మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహణలో 'డిజిటల్ విశ్వవిద్యాలయం: ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం' అనే అంశంపై కొత్త ఆలోచనలు పంచుకోవడం లక్ష్యంగా నిర్వహించిన వెబ్‌నార్‌ .

Posted On: 22 FEB 2022 4:10PM by PIB Hyderabad

విద్య ,  నైపుణ్యం రంగాలకి సంబంధించి 2022 యూనియన్ బడ్జెట్  ప్రకటనలు-, నాణ్యమైన విద్యను మెరుగుపరచడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, డిజిటల్ విద్యా వ్యవస్థ విస్తృతి,  బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. 2022 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గాలను చర్చించడానికి, విద్య మంత్రిత్వ శాఖ  నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE) ఇతర మంత్రిత్వ శాఖలతో కలిసి డిజిటల్ విద్యతో   డైనమిక్ నైపుణ్యాలు  పెంపొందించడం కోసం  అమృత్ మంత్ర పేరున  ఆత్మనిర్భరత  పై వెబ్‌నార్‌ను నిర్వహించింది. . వెబ్‌నార్ కింద, ఫిబ్రవరి 21, 2022న ‘డిజిటల్ యూనివర్శిటీ: ప్రపంచ స్థాయి ఉన్నత విద్యని  అందరికీ అందుబాటులోకి తీసుకురావడం’ అనే అంశంపై గోష్టి జరిగింది.

వెబ్‌నార్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇందులో విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులు పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు. ‘డిజిటల్ యూనివర్సిటీ: ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం’ అనే అంశంపై జరిగిన సెషన్‌కు శ్రీ. కె. సంజయ్ మూర్తి, సెక్రటరీ, ఉన్నత విద్యామండలి శ్రీ. K. రాజారామన్, కార్యదర్శి, DoT సహనిర్వాహకులుగా ఉన్నారు.గోష్టి లో  సమన్వయకర్తలుగా  పిరమల్ గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ స్వాతి పిరమల్, మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి, యుజిసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. జగదీష్ కుమార్ ఉన్నారు. ఈ సెషన్‌ను ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే సంధానకర్త గా నిర్వహించారు.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో   సమగ్ర సాంకేతిక విద్యా   వ్యవస్థను సృష్టించడం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్, సమాచార  కల్పన, సమర్థవంతమైన డిజిటల్ బోధన, ఏకకాలిక, బలమైన నిపుణులతో  శిక్షణ, వర్చువల్ ల్యాబ్‌లు, డిజిటల్ బోధన-అభ్యాసాన్ని అంచనా వేయడంతో సహా డిజిటల్ విశ్వవిద్యాలయం స్థాపనకు సంబంధించిన విస్తృత అంశాలు చర్చించారు.

బహు-భాషానుకూల  విద్యా విధాన వ్యవస్థ, ఆకర్షణీయమైన  అభ్యాస అనుభవాల సృష్టి, బలమైన అభ్యాస బృందాలను సృష్టించడానికి సహాధ్యాయులను  కలపడం  ఆన్‌లైన్ విద్యను భౌతికంగా  (ఫై-డిజిటల్) మిళితం చేయడం ద్వారా సమకాలీన, అనుభవపూర్వకమైన అభ్యాస అవసరాన్ని ప్యానెలిస్ట్ బృందం  నొక్కిచెప్పింది.

ఈ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, నమోదు ప్రక్రియ, ఉపాధిని పెంపొందించే నైపుణ్యాలు, ప్రాంతీయ భాషల్లో నాణ్యమైన లెర్నింగ్ మెటీరియల్, ఫార్మల్, నాన్-ఫార్మల్ (ముందుగా  అభ్యాస అవసరాన్ని గుర్తించడం) మొదలైన వాటిలో ఖాళీలను పూరించగలదు.

భవిష్యత్తు బోధనా అభ్యాస ప్రక్రియకు సంబంధించి జవాబుదారీ నిబంధనలతో కేవలం  కాపలాదారుగా పరిమితం కాకుండా  డిజిటల్ విద్య పునఃరూపకల్పనలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ఒక ప్రేరకంగా  పని చేస్తుంది.

ఎడ్యుటెక్ విజృంభణతో భారతదేశం ప్రస్తుత విద్యారంగంలో అవకాశాలు మెరుగయ్యాయి.  డిజిటల్ యూనివర్శిటీ వ్యవస్థ, భారత్‌నెట్, నేషనల్ డిజిటల్ లైబ్రరీ, నేషనల్ అకడమిక్ డిపాజిటరీ, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, స్వయం, నీట్ అనుబంధ ఇంటర్న్‌షిప్‌లు, నేషనల్ డిటెక్ట్ ఇంటర్న్‌షిప్‌లు వంటి వివిధ ప్రభుత్వ  కార్యక్రమాల ఏకీకరణతో నిజంగా ఉత్తేజకరంగా మారింది. అన్నీ కలిసిన డిజిటల్ బోధనా –సాధన వ్యవస్థను రూపొందించడానికి ‘నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరమ్’ కృషి చేస్తుంది.

డిజిటల్ యూనివర్శిటీ కోసం నిర్వహణ నిబంధనలు, కేంద్రక, సహకార  ఉన్నతవిద్యా వాహకాల  గుర్తింపు, విద్యా నాయకత్వ దృక్పధంతో, ఫ్యాకల్టీకి శిక్షణ వంటి వివరణాత్మక కార్యాచరణ ప్రణాళిక అమలు రాబోయే కాలంలో సాకారం కానున్నది.

***


(Release ID: 1800403) Visitor Counter : 171