గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ్రామీణ అనుసంధానత తో కూడిన జి.ఏ.ఎస్. డేటాను రేపు పబ్లిక్ డొమైన్‌ ద్వారా ప్రారంభించనున్న - కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి


8 లక్షల కంటే ఎక్కువ గ్రామీణ సౌకర్యాలు, 1 మిలియన్ కంటే అధికంగా ఆవాసాలు, 25 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువగా గ్రామీణ రహదారులకు సంబంధించిన జి.ఐ.ఎస్. సమాచారాన్ని సేకరించి, జి.ఐ.ఎస్. వేదిక ను ఉపయోగించి డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుంది

జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్.ఆర్.ఐ.డి.ఏ) మూడు ప్రముఖ జి.ఐ.ఎస్. సంస్థలతో ఎం.ఓ.యు. పై సంతకం చేసి, గ్రామీణ అనుసంధానత తో కూడిన జి.ఏ.ఎస్. డేటాను పబ్లిక్ డొమైన్‌ ద్వారా విడుదల చేయడానికి గతి శక్తితో సహకరిస్తుంది

Posted On: 21 FEB 2022 6:20PM by PIB Hyderabad

కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, 2022 ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ కేంద్రంలో, గ్రామీణ అనుసంధానత తో కూడిన జి.ఏ.ఎస్. డేటాను పబ్లిక్ డొమైన్‌ ద్వారా ప్రారంభిస్తారు.

దేశం అంతటా అర్హత కలిగిన అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు అన్ని వాతావరణ పరిస్థితులకు లకు తట్టుకునే రహదారి అనుసంధాతను అందించే లక్ష్యంతో, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పి.ఎం.జి.ఎస్.వై) ను  2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది.  ఆ తర్వాత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం  మార్గాలు, ప్రధాన గ్రామీణ అనుసంధానం ద్వారా వాటి అభివృద్ధి, ఏకీకరణలను కూడా ఈ పథకం లక్ష్యాలు గా చేర్చడం జరిగింది.  ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు,  7.83 లక్షల కిలోమీటర్ల రహదారులను మంజూరు చేయగా, 2.69 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో,  6.90 లక్షల కిలోమీటర్ల రహదారులను  నిర్మించడం జరిగింది. 

పి.ఎం.జి.ఎస్.వై. అమలులో భాగంగా,  8 లక్షల కంటే ఎక్కువ గ్రామీణ సౌకర్యాలు, 1 మిలియన్ కంటే అధికంగా ఆవాసాలు, 25 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువగా గ్రామీణ రహదారులకు సంబంధించిన జి.ఐ.ఎస్. సమాచారాన్ని సేకరించి, ఈ పథకం కోసం అభివృద్ధి చేసిన జి.ఐ.ఎస్. వేదికను ఉపయోగించి డిజిటలైజ్ చేయడం జరిగింది. ఈ విధంగా గ్రామీణ అనుసంధానత తో సేకరించిన జి.ఏ.ఎస్. సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

పి.ఎం.జి.ఎస్.వై. పథకం అమలుకు నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తున్న ఎన్.ఆర్.ఐ.డి.ఏ., మూడు ప్రముఖ జి.ఐ.ఎస్. సంస్థలతో ఎం.ఓ.యు. పై సంతకం చేసి, గ్రామీణ అనుసంధానత తో కూడిన జి.ఏ.ఎస్. డేటాను పబ్లిక్ డొమైన్‌ ద్వారా విడుదల చేయడానికి గతి శక్తితో సహకరిస్తుంది. సరకు రవాణా ఖర్చులను తగ్గించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, భారతదేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రూపొందించి, అమలు చేయడానికి గతి శక్తి అనేది ఒక జాతీయ మాస్టర్ ప్లాన్ మరియు డిజిటల్ ప్లాట్‌ ఫారమ్ గా వ్యవహరిస్తుంది.   రెండు పథకాల మెరుగైన ప్రణాళిక, అమలు కోసం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలనే లక్ష్యంతో ఎన్.ఆర్.ఐ.డి.ఏ. గతి శక్తి తో సహకరిస్తోంది.

జి.ఐ.ఎస్. డేటా ను ప్రారంభించిన తర్వాత సాంకేతిక సదస్సులో భాగంగా ఎస్.ఎస్.ఆర్.ఐ. ఇండియా, మ్యాప్ మై ఇండియా, డేటా మీట్, గతి శక్తి, పూణే లోని సి.డి.ఏ.సి., సంస్థలు పలు సాంకేతిక అంశాలను సవివరంగా ప్రదర్శిస్తాయి. 

 

 

 

*****



(Release ID: 1800190) Visitor Counter : 128