ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

గౌరవనీయులు రష్యా ఫెడ‌రేషన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఈ రోజు టెలిఫోన్‌ లో మాట్లాడిన - ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 24 FEB 2022 10:41PM by PIB Hyderabad

ఉక్రెయిన్‌ కు సంబంధించి ఇటీవలి పరిణామాలను అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి కి వివరించారు.  రష్యా మరియు నాటో బృందం మధ్య ఉన్న విభేదాలను నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని ప్రధానమంత్రి తమ దీర్ఘ కాల విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు.  హింసను తక్షణమే నిలిపివేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, దౌత్యపరమైన చర్చలు, సంభాషణల మార్గానికి తిరిగి రావడానికి అన్ని వైపుల నుండి సంఘటిత ప్రయత్నాలు చేయాలని, ఆయన పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్‌ లో ఉన్న భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి భారతదేశ ఆందోళనల గురించి కూడా ప్రధానమంత్రి రష్యా అధ్యక్షునికి తెలియజేశారు.  వారు అక్కడి నుంచి సురక్షితంగా బయలుదేరి, భారతదేశానికి తిరిగి రావడానికి భారతదేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. 

తమ అధికారులు, దౌత్య బృందాలు సమయోచిత ఆసక్తి ఉన్న సమస్యలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ ఉండాలని ఇరువురు నాయకులు అంగీకరించారు.

 



(Release ID: 1800972) Visitor Counter : 246