వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ వేదిక గా భారత్ బంగ్లాదేశ్ వాణిజ్య కార్యదర్శుల స్థాయి సమావేశ నిర్వహణ
భారతదేశం బంగ్లాదేశ్ మధ్య మల్టీమోడల్ అనుసంధానం పై గణనీయమైన పురోగతి
త్వరలో ఖరారు కానున్న భారత్-బంగ్లాదేశ్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం- (సిఇపిఎ) పై సంయుక్త అధ్యయనం.
प्रविष्टि तिथि:
05 MAR 2022 10:04AM by PIB Hyderabad
భారతదేశం బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య కార్యదర్శుల స్థాయి సమావేశం 4 మార్చి 2022న న్యూఢిల్లీలో జరిగింది. భారత ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి శ్రీ B.V.R. సుబ్రహ్మణ్యం, బంగ్లాదేశ్ ప్రతినిధి బృందానికి బంగ్లాదేశ్ ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ సీనియర్ కార్యదర్శి శ్రీ తపన్ కాంతి ఘోష్ నాయకత్వం వహించారు.
రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఓడరేవు మౌలిక సదుపాయాలు, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ)పై సంయుక్త అధ్యయనం, సరిహద్దుల్లో అనుమతించిన మార్కెట్లు-బోర్డర్ హాట్స్, మల్టీ-మోడల్ రవాణా ద్వారా ప్రాంతీయ అనుసంధానం, పరస్పర గుర్తింపు ఒప్పందం, ప్రమాణాల సామరస్యత, సహా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై ఇరు పక్షాలు విస్తృత చర్చలు జరిపాయి.
చర్చించిన అనేక అంశాలలో కింది ఎజెండా అంశాల పురోగతిని ఇరు దేశాల ప్రతినిధి బృందం ప్రశంసించింది: -
• ఇటీవలి సంవత్సరాలలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో గణనీయమైన వృద్ధి -బంగ్లాదేశ్ భారతదేశం 6వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.
• రైల్వేల ద్వారా భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య సులభతర వాణిజ్యం
ఎ) సిరాజ్‌గంజ్ బజార్‌లో కంటైనర్ హ్యాండ్లింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక వివరణాత్మక ప్రాజెక్ట్ ప్రతిపాదన (DPP) ఆమోదించబడింది.
b) భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య సరుకు రవాణా రైళ్లను నడపడానికి, బెనాపోల్ వద్ద 900 మీటర్ల కొత్త లైన్ నిర్మించారు.
c) భారతదేశం నుండి దర్శన ద్వారా రైలు ద్వారా అన్ని వస్తువులను దిగుమతి చేసుకోవడానికి అనుమతించడం కోసం, దర్శన వద్ద సరుకుల కోసం ఎక్కించి దించేందుకు ప్లాట్‌ఫారమ్ నిర్మాణం పూర్తయింది.
d) ఈశ్వర్ది వద్ద రైలు రోడ్డు ఆధారిత ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో- ICD అభివృద్ధికి, వివరణాత్మక ప్రాజెక్ట్ ప్రతిపాదన -DPP ఆమోదించారు.
• బంగ్లాదేశ్ ద్వారా తిరిగి వచ్చే ఖాళీ రైల్వే వ్యాగన్లు/ కంటెయినర్లను ఉపయోగించడంపై ఏకాభిప్రాయం - ఇది బంగ్లాదేశ్‌కు భారతదేశం ఎగుమతుల మొత్తం లాజిస్టిక్స్/రవాణా ఖర్చును తగ్గిస్తుంది.
• బోర్డర్ హాట్‌లు - కోవిడ్ నియంత్రణ కారణంగా మూసివేసినవి త్వరలో తెరుస్తారు.
• పెట్రాపోల్-బెనాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ICP) 24x7 కార్యాచరణ త్వరలో అమలు అవుతుంది
• ICP/ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లలో సాధించిన గణనీయమైన పురోగతి
• రెండు దేశాల మధ్య బహుళ-మోడల్ రవాణా ద్వారా ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడం.
• CEPA అధ్యయనం వీలైనంత త్వరగా ఖరారు అవుతుంది
• CEO ఫోరమ్ త్వరలో మొదటి సమావేశం జరుగుతుంది
ఈ సమావేశానికి ముందుగా 2-3 తేదీలలో వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వాణిజ్య మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్ ప్రభుత్వం సంయుక్త/అదనపు కార్యదర్శుల స్థాయిలో వాణిజ్యంపై ఉమ్మడి కార్య బృందం (JWG) 14వ సమావేశం జరిగింది. మార్చి 2022 న్యూఢిల్లీలో పరస్పర ఆసక్తి ఉన్న వివిధ రంగాలపై సమగ్ర చర్చలు జరిగాయి.
JWG వాణిజ్య కార్యదర్శుల తదుపరి సమావేశాలు పరస్పర అనుకూలమైన తేదీలలో బంగ్లాదేశ్‌లో నిర్వహించేందుకు అంగీకారం కుదిరింది.
*******
(रिलीज़ आईडी: 1803258)
आगंतुक पटल : 247