ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆత్మ నిర్భర్ నార్త్ ఈస్ట్ కొత్త దృక్కోణంతో వ్యవసాయం-ఎన్ఈఆర్‌సీఆర్ఎంఎస్ చొరవ - డీఓఎన్ఈఆర్ మంత్రిత్వ శాఖ క్రింద ఎన్ఈసీ ఆధ్వర్యంలో నమోదిత సంఘం
प्रविष्टि तिथि:
21 FEB 2022 5:18PM by PIB Hyderabad
డియోమాలి కుగ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్ జిల్లాలో ఉంది, ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారు. అనుకూలమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితుల కారణంగా సుగంధ ద్రవ్యాల పెంపకం ఎన్ఈఆర్‌లో గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 12, 2022న, నార్త్ ఈస్టర్న్ రీజియన్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొసైటీ (ఎన్ఈఆర్‌సీఆర్ఎంఎస్), షిల్లాంగ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని స్పైస్ బోర్డ్ డివిజనల్ ఆఫీస్ నంసాయ్ సహకారంతో, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్ఈసీ), కేంద్ర ప్రభుత్వపు మినిస్ట్రీ ఆఫ్ డోనర్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. పట్కాయ్ హిల్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం, డియోమాలి, తిరప్, అరుణాచల్ ప్రదేశ్‌లో సుగంధ ద్రవ్యాల పెంపకందారులకు ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 60 (అరవై) కంటే ఎక్కువ మంది పాల్గొని శిక్షణ పొందారు. వారికి సుగంధ ద్రవ్యాల పెంపకంతో పాటు తమ ఉత్పత్తులను ఆదాయం కోసం విక్రయించడంలో శిక్షణ ఇచ్చారు. రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలు మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రోత్సహించడానికి సమీప భవిష్యత్తులో నంసాంగ్ బ్లాక్ మరియు సోహా బ్లాక్‌లలో ఇటువంటి మరిన్ని ప్రాజెక్టులు అమలు చేయనున్నట్లు స్పైస్ బోర్డు అధికారులు ఈ కార్యక్రమంలో ప్రధానంగా వెలుగెత్తి తెలిపారు.
***
(रिलीज़ आईडी: 1800193)
आगंतुक पटल : 139