైరెక్టర్, రూపా మిశ్రా వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమాన్ని  https://youtu.be/5TP1rjZGFA8 ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది ‘స్వచ్ఛత దీదీలు’- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వికేంద్రీకృత ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను నిర్వహించడానికి - ప్రతి ఇంటి నుంచీ వేరు చేసిన వ్యర్థాల సేకరణ, సేకరించిన వ్యర్థాలను తదుపరి క్రమబద్ధీకరణ, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ తో పాటు చివరగా పారవేయడానికి, స్థానిక ఘన, ద్రవ వనరుల నిర్వహణ (ఎస్.ఎల్.ఆర్.ఎం) కేంద్రాలకు రవాణా చేయడం కోసం వినియోగదారుల నుంచి ఛార్జీల సేకరణ కు అధికారం పొందిన ఛత్తీస్‌గఢ్‌ లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా పాల్గొన్నారు.  వీరితో పాటు అదనంగా, నగరాల్లోని లక్షలాది మంది వీక్షకులు దృశ్య మాధ్యమం ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు. 

శ్రీ శివ కుమార్ దహారియా, ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, స్వచ్ఛతా దీదీలు పౌరులలో వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన భారీ ప్రవర్తన మార్పును తీసుకురావడానికి ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.  ఫలితంగా ఎస్.బి.ఎం-యు కింద వరుసగా 3 సంవత్సరాలు దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఛత్తీస్‌గఢ్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 10 జోన్‌ లలో మహిళలు నిర్వహించే బార్టన్ బ్యాంక్‌ లను  ఏర్పాటు చేయడం, అలాగే  చెత్త క్లినిక్‌ లు, నెకికిడివార్‌సెట్ వంటి వివిధ వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాల గురించి రాయ్‌ పూర్ మేయర్ వివరిస్తూ, మహమ్మారి సమయంలో రాయ్‌ పూర్‌ లో వ్యాధి సోకిన గృహాలకు వెళ్ళి, వారికి కేటాయించిన విధులకు మించి నిర్వహించిన సఫాయి కార్మికుల ఆదర్శప్రాయమైన పని గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు, ఇతర సభ్యులను ఉద్దేశించి ఎం.ఓ.హెచ్.యు.ఏ., కార్యదర్శి మాట్లాడుతూ, దేశంలోని అన్ని నగరాలు వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఛత్తీస్‌గఢ్ తరహా విధానాన్ని నేర్చుకుని, వాటిని తమ తమ ప్రాంతాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 

ఎస్.బి.ఎం-యు. 2.0 ద్వారా చెత్త రహిత నగరాల కోసం జాతీయ సామర్ధ్య నిర్మాణ వ్యవస్థ ను ఈ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించడం జరిగింది.  ఎస్.బి.ఎం-యు. 2.0 కింద రాష్ట్రాలు మరియు యు.ఎల్.బి.ల కోసం సామర్థ్యం పెంపుదల, నైపుణ్యాభివృద్ధి, విజ్ఞాన నిర్వహణ కార్యక్రమాలకు ఇది ఒక ప్రణాళిక గా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.  ఈ పధకానికి చెందిన సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా అందరితో కలిసి అభ్యసించి, విజ్ఞానం పంచుకోవడాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, ఎస్.బి.ఎం-యు. ను అమలుచేస్తున్న రాష్ట్రాలలో ప్రధాన రాష్ట్రం సహకారంతో ఎస్.బి.ఎం-యు. నిర్వహిస్తున్న ఈ సదస్సు ఈ రకమైన సదస్సుల్లో మొట్టమొదటిది.  

ఎం.ఓ.హెచ్.యు.ఏ. కి చెందిన ఎస్.బి.ఎం-యు. జాతీయ మిషన్ డైరెక్టర్, రూపా మిశ్రా మాట్లాడుతూ, ఈ వ్యవస్థ యొక్క సమగ్ర విధానం లో ముఖ్యమైన మూడు ప్రధాన అంశాలను వివరించారు. అవి - 

(i)     మానవ వనరుల అంచనాలు, శిక్షణ అవసరాల అంచనాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక శిక్షణలు, వెబినార్లు, పీర్ లెర్నింగ్, ఇ-లెర్నింగ్‌ల ద్వారా రాష్ట్ర స్థాయి, మున్సిపల్ స్థాయి ఉద్యోగుల సామర్థ్యాన్ని బలోపేతం చేయడం; 

(ii)     కార్యక్రమ నిర్వహణ యూనిట్లు, నగర మేనేజర్ల రూపంలో ప్రత్యేక మానవ వనరుల ద్వారా సామర్థ్యం పెంపుదల; 

(iii)     ఇప్పటికే ఉన్న కేంద్ర ప్రజారోగ్యం, పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ (సి.పి.హెచ్.ఈ.ఈ.ఓ) ని బలోపేతం చేయడం ద్వారా, స్వచ్ఛత విజ్ఞాన భాగస్వాములు, స్వచ్ఛత మార్గదర్శకులు, ఛైర్ ప్రొఫెసర్‌షిప్‌ తో  ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం. 

సహచర మంత్రిత్వ శాఖలు, సంస్థల సహకారంతో మొదటిసారిగా పారిశుధ్య కార్మికుల నైపుణ్యాలపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతోందని, ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు. 

జాతీయ సామర్ధ్య నిర్మాణ వ్యవస్థ ఆన్‌-లైన్‌ లో అందుబాటులో ఉంటుంది: 

https://sbmurban.org/storage/app/media/pdf/National%20Capacity%20Building%20Framework%20%20SBM-U%202.0.pdf.

ఎన్‌.ఎస్‌.ఎస్; ఎన్‌.సి.సి; క్యాడెట్‌ లతో పాటు స్థానిక ఎన్‌.జి.ఓ. ల ప్రతినిధులతో కలిసి మహాబోధి ఘాట్ వద్ద రోజంతా నిర్వహించే పరిశుభ్రత ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.  ఆ తర్వాత పటాన్‌ లోని ప్రసిద్ధ ఘన, ద్రవ వనరుల నిర్వహణ (ఎస్.ఎల్.ఆర్.ఎం) కేంద్రాన్ని సందర్శించారు.  విచ్చలవిడిగా తిరిగే జంతువుల వ్యర్థాలను నిర్వహించడం; పొడి చెత్తను చిన్న వర్గాలుగా విభజించడం; వనరుల పునరుద్ధరణ తో సహా సమగ్ర సౌకర్యాలతో, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రమదానం చేశారు.  "రిమెడియేటెడ్-డంప్‌-సైట్" లో ఏర్పాటు చేసిన "ఫెకల్-స్లడ్జ్-ట్రీట్‌మెంట్-ప్లాంట్‌" ను పరిశీలించడానికి, ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు, కుమ్‌హారి ని కూడా సందర్శించారు.

మహిళల నేతృత్వంలోని వ్యర్ధ పదార్ధాల నిర్వహణ సంస్థలు తమ కార్యకలాపాలను తెలియజేస్తూ వరుసగా నిర్వహించిన ప్రదర్శనలు ఈ రోజు కార్యక్రమాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిలో వ్యర్థాలను సేకరించే వారితో పని చేసే బెంగుళూరుకు చెందిన హరిరు దాలా అనే సంస్థ;  రుతుక్రమ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు రెడ్-డాట్ ప్రచారం ద్వారా కృషి చేస్తున్న పూణే కు చెందిన స్వచ్ సహకార సంస్థ;   వ్యర్థాలను వేరు చేయడంలో కృషి చేస్తున్న గురుగ్రామ్ లోని సాహస్ అనే స్వచ్చంద సంస్థ; తిరుచిరాపల్లి నుండి వచ్చిన షీ టీమ్స్; మురికివాడల్లో కమ్యూనిటీ టాయిలెట్ల ఏర్పాటు, నిర్వహణలో నిమగ్నమైన తమిళనాడు; కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ నుండి పారిశుధ్య ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల వరకు మొత్తం పారిశుద్ధ్య సౌకర్యాలను నిర్వహిస్తున్న కటక్‌ లోని లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఉన్నాయి.  ఆ తర్వాత స్వచ్ఛతా రాయబారిగా పేరుగాంచిన వీణా సెంద్రే కొంతమంది స్వచ్ఛతా దీదీలతో ఇష్టా గోష్టి నిర్వహించగా,  పారిశుధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యకలాపాలలో ప్రమేయం ద్వారా తమ జీవితాలు మెరుగు పడినట్లు, వారు వివరించారు. ఈ స్వచ్ఛతా ఛాంపియన్ల ఎనలేని అంకితభావానికి సముచిత నివాళిగా, ఐదు విభాగాలకు చెందిన స్వచ్ఛతా దిదీలను ప్రముఖులు ఈ సందర్భంగా  సత్కరించారు.

తాజా సమాచారం కోసం, దయచేసి స్వచ్ఛ్ భారత్ మిషన్ కు చెందిన అధికారిక వెబ్‌సైట్ తో పాటు సామాజిక మాధ్యమాల వేదికలను చూడండి: 

 

Website: www.swachhbharaturban.gov.in

Facebook: Swachh Bharat Mission - Urban |

Twitter:  @SwachhBharatGov

Instagram: sbm_urban |

Youtube: Swachh Bharat Urban

 

 

*****


(Release ID: 1803437) Visitor Counter : 185