భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

స‌ముద్ర జ‌లాల‌నుంచి ప్లాస్టిక్ వ్య‌ర్థాల తొల‌గింపుపై ప్ర‌త్యేక దృష్టితో ,


స‌ముద్ర కాలుష్య స‌మ‌స్య‌ను తొల‌గించేందుకు క‌ల‌సిక‌ట్టుగా ముందుకువ‌చ్చిన ఇండియా , ఆస్ట్రేలియా, సింగ‌పూర్‌లు.

Posted On: 15 FEB 2022 5:19PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వం, ఆస్ట్రేలియా , సింగ‌పూర్ ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యంతో స‌ముద్ర కాలుష్య స‌మ‌స్య‌ను ఎదుర్కొనేందుకు ఒక అంత‌ర్జాతీయ స‌ద‌స్సును 2022 ఫిబ్ర‌వ‌రి 14,15 తేదీల‌లో నిర్వ‌హించింది. ముఖ్యంగా స‌ముద్ర‌జ‌లాల‌నుంచి ప్లాస్టిక్ వ్య‌ర్థాల తొల‌గింపు పై ఇది దృష్టిపెట్టింది. వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగిన ఈ వ‌ర్క్‌షాప్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈరంగంలోని నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు, ప్ర‌భుత్వ అధికారులు, పాల‌సీ వేత‌త్లు, ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సంబంధించిన త‌దిత‌ర రంగాల‌కు చెందిన వారు పాల్గొన్నారు. స‌ముద్ర జ‌లాల‌లో పేరుకుపోతున్న వ్య‌ర్థాల‌ను గ‌మ‌నించ‌డం, అవి ఎంత‌మేర‌కు ఉన్నాయ‌న్న‌దానిని అంచ‌నా వేయ‌డం , వీటిని తొల‌గించేందుకు సుస్థిర ప‌రిష్క‌రాల‌ను అన్వేషించ‌డం, అలాగే అంత‌ర్జాతీయంగా స‌ముద్ర జ‌లాల కాలుష్యస‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డం వంటి విష‌యాలు ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి..

ఈ వ‌ర్క్ షాప్‌లో నాలుగు ప్ర‌ధాన సెష‌న్ లు ఉన్నాయి. అవి స‌ముద్ర జ‌లాల‌లో వ్య‌ర్థాలు, ప‌ర్య‌వేక్ష‌ణ‌, ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో స‌ముద్ర జ‌లాలలో ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌పై ప‌రిశోధ‌న‌, స‌ముద్ర జ‌లాల‌నుంచి వ్య‌ర్థాల తొల‌గింపులో అత్యుత్త‌మ సాంకేతిక ప‌రిజ్ఞానం,ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించ‌డానికి ప‌రిష్కారాలు, పాలిమ‌ర్లు, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అడ్డుకునేందుకు ప్రాంతీయ స‌హ‌కారానికి సంబంధించిన అవ‌కాశాలు వంటివి ఈ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఈ వ‌ర్చువ‌ల్ సెష‌న్‌లో పాన‌ల్ చ‌ర్చ‌లు, ఇంట‌రాక్టివ్ సెష‌న్ లు ఉన్నాయి. తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌న దేశాల నుంచి పాల్గొన్న వారి మ‌ధ్య చ‌ర్చ‌ను మ‌రింత  ప్రోత్స‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు.

తూర్పు ఆసియా శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం (ఇఎఎస్‌) ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో కీల‌క వ్యూహాత్మ‌క అంశాల పై చ‌ర్చ‌కు స‌రైన వేదిక‌. అంతే కాదు ఇది విశ్వాసాన్ని పాదుకొల్పే యంత్రాంగం కూడా. 2005 వ సంవ‌త్స‌రంలో దీనిని ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి ఇఎఎస్ ప్రాంతీయంగా శాంతి, భ‌ద్ర‌త‌, స‌న్నిహిత ప్రాంతీయ స‌హ‌కారం, ఏసియా ప‌సిఫిక్ సుసంప‌న్న‌త‌, హిందూమ‌హాస‌ముద్ర ప్రాంతం సుసంప‌న్న‌త కు కృషి చేస్తోంది.
 సుస్థిర‌ సరిహద్దు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, ఒకదానితో ఒకటి అనుసంధానిత‌మైన  ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రాంతాలు , ఉప-ప్రాంతాల మధ్య నైపుణ్యం , త‌మ అనుభ‌వాల‌ను పంచుకోవడానికి ఇఎఎస్  ప్రత్యేక స్థానం క‌లిగిన‌ది చెప్పుకోవ‌చ్చు.  ఇఎఎస్‌ దేశాలు  స‌ముద్ర తీర ప్రాంత‌,  సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్య సవాలును గుర్తించాయి.
నవంబర్ 2019లో బ్యాంకాక్‌లో జరిగిన 14వ ఇఎఎస్ స‌మావేశంలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ,  ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర సహకారాన్ని విస్తృతంగా ప్రోత్సహించే ఎజెండాను ప్రకటించారు.  భారతదేశం, సింగపూర్  ఆస్ట్రేలియా దేశాలు ఇందుకు కట్టుబడి ఉన్నాయి.


ఈ వర్క్‌షాప్ సముద్రపు వ్యర్థాల‌కు సంబంధిం చిన సవాళ్లు, ప్రశ్నలు  పరిష్కారాల గురించి ఒకరికొకరు చ‌ర్చించ‌డానికి, త‌మ అనుభ‌వాల‌ను పంచుకోవ‌డానికి ఇఎఎస్  దేశాలకు త‌గిన ప్రోత్సాహాన్ని అందించింది . ఈ స‌మావేశం ముఖ్యంగా ప్లాస్టిక్ వ్య‌ర్థాల విష‌యంలో పరిశోధన, ఉపయోగం, రీసైక్లింగ్ , ప్లాస్టిక్ రహిత , ఆరోగ్యకరమైన సముద్రం కోసం భవిష్యత్  సహకారం, ప‌రిశోధ‌న‌ల‌లో భాగస్వామ్యం ద్వారా స్థిరమైన అభివృద్ధిని,  చెన్నై లోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (NCCR), సింగ‌పూర్ లోని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES),   ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వంటి వాటిద్వారా పొంద‌డానికి వీలు క‌ల్పించింది.  ఈ వర్క్‌షాప్‌లో భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ కీలకోపన్యాసం చేశారు. మెరైన్ ప్లాస్టిక్ ఎంత‌మేర‌కు విస్త‌రించి ఉంద‌న్న‌ది గుర్తించ‌డానికి రిమోట్ సెన్సింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ,మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక సాధనాల ను వినియోగించాల‌ని వాటి ఫ‌లితాల‌ను పరిగణనలోకి తీసుకోవాలని  అన్నారు. హిందూ మహాసముద్రంలో ప్లాస్టిక్‌ల గతిశీలతను అర్థం చేసుకోవడానికి నమూనాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రాంతీయంగా ఆయా ప్రాంతాల ప్ర‌త్యేక‌త‌ను  పరిగణనలోకి తీసుకుని , స‌రైన రీతిలో రూపొందించిన తగిన నిర్వహణ వ్యూహం, పర్యావరణవ్య‌వ‌స్థ‌లో ప్లాస్టిక్‌లను గణనీయంగా తగ్గించగలదని కూడా ఆయన నొక్కి చెప్పారు.

***



(Release ID: 1799933) Visitor Counter : 156