జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 ఫిబ్రవరి, 28వ తేదీన నిర్వహిస్తున్న ఈశాన్య రాష్ట్రాల మంత్రుల ప్రాంతీయ సదస్సుకు అధ్యక్షత వహించనున్న - కేంద్ర జల శక్తి శాఖ మంత్రి

బడ్జెట్ తర్వాత నిర్వహించిన వెబినార్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నుండి అందుకున్న మార్గదర్శకాల ఆధారంగా ఈశాన్య రాష్ట్రాలకు రోడ్‌ మ్యాప్‌ ను రూపొందించాలి

ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ ను తప్పనిసరిగా రూపొందించడం ద్వారా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, ఆశావహ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఈశాన్య రాష్ట్రాల్లో 'జల్-జీవన్-మిషన్' మరియు 'స్వచ్ఛ-భారత్-మిషన్ (గ్రామీణ్)' అమలుపై దృష్టి సారించేందుకే - ఈ ప్రాంతీయ సమావేశం


మణిపూర్, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాలు 2022లో ‘హర్-ఘర్-జల్’ సాధించాలని లక్ష్యాన్ని నిర్ణయించుకోగా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాలు 2023 ను లక్ష్యంగా పెట్టుకున్నాయి

Posted On: 27 FEB 2022 4:21PM by PIB Hyderabad

[కర్టెన్ రైజర్ - నేపధ్య సమాచారం]

అస్సాంలోని గౌహతి లో, 2022 ఫిబ్రవరి, 28వ తేదీన జరిగే, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజారోగ్య ఇంజనీరింగు శాఖ (పి.హెచ్.ఈ.డి); గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖల మంత్రుల ప్రాంతీయ సదస్సు కు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, అధ్యక్షత వహిస్తారు. "జల్-జీవన్-మిషన్" మరియు "స్వచ్ఛ-భారత్-మిషన్ (గ్రామీణ్)" అమలుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఈ ప్రాంతీయ సదస్సు దృష్టి సారిస్తుంది.

ఈ సమావేశాన్ని క్రింది లింక్‌ ని "క్లిక్లో" చేసి చూడవచ్చు:  https://youtu.be/N2Wo8QLA6jA

"2022 కేంద్ర బడ్జెట్ అనంతరం - ఏ పౌరుడు వెనుకబడకుండా...' అనే ఇతివృత్తంతో, 2022 ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించిన వెబినార్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ ను తప్పనిసరిగా రూపొందించడం ద్వారా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, ఆశావహ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలి" అన్న మార్గదర్శకాలకు అనుగుణంగా, కేంద్ర మంత్రి ఈశాన్య రాష్ట్రాల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించనున్నారు.

కష్టతరమైన భూభాగం, భారీ వర్షాలు, హిమపాతం, నిర్మాణ సామగ్రి యొక్క అస్థిర సరఫరా వంటి పరిస్థితులు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో ఈ పథకం పనుల పురోగతిని బాగా ప్రభావితం చేస్తున్నాయి.  గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ప్రజారోగ్యం, శ్రేయస్సు పట్ల నిబద్ధతకు అనుగుణంగా,   జె.జె.ఎం. కోసం కేంద్ర బడ్జెట్ కేటాయింపు, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 45,000 కోట్ల రూపాయల నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 60,000 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది.  కాగా, ఎస్.బి.ఎం(జి) కోసం 2022-23 బడ్జెట్‌ లో 7,192 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 

"హర్-ఘర్-జల్" అనేది రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో అమలు చేయబడుతున్న భారత ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం,  ఈ కార్యక్రమం క్రింద, 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయి నీటి కనెక్షన్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.  కాగా, 2022 నాటికి "హర్-ఘర్-జల్" సాధించాలని, మణిపూర్, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అదేవిధంగా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్ 2023 గడువుగ నిర్దేశించుకోగా, 2024 లో లక్ష్యాన్ని చేరుకోవాలని అస్సాం లక్ష్యంగా పెట్టుకుంది.  "స్వచ్ఛ్-భారత్-మిషన్-గ్రామీణ్ (ఎస్.బి.ఎం-జి)"  అనేది జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా అమలౌతున్న మరొక ప్రధాన కార్యక్రమం.  భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు 2019 అక్టోబర్, 2వ తేదీ నాటికి బహిరంగ మలవిసర్జన రహిత స్థితి ని సాధించాయి. భారతదేశం లోని గ్రామాలు తమను తాము ఓ.డి.ఎఫ్. గా ప్రకటించుకున్నాయి.  ఈ కార్యక్రమం రెండవ దశలో, ఎస్.బి.ఎం-జి.  ఒ.డి.ఎఫ్. స్థిరత్వం పైన, అదేవిధంగా 2024-25 నాటికి అన్ని గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను సాధించడం అంటే, గ్రామాలను ఓ.డి.ఎఫ్. ప్లస్‌ గా మార్చడంపైనా  దృష్టి సారిస్తోంది. ఈ రెండు కార్యక్రమాల అమలుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించే విధంగా ఈ సదస్సులో చర్చించవలసిన అంశాలను  డి.డి.డబ్ల్యూ.ఎస్. కార్యదర్శి, శ్రీమతి. విని మహాజన్, రూపొందిస్తారు. 

2019 ఆగస్టు, 15 వ తేదీన "జల్-జీవన్-మిషన్" ప్రకటించినప్పటి నుంచి, దేశవ్యాప్తంగా గణనీయమైన పురోగతి సాధించబడింది.  ఈ రోజు వరకు 9 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌ లు అందించడం జరిగింది.  కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అంతరాయాలు, లాక్‌-డౌన్‌ లు ఉన్నప్పటికీ, ఈ రోజు దేశంలోని 100 కంటే ఎక్కువ జిల్లాలు "హర్-ఘర్-జల్‌" గా మారాయి.

ఈశాన్య ప్రాంతంలో మొత్తం 43,668 గ్రామాలు ఉండగా, వాటిలో 6,798 గ్రామాలు "హర్-ఘర్-జల్‌" గా మారాయి.  ఈ కార్యక్రమం కింద ఇంతవరకు, 30,196 గ్రామ స్థాయి నీరు, పారిశుద్ధ్య కమిటీ లు (వి.డబ్ల్యూ.ఎస్.సి.లు) ఏర్పాటయ్యాయి. 31,811 గ్రామ కార్యాచరణ ప్రణాళికలను (వి.ఏ.పి. లు) అభివృద్ధి చేయడం జరిగింది.  ఈశాన్య రాష్ట్రాలు ఏర్పాటు చేసిన 197 అమలు సహాయ సంస్థలు (ఐ.ఎస్.ఏ.లు) అవగాహన కల్పన, కమ్యూనిటీ సమీకరణ, గ్రామ సమాజాల హ్యాండ్ హోల్డింగ్ మొదలైన వాటి కోసం నిమగ్నమై ఉన్నాయి.  ఈ ప్రాంతంలో 14 ఆశావహ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో 18.79 లక్షల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించడం జరిగింది.  ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం 68,936 అంగన్‌ వాడీ కేంద్రాల్లో, 35,944 (52 శాతం) అంగన్ వాడీ కేంద్రాలు కుళాయి నీటి కనెక్షన్‌ ను కలిగి ఉన్నాయి.  ఈశాన్య ప్రాంతంలో మొత్తం 71,814 పాఠశాలలు ఉండగా, వాటిలో ఇప్పటివరకు 48,724 (68 శాతం) పాఠశాలల్లో త్రాగడానికి, మధ్యాహ్న భోజనం వండడానికి, చేతులు కడుక్కోవడానికి,మరుగుదొడ్లలో వాడుకోవడానికి కుళాయిల ద్వారా నీటి సరఫరా అందుబాటులో ఉంది. 

అదేవిధంగా, 'హర్-ఘర్-జల్' కార్యక్రమం కింద మిగిలిన గ్రామాల్లో కూడా నీటి సరఫరా మౌలిక సదుపాయాల కోసం ప్రణాళిక రూపొందించడం జరిగింది.  స్థానిక గ్రామీణ యువకులకు తాపీ మేస్త్రీ, ప్లంబర్, పంప్ ఆపరేటర్, ఫిట్టర్, టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ మొదలైన వృత్తుల్లో గ్రామీణ నీటి పథకాల నిర్మాణం, మరమ్మత్తు, నిర్వహణ కార్యకలాపాలలో నైపుణ్యాన్ని పెంచడం లక్ష్యంగా "జల్-జీవన్-మిషన్"  పథకం అమలవుతోంది.   ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం తో పాటు, జీవనోపాధి కోసం గ్రామాల నుండి ప్రజల వలసలను కూడా అరికడుతుంది.

2019 ఆగష్టు, 15వ తేదీ నాటి పరిస్థితి

2019 ఫిబ్రవరి, 28వ తేదీ నాటి పరిస్థితి

"సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్" అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను అనుసరించి, 100 జిల్లాలు; 1150 బ్లాకులు; 67,071 గ్రామ పంచాయతీలు; 1,38,655 గ్రామాలు 'హర్-ఘర్-జల్' గా మారాయి.  మూడు రాష్ట్రాలు - గోవా, తెలంగాణ, హర్యానా తో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు - అండమాన్, నికోబార్ దీవులు; డి. & ఎన్. హవేలీ, డామన్, డయ్యూ; పుదుచ్చేరి 100 శాతం కుళాయిల ద్వారా నీటి సరఫరా సౌకర్యాన్ని అందిస్తున్నాయి.  త్వరలో వంద శాతం ఈ సౌకర్యాన్ని అందించడానికి, ఇతర రాష్ట్రాలు వేగంగా కృషి చేస్తున్నాయి.  వీటిలో పంజాబ్ 99 శాతం; హిమాచల్ ప్రదేశ్ 93 శాతం; గుజరాత్ 92 శాతం; బీహార్ 90 శాతం లక్ష్యాన్ని సాధించాయి.  ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయిల ద్వారా నీటి సరఫరా సౌకర్యం కల్పించడానికి, ఈ రాష్ట్రాలన్నీ, 2022 ను గడువుగా నిర్ణయించాయి.

ఎస్.బి.ఎం(జి) కింద, పారిశుద్ధ్యానికి సంబంధించి, ఈశాన్య రాష్ట్రాలు, మంచి చర్యలు చేపట్టాయి. ఓ.డి.ఎఫ్. స్థాయి సాధించడం వల్ల ప్రజలకు గణనీయమైన ఆరోగ్య లాభాలు లభించాయి. కొత్త గృహాల కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడానికి; అదేవిధంగా, సంచార ప్రజలతో పాటు గృహాలలో మరుగుదొడ్ల ఏర్పాటు చేసుకోడానికి స్థలం లేని ప్రజల కోసం కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు నిర్మించడానికి;  ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ తో సహా, వాడుక నీటి పునర్వినియోగ నిర్వహణ; ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి కార్యక్రమాలకు, ఎస్.బి.ఎం(జి) కింద అందుబాటులో ఉన్న వనరులు మద్దతుగా ఉపయోగించబడుతున్నాయి.   ఒక సారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని తగ్గించడానికీ, పారిశుధ్య వ్యర్ధ్యాలను సురక్షితంగా పారవేయడానికి కూడా ఎస్.బి.ఎం(జి), కృషి చేస్తోంది. ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణను సాధించడం ద్వారా ప్రజలు స్థిరమైన ఆరోగ్యం మరియు పరిశుభ్రత ప్రయోజనాలను సాధించగలుగుతారు. 

 

*****


(Release ID: 1801797) Visitor Counter : 207