జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

5 మార్చి, 2022న బెంగళూరులో 6 దక్షిణాది రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల ప్రాంతీయ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రి


జల జీవన మిషన్, స్వచ్చ భారత్ మిషన్ -గ్రామీణ్ కింద చేసిన పురోగతిని సమీక్షించడానికి సమావేశం, రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల నిర్దిష్ట సమస్యలు, నివారణ ఉపాయాలతో ముందుకు వెళ్లే దిశగా చర్చ.

ముఖ్యంగా మహిళలు, యువతుల కోసం ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ భరోసాతో నీరు, పారిశుధ్యంపై రెండు ప్రయోగాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంలో మహిళా సాధికారత, ఆరోగ్య సంరక్షణకు ప్రధాన మంత్రి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

భాగస్వామ్య రాష్ట్రాలు 2024 నాటికి తమ గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితమని ప్రకతిన్చుకున్నవి, Open Defecation Free- ODF ప్లస్‌గా అంటే ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించడందిశగా ప్రణాళికలను అమలు చేస్తున్నాయి

Posted On: 04 MAR 2022 1:27PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్,  స్వచ్ఛ్ భారత్ మిషన్-గ్రామీన్ కింద సాధించిన పురోగతిని సమీక్షించేందుకు 6 రాష్ట్రాలు  2 కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల ప్రాంతీయ సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు 5 మార్చి, 2022న బెంగళూరులోని విధాన సౌధలో జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, గ్రామీణ నీటి సరఫరా  పారిశుద్ధ్య విభాగానికి చెందిన సీనియర్ అధికారులు స్వయంగా హాజరవుతారు. ఈ లింక్‌ను అనుసరించి సమావేశాన్ని వీక్షించవచ్చు: https://youtu.be/xDySoG1lnic.

కేంద్ర మంత్రి రాష్ట్ర/ కేంద్ర పాలిత  నిర్దిష్ట సమస్యలు  కార్యక్రమాలతో  రెండింటి అమలులో ముందుకు వెళ్లే మార్గంలో  సవాళ్లను చర్చిస్తారు. సదస్సు సందర్భంగా, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు మంత్రిత్వ శాఖ నుండి తమ అంచనాలను ముందుకు తెచ్చేందుకు అవకాశం ఉంటుంది, తద్వారా కార్యక్రమం అమలును వేగవంతం చేయడంలో సకాలంలో మద్దతు అందుతుంది.

 కేంద్ర మంత్రి జల్ శక్తి, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సదస్సు గురించి మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి స్త్రీ సాధికారత  ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే అతను నీరు, పారిశుధ్యంపై దృష్టి సారించే రెండు ప్రత్యేక కార్యక్రమాలను లను ప్రారంభించారు, తద్వారా ముఖ్యంగా మహిళలకు యుక్త వయస్సు  అమ్మాయిలకు 'సౌలభ్యం కలుగుతుంది

గత 7 సంవత్సరాలలో, భారత ప్రభుత్వం ‘గతిశీలం’గా  పని చేస్తోంది', ప్రతి గ్రామీణ కుటుంబంలో 100% కుళాయి నీటి లభ్యత సురక్షితమైన పారిశుద్ధ్య సౌకర్యాలను అందించడం కోసం, ఏ సామాజిక-ఆర్థిక నేపధ్యం ఉన్నవారైనప్పటికి 'ఎవరినీ  విడిచిపెట్టబడకుండా' అందరికీ అందేలా సరళ జీవన వికాసం సాధ్యమయ్యేలా చూసుకుంటున్నారు.

'హర్ ఘర్ జల్' అనేది భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం, దీనిని జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జల్ జీవన్ మిషన్ (JJM) అమలు చేస్తోంది. JJM 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి నీటి కనెక్షన్‌ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ,  పుదుచ్చేరి ప్రాంతాలు  2021లో 100% కవరేజీని సాధించాయి. 2023 నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌ను అందించాలని మధ్యప్రదేశ్ యోచిస్తోంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఆ మార్గంలో కృషి చేస్తున్నాయి.  2024లో తమిళనాడు ఈ లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలని యత్నిస్తుంది.

స్వచ్ఛ్ భారత్ మిషన్-గ్రామీన్ (SBM(G)) అనేది జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు అవుతున్న  మరొక ప్రధాన కార్యక్రమం. అన్ని గ్రామ పంచాయతీలు 2 అక్టోబర్ 2019న తమను తాము బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించుకున్నాయి. SBM(G) ఫేజ్ II కింద, ODF స్థితిని కొనసాగించడం  గ్రామాలు ODF నుండి ODF ప్లస్‌కు మారేలా ఘన  ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించడంఅమలు బాటలో ఉన్నాయి.

ఈ రెండు కార్యక్రమాల అమలుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించే సదస్సుకు సంబంధించిన చర్చనీయాంశాలు కేంద్ర ప్రభుత్వ  త్రాగునీరు పారిశుధ్య  విభాగం కార్యదర్శి శ్రీమతి విని మహాజన్ జాబితా చేస్తారు. మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు  కర్ణాటకలలో చాలా ప్రాంతాలలో భూగర్భ జలాలు త్రాగడానికి,  గృహావసరాలకు మాత్రమే కాకుండా నీటిపారుదల, నిర్మాణం  పారిశ్రామిక అవసరాల కోసం కూడా అదనపు వెలికితీత కారణంగా భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. అదేవిధంగా, కేరళ, ఆంధ్ర ప్రదేశ్  కర్ణాటక తీర ప్రాంతాలలో ప్రతి గ్రామీణ ఇంటికి స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించడం సవాలుగా ఉంది.

ఈ ప్రాజెక్టుకు అదనపు కార్యదర్శిగా ఉన్న శ్రీ అరుణ్ బరోకా, (MD-JJM & SBM(G)) సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు ముందుకు వెళ్లే మార్గాలపై వివరణాత్మక ప్రదర్శనను అందిస్తారు. అతను మంత్రిత్వ శాఖ  ఆలోచనలను పంచుకుంటారి, ఆపై   సాధ్యమైన పరిష్కారాలను ప్రతిపాదిస్తారు.

ప్రాంతీయ సమావేశంలో ODF స్థిరీకరణ, బయోడిగ్రేడబుల్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, వాడిన నీటి పునర్వినియోగ నిర్వహణ, మల బురద నిర్వహణపై చర్చలు జరుగుతాయి, అలాగే SBM(G) ఫేజ్ IIలోని ODF ప్లస్ అంశాల అమలును వేగవంతం చేయడంతోపాటు వివిధ పనుల కలయిక కోసం పద్ధతులను బలోపేతం చేయడం వంటి అంశాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడిన వివిధ పద్ధతులపై ఆయా రంగాల నిపుణులు  సీనియర్ ప్రభుత్వ అధికారులు ప్రదర్శనలు చేస్తారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలను అందించడంలో పాల్గొనే రాష్ట్రాలు గుర్తించదగిన పని చేశాయి. రాష్ట్రాలు తమ గ్రామాలను 2024 నాటికి ODF ప్లస్‌గా మార్చాలని యోచిస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రజారోగ్యం  సంక్షేమం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ  కేంద్ర బడ్జెట్ 2022లో, జలజీవన్ మిషన్ కోసం నిధుల కేటాయింపు 2021-22లో రూ.45,000 కోట్ల నుంచి 2022-23లో రూ.60,000 కోట్లకు పెంచారు. SBM(G), 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.7,192 కోట్లు కేటాయించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, జలజీవన్ మిషన్  కింద, ఈ 6 రాష్ట్రాలు  పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం కోసం కేంద్రం రూ. 20,487.58 కోట్లు కేటాయించింది. (ఆంధ్రప్రదేశ్ - రూ. 3,182.88 కోట్లు, కర్ణాటక - రూ. 5,008.80 కోట్లు, కేరళ - రూ. 1,804.59 కోట్లు, మధ్యప్రదేశ్ - రూ. 5,116.79 కోట్లు, తమిళనాడు - రూ. 3,691.21 కోట్లు, తెలంగాణ - రూ. 1,653  పుదుచెరి రూ. 30. 22 కోట్లు). SBM(G) కింద పేర్కొన్న రాష్ట్రాలు  UT కోసం రూ. 1,355.13 కోట్లు కేటాయించబడ్డాయి. (ఆంధ్రప్రదేశ్ - రూ. 437.64 కోట్లు; కర్ణాటక - లేదు; కేరళ - రూ. 34.68 కోట్లు; మధ్యప్రదేశ్ - రూ. 668.96 కోట్లు; తమిళనాడు - రూ. 26.29 కోట్లు; తెలంగాణ - రూ. 180.67 కోట్లు  పుదుచ్చేరి - రూ. 6.89 కోట్లు)

ODF స్థితి  సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SLWM)  స్థిరత్వంపై దృష్టి పెట్టడానికి మొత్తం రూ. 1,40,881 కోట్లతో SBM(G) ఫేజ్-II ఫిబ్రవరి, 2020లో ఆమోదించారు. SBM(G) ఫేజ్ II అనేది వివిధ కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల క్రింద వివిధ  అంచెల ఫైనాన్సింగ్‌ల మధ్య కలయికల నూతన నమూనా. తాగునీరు  పారిశుద్ధ్య శాఖ  సంబంధిత రాష్ట్ర వాటా ద్వారా బడ్జెట్ కేటాయింపులు కాకుండా, మిగిలిన నిధులు 15వ ఆర్థిక సంఘం నుండి గ్రామీణ స్థానిక సంస్థలు, MGNREGS, CSR నిధులు  ఆదాయ ఉత్పత్తి నమూనాలు మొదలైన వాటికి ప్రత్యేకించి SLWM కోసం కేటాయిస్తారు. SBM(G) ఫేజ్-II 2020-21 నుండి పథకం ప్రాతిపదికన  అమలు అవుతోంది,  2024-25 వరకు కొనసాగుతుంది.

 SBM(G)  రెండవవ దశ, దాదాపు 65 లక్షల కుటుంబాలు వ్యక్తిగత గృహ మరుగుదొడ్డి పథకం ద్వారా లబ్ది పొందడంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలో 1.18 లక్షల కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించారు.  43,000 కంటే ఎక్కువ గ్రామాలు తమను తాము ODF ప్లస్‌గా ప్రకటించుకున్నాయి. దాదాపు 5.5 లక్షల మరుగుదొడ్లు  దాదాపు 12,000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు పాల్గొనే రాష్ట్రాలు/యుటిలలో మాత్రమే నిర్మించారు. ఇప్పటికే 50,000 గ్రామాలు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ఏర్పాట్లలో ముందున్నాయి.  25,000 గ్రామాలు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ఏర్పాట్లను సాధించాయి.

15 ఆగస్ట్ 2019న జల్ జీవన్ మిషన్ ప్రకటించినప్పటి నుండి, దేశవ్యాప్తంగా గణనీయమైన పురోగతి సాధించారు. గత 2½ సంవత్సరాలలో, అంతరాయాలు,  లాక్‌డౌన్ ఉన్నప్పటికీ 5.88 కోట్ల కంటే ఎక్కువ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్ అందించారు. నేడు, 9.12 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటి కనెక్షన్‌ను కలిగి ఉన్నాయి.

ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 4.71 లక్షల గ్రామ నీరు  పారిశుద్ధ్య కమిటీలు ఏర్పాటు అయ్యాయి.  3.87 గ్రామ కార్యాచరణ ప్రణాళికలు రూపొందాయి. 13,787 అమలు సహాయ సంస్థలు రాష్ట్రాలు/యుటి లో  అవగాహన కల్పన, కమ్యూనిటీ సమీకరణ  గ్రామ పంచాయితీలు /లేదా దాని సబ్‌కమిటీలకు ప్రోగ్రామ్ అమలులో మద్దతునిచ్చేందుకు నిమగ్నమై ఉన్నాయి. ఈ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని  9.26 లక్షల మంది మహిళలు అందించిన నీటి నాణ్యతను తనిఖీ చేయడం కోసం ఫీల్డ్ టెస్ట్ కిట్‌లను (FTKలు) ఎలా ఉపయోగించాలో శిక్షణ పొందారు. ఈ మహిళలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన 5 మంది సభ్యుల నిఘా కమిటీలో భాగం.

సదస్సులో పాల్గొంటున్న 6 రాష్ట్రాలతో పాటు   పుదుచ్చేరిలో కలిపి  మొత్తం 1.24 లక్షల గ్రామాలు ఉన్నాయి, వీటిలో 21,959 గ్రామాలు ‘హర్ ఘర్ జల్’ (100% కుళాయి నీటి కవరేజ్)గా మారాయి.

ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు  ఆశ్రమశాల (గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎస్సీ/ఎస్టీ హాస్టళ్లు)లో కుళాయి నీటి కనెక్షన్‌ను అందించాలనే లక్ష్యంతో 2020 అక్టోబర్ 2న కేంద్ర మంత్రి జల్ శక్తి శ్రీ గజేంద్ర సింగ్ షెఖ్‌వత్ 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కేంద్రాల్లో స్వచ్ఛమైన తాగునీటిని నిర్ధారించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 2.25 లక్షల పాఠశాలలు, 2.31 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలకు తాగడానికి, మధ్యాహ్న భోజనం వండడానికి, చేతులు కడుక్కోవడానికి, మరుగుదొడ్లలో వాడుకోవడానికి కుళాయి నీటి కనెక్షన్‌ను అందించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి  తెలంగాణ రాష్ట్రాలు తమ అన్ని పాఠశాలలు  అంగన్‌వాడీ కేంద్రాలలో స్వచ్ఛమైన కుళాయి నీటిని అందజేశాయి. మధ్యప్రదేశ్ 74% పాఠశాలలు  60% అంగన్‌వాడీ కేంద్రాలలో కుళాయి నీటి కనెక్షన్‌ను అందించింది.

ప్రధాన మంత్రి “సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్” దార్శనికతను అనుసరించి, దేశంలో 101 జిల్లాలు, 1,159 బ్లాక్‌లు, 67,473 గ్రామ పంచాయతీలు  1,39,366 గ్రామాలు ‘హర్ ఘర్ జల్’గా మారాయి. మూడు రాష్ట్రాలు - గోవా, తెలంగాణ  హర్యానా  మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు –అండమాన్ నికోబార్  దీవులు, దాద్రా నాగర్  హవేలీ,డామన్,డయ్యూ  పుదుచ్చేరిలో  100% పంపు నీటి కవరేజీని అందించాయి.

*****


(Release ID: 1803146) Visitor Counter : 227