బొగ్గు మంత్రిత్వ శాఖ
కోల్ ఇండియా సంస్థ ఈ ఆర్ పి సిస్టమ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి
ప్రస్తుత,రానున్న ఆర్థిక సంవత్సరాల ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోల్ ఇండియా ను కోరిన శ్రీ ప్రహ్లాద్ జోషి
Posted On:
24 FEB 2022 10:38AM by PIB Hyderabad
బొగ్గు ఉత్పత్తి , సరఫరాను మరింత పెంచడానికి నూతన ఐటి ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, దానిని స్థిరమైన ,సమర్థవంతమైన రీతిలో అమలు చేసే దిశగా సమగ్ర వ్యూహం కీలక అవసరమని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు.
కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్ పి) వ్యవస్థ అమలును శ్రీ జోషి బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో జనధన్ ఖాతా ప్రారంభానికి కేంద్రం ఐటి సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడాన్ని శ్రీ జోషి గుర్తు చేశారు
సాంకేతిక విజ్ఞానం పారదర్శకతను
కల్పించగలదని, అవినీతిని అరికట్టగలదని మంత్రి శ్రీ జోషి అన్నారు. బొగ్గు గనుల వాణిజ్య వేలం కింద బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 42 బొగ్గు బ్లాకులను విజయవంతంగా వేలం వేసిందని ఆయన చెప్పారు. దేశానికి ఆటంకాలు లేకుండా బొగ్గు ను స్థిరంగా సరఫరా చేయడం ద్వారా ఇటీవలి సవాళ్లను విజయవంతంగా అధిగమించినందుకు సిఐఎల్ ను మంత్రి అభినందించారు. ప్రస్తుత, రన్ యి న్న వచ్చే ఆర్థిక
సంవత్సరాలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని ఆయన సిఐఎల్ ను కోరారు.
ఈఆర్ పి వ్యవస్థ ప్రత్యేక ప్రయోజనాలగురించి మంత్రి శ్రీ జోషి వివరిస్తూ, ఇంధన రంగంలో సిఐఎల్ ను అంతర్జాతీయంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టడమే ఈ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యమని అన్నారు. సిఐఎల్ , దాని అనుబంధ సంస్థలలో ఈఆర్ పి ఉత్తమ వ్యాపార విధానాలను, ఏర్పాటు చేస్తుందని, వ్యాపార ప్రక్రియను ప్రామాణికం చేస్తుందని ఇంకా ఏకీకృతం చేస్తుందని మంత్రి తెలిపారు.
కోల్ ఇండియా వ్యాప్తంగా ఈఆర్ పి అమలు డిజిటల్ , న్యూఇండియా దిశగా ప్ర భుత్వ
ప్రయత్నాలకు ఊతం ఇస్తుందని కేంద్ర మంత్రి శ్రీ జోషి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ జోషి బొగ్గు, గనులు, రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దన్వే, బొగ్గు శాఖ కార్యదర్శి డాక్ట ర్ అనిల్ కుమార్ జైన్ లతో కలసి " ఫ్యూయెలింగ్ ఇండియాస్ ఎనర్జీ నీడ్స్‘‘ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ -సిఐఎల్ - సుస్థిర సేవల గాథను ఈ పుస్తకం వివరిస్తుంది.
ఈ ఆర్ పి అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జోక్యానికి సంబంధించిన గొప్ప సాధనం. ఇది మెరుగైన డేటా అనుసంధానం, నియంత్రిత ఖర్చు తో సిఐఎల్ తన వ్యాపార పనితీరు ను, వృద్ధిని మెరుగు పరుచుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఒక జాతీయ స్థాయి సంస్థ ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. సిఐఎల్ వద్ద ఎస్ ఎ పి ఈ ఆర్ పి లో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్ (హెచ్ సిఎమ్), సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (ఎస్ డి), ప్రొడక్షన్ అండ్ ప్లానింగ్ (పిపి), ప్లాంట్ మెయింటెనెన్స్ (పిఎమ్), ప్రాజెక్ట్ సిస్టమ్ (పిఎస్), మెటీరియల్ మేనేజ్ మెంట్ (ఎమ్ ఎమ్) ,ఫైనాన్స్ అండ్ కంట్రోల్ (ఎఫ్ ఐసిఒ) అనే ఏడు మాడ్యూల్స్ ఉంటాయి.
కోల్ ఇండియాలో ఈఆర్ పీని రెండు దశల్లో అమలు చేశారు. మొదటి దశలో, ఇది సిఐఎల్ హెడ్ క్వార్టర్స్ లోనూ, రెండు అనుబంధ సంస్థలైన డబ్ల్యుసిఎల్ , ఎంసిఎల్ లోనూ అమలు జరిగింది. రెండవ దశ -మిగిలిన ఆరు అనుబంధ సంస్థలు - ఎస్ ఈసిఎల్, ఎన్ సిఎల్, సిసిఎల్, బిసిసిఎల్ సిఎంపిడిఐలో అమలు జరిగింది
మెస్సర్స్ టెక్ మహీంద్రా మొదటి దశ అమలు భాగస్వామిగా ఉంది. కాగా, ఎం/ఎస్ యాక్సెంచర్ ఫేజ్ - 2 అమలు లో భాగస్వామి. గా ఉంది. ఈ ప్రాజెక్ట్ 51 నెలల్లో లైవ్ కు వెడు తుంది. ఇది 14.5 నెలలు ముందుగా పూర్తయింది.
బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్, చైర్మన్ కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ ప్రమోద్ అగర్వాల్ , ఇంకా మంత్రిత్వ శాఖ, సిఐఎల్ సీనియర్ అధికారులు
ఈ ఆర్ పి అమలు పాన్ కోల్ ఇండియా కార్యక్రమానికి హాజరయ్యారు.
****
(Release ID: 1800819)
Visitor Counter : 165