ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
"సంకలిత తయారీపై జాతీయ వ్యూహాన్ని" రేపు విడుదల చేయనున్న - కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మరియు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
23 FEB 2022 4:15PM by PIB Hyderabad
భవిష్యత్ తరం డిజిటల్ తయారీని అందించడంతో పాటు, స్థానిక పరిశ్రమల తక్షణ వైకల్యాలను తగ్గించడం కోసం, "సంకలిత తయారీపై జాతీయ వ్యూహాన్ని" కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మరియు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ రేపు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం.ఈ.ఐ.టి.వై) కార్యదర్శి శ్రీ అజయ్ సాహ్నీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ తో పాటు, ఎం.ఈ.ఐ.టి.వై. కి చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొంటున్నారు.
డిజిటల్ ప్రక్రియలు, కమ్యూనికేషన్, ఇమేజింగ్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ ద్వారా భారతదేశ తయారీ మరియు పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులకు సంకలిత తయారీ (ఏ.ఎం) అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. సంకలిత తయారీ స్థాయి పదార్ధాలు, 3-డి ముద్రణా యంత్రాలతో పాటు, ఎలక్ట్రానిక్స్, ఫోటోనిక్స్, వైద్య పరికరాలు, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన వివిధ రంగాలలో విస్తారమైన జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ కోసం స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఉన్న పరిశోధనా పరిజ్ఞానాన్ని మార్చడానికి, పి.పి.పి. విధానంలో ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తున్న ఈ వ్యూహం దోహదపడుతుంది.
*****
(Release ID: 1800713)
Visitor Counter : 193