వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇండియా- యుఎఇ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, భారతీయ వస్తువులు, సేవలకు నూతన మార్కెట్‌లకు ద్వారాలు తెరియనుంది.
ఇలాంటి ఒప్పందాన్నే గల్ఫ్ సహకార మండలితో కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్
కార్మికులు ఎక్కువగా ఉండే పరిశ్రమలు, ఎం.ఎస్.ఇలు, స్టార్టప్‌లు దీనివల్ల ఎక్కువగా ప్రయోజనం పొందుతాయి. ఇండియాలో పది లక్షల అదనపు ఉద్యోగాలు ఏర్పడతాయి.
Posted On:
20 FEB 2022 11:17AM by PIB Hyderabad
ఇండియా- యుఎఇ మధ్య శుక్రవారం సంతకాలు జరిగిన ఇండియా-యుఎఇ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చరిత్రాత్మక ఒప్పందమని ఇది, భారత ఉత్పత్తులు, సేవలకు కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరుస్తుందని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియుష్ గోయల్ అన్నారు.
ఇండియా -యుఎఇల మధ్య ఒప్పందం కుదిరిన ఒక రోజు తర్వాత శ్రీ పియూష్ గోయల్ , ఇండియా- యుఎఇ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) ఎం.ఎస్.ఎం.ఇలు, స్టార్టప్‌లు, రైతులు, వ్యాపారులు, సమాజంలోని వివిధ వ్యాపార వర్గాలకు అత్యంత ప్రయోజనకరమని అన్నారు.
వివిధ రంగాలలో సాధించిన ప్రగతి గురించి మాట్లాడుతూ, కార్మికులు ఎక్కువగా గల టెక్స్‌టైల్, వజ్రాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు
, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వంటివి దీనివల్ల ఎక్కువగా ప్రయోజనం పొందనున్నాయి.
సిఇపిఎ సమతూకంతో కూడుకున్నదని, నిష్పాక్షికమైనదని, సమగ్రమైన, సమతుల్యతతో కూడిన భాగస్వామ్య ఒప్పందమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. ఇది ఇండియాకు ఉత్పత్తులు, సేవల రంగంలో అద్భుతమైన మార్కెట్ అనుసంధానతను ఏర్పాటు చేయనుందని ఆయన తెలిపారరు. ఇది మన యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. మన స్టార్టప్ లకు కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరుస్తుంది. మన వ్యాపారాన్ని పోటీకి మరింతగా నిలిచి తట్టుకునేలా చేస్తుంంది, మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అని ఆయన అన్నారు.
వివిధ రంగాల వారీగా జరిగిన సంప్రదింపులను గమనించినపుడు, ఈ ఒప్పందం కనీసం 10 లక్షల కొత్త ఉద్యోగాలను భారతీయ పౌరులకు కల్పించగలదని మంత్రి తెలిపారు.
సిఇపిఎ రికార్డు సమయంలో పట్టుమని 88 రోజులలో ఖరారు అయిందని శ్రీ గోయల్ చెప్ఆరు. ఇది 90 రోజుల కంటే తక్కువ రోజులలో అంటే మే నెలలోగా అమలులోకి వస్తుందని చెప్పారు.ఇండియానుంచి యుఎఇకి ఎగుమతి అయ్యే 90 శాతం ఉత్పత్తులకు ఈ ఒప్పందం అమలుతో సుంకం ఉండదని చెప్పారు. 80 వాణిజ్య మార్గాలకు సుంకం ఉండదని , మిగిలిన 20 శాతం మన ఎగుమతులపై ప్రభావం చూపదని అందువల్ల ఇది ఇరువురికి ప్రయోజన కరమైనదని మంత్రి అన్నారు.
వాణిజ్య ఒప్పందాలలో తొలిసారిగా సిఇపిఎ, ఏదైనా అభివృద్ధి చెందిన దేశాలలో ఆమోదం పొందిన భారతీయ జెనిరిక్ ఔషధాలకు 90 రోజులలోగా ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్, మార్కెటింగ్ ఆథరైజేషన్ కు ఇది వీలు కల్పిస్తుంది. ఇది భారతీయ ఔషధాలకు భారీగా మార్కెట్ అందుబాటును కల్పిస్తుంది.
భారతీయ ఆభరణాల ఎగుమతిదారులు యుఎఇకి సుంకాలు లేకుండా మార్కెట్ అనుసంధానత పొందుతారు. ప్రస్తుతం ఇలాంటి ఉత్పత్తులపై 5 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తున్నారు. దీనివల్ల ఆభరణాల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే భారతదేశంలో డిజైన్ చేసిన ఆభరణాలకు మంచి మార్కెట్,ప్రతిష్ఠ ఉంది. వజ్రాలు, ఆభరణాల రంగం ఎగుమతులు2023 నాటికి 10 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోనుంది.
సిఇపిఏ భారతీయ ఉత్పత్తుల పోటీ సామర్ధ్యాన్ని మెరుగుపరచడమే కాదు, ఇది ఇండియాకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని కలిగించనుంది. యుఎఇ ట్రేడింగ్ హబ్ గా పనిచేస్తున్నందున,ఈ ఒప్పందం ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, యూరప్‌కు మనకు ఎంట్రీ పాయింట్‌లను కల్పిస్తుందని మంత్రి తెలిపారు.
సిఇపిఎ ఖరారుతో రాగల ఐదు సంవత్సరాలలో 100 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక సరకు వాణిజ్యాన్ని పెంచడానికి ఇండియా, యుఎఇ లు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య సామర్ధ్యం మరింత విస్తృతమైనది. మనం మనకుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను అధిగమించగలం అని పియూష్ గోయల్ తెలిపారు. యుఎఇ, ఇండియాకు మూడో అతిపెద్ద ద్వైపాక్షిక భాగస్వామి.
022లోనే జిసిసి ఒప్పందంః
గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో ఈ ఏడాదిలోనే ఇటువంటి ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నట్టు శ్రీ పియూష్ గోయల్ తెలిపారు.
జిసిసి సెక్రటరీ జనరల్ చర్చలను వేగవంతం చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారని పియూష్ గోయల్ తెలిపారు. ,"మా చర్చల సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది, మేము యుఎఇ తో వేగంగా చర్చలు జరిపాము .. ఈ ఏడాదిలోనే జిసిసితో వాణిజ్యంపై ఒప్పందం కూడా ముగుస్తుంది.
జిసిసి అనేది గల్ఫ్ ప్రాంతంలోని ఆరు రాజ్యాల కూటమి. అవి సౌదీ అరేబియా, యుఎఇ, , కువైట్, ఒమన్, బహ్రెయిన్ . వీటి ఉమ్మడి వీటి ఉమ్మడి సాధారణ జిడిపి 0.1.6 ట్రిలియన్ గా ఉంది.
*****
(Release ID: 1799918)
Visitor Counter : 252