కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోస్ట్ ఆఫీస్‌లలో 100 శాతం కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్ధారించడానికి వ్యూహం అమలు బ‌డ్జెట్ అనంతరం వెబ్‌నార్‌లో ఈ అంశం చర్చించబడింది


- గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక మరియు బ్యాంకింగ్ సేవలను అందించడానికి పోస్టల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించే విష‌య‌మై కూడా చ‌ర్చ‌

Posted On: 24 FEB 2022 9:52AM by PIB Hyderabad

“ప్ర‌తీ పౌరునికి చేరువ‌కావ‌డం” అనే అంశంపై బ‌డ్జెట్ అనంతరం వెబ్‌నార్‌లో  చ‌ర్చ నిర్వహించబడింది. కోర్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను.. 100 శాతం పోస్టాఫీసులలో ఇంటర్‌ఆపరబుల్ పోస్టాఫీసు ఖాతా ప‌రిధిలోనికి తీసుకురావడానికి సంబంధించిన బడ్జెట్లో చేసిన  ప్రకటన మరియు గ్రామీణ పేదలు ముఖ్యంగా మహిళల జీవితాలపై దాని ప్రభావం గురించి ఇందులో చర్చించబడింది. భార‌త ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెబ్‌నార్ ప్రారంభంలో ప్రసంగించారు. "ఎనీటైమ్ ఎనీవేర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ఇంటరాపరబుల్ సర్వీసెస్ త్రూ ఇండియా పోస్ట్" అనే అంశంపై "గ్రామీణ పేదలందరికీ ప్రత్యేకించి మహిళలకు త‌గిన జీవ‌న ఉపాధి ఎంపికలు మరియు ఆర్థిక సేవలను పొందేలా హామీ ఇవ్వడంష అనే అంశంపై కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ అధ్యక్షతన ఈ కార్య‌క్ర‌మం జరిగింది. ఇందులో నీతి ఆయోగ్ మరియు ఇతర ఏజెన్సీల నుండి నిపుణులు మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పోస్టాఫీసు స్కీమ్‌లతో సంబంధం ఉన్న పెద్ద సంఖ్యలో ప్రజలు మరియు వాటాదారులు దీనికి హాజరయ్యారు. పోస్టాఫీసు ఖాతాల కోసం ఇంటర్‌ఆపరబుల్ సర్వీస్‌ను అమలు చేయడంతోపాటు 100 శాతం కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్ధారించే అమలు వ్యూహంపై కూడా విస్తృత చర్చ జరిగింది. కేంద్ర
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక మరియు బ్యాంకింగ్ సేవలను అందించడానికి పోస్టల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించడం యొక్క అవకాశాలను అన్వేషించే మార్గాల విష‌య‌మై కూడా ఈ చ‌ర్చ‌లో పాల్గొనేవారు చర్చించారు. నీతి ఆయోగ్ నుండి విశిష్ట నిపుణుడు శ్రీ అజిత్ పాయ్, క్రెడిట్, ఆర్థిక అక్షరాస్యత మరియు ఆర్థిక చేరిక యొక్క మొత్తం సాధనలో పోస్టాఫీసు గణనీయమైన పాత్ర పోషిస్తుందని నొక్కి చెప్పారు. వెబ్‌నార్‌లో చర్చ నుండి ఉద్భవించే కార్యాచరణ అంశాలను సకాలంలో త‌గిన విధంగా అమలు చేయడానికి డిపార్ట్‌మెంట్ వివరాలతో కూడిన‌ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది.

 

*****


(Release ID: 1800869) Visitor Counter : 168