సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంప్రదాయ ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరిగిన అతిపెద్ద గిరిజన ఉత్సవం -మేడారం జాతర


గిరిజన సమాజం సేవను గుర్తించి, సంవత్సరాలుగా వారు కోల్పోయిన సరైన గుర్తింపును పొందడానికి , జనాభాలో సుమారు 10% ఉన్న 705 గిరిజన సమాజాల వారసత్వం, సంస్కృతి విలువలను పరిరక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము: శ్రీ జి కిషన్ రెడ్డి

Posted On: 20 FEB 2022 2:02PM by PIB Hyderabad

సాంప్రదాయ భక్తిశ్రద్ధలు , ఆనందోత్సాహాల మధ్య  నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగిన దేశంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం- సమ్మక్క సారలమ్మ జాతర నిన్న ముగిసింది. ఈ జాతరను గిరిజన సమూహాల అతిపెద్ద ఉత్సవాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ లోని ములుగు జిల్లా మెడారం గ్రామంలో 2022 ఫిబ్రవరి 16న వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య ఈ చారిత్రక ఉత్సవం ప్రారంభమైంది. ప్రాచీన ఆచారం ప్రకారం, గిరిజన పూజారులు చిలకలగుట్ట అడవి , మేడారం గ్రామాలలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గిరిజన దేవతలను పూజిస్తూ రోడ్డు చుట్టూ గుమిగూడి దేవతలకు బెల్లం సమర్పించడానికి చెప్పులు లేకుండా నడిచారు.

 

ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక, శాఖ (డీఓఎన్ ఈఆర్) కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి జాతర సందర్భంగా మేడారం సందర్శించి సమ్మక్క- సారలమ్మ దేవతలకు పూజలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు kendra గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్ కూడా మేడారం జాతర ను సందర్శించారు. ఉన్నారు.

 

మేడారం జాతర లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సంప్రదాయం ప్రకారం,  తన బరువుకు సరితూగే బెల్లం నైవేద్యాన్ని అమ్మవార్లకు సమర్పించారు. అమ్మవార్లకు సమర్పించే బెల్లంను బంగారం గా పరిగణిస్తారు. ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "నేను భారత ప్రజలకు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లుl ఆశీస్సులు 

 

కోరు కున్నాను‘‘ అని చెప్పారు. ఈ జాతర, భక్తజన సందోహం భారతదేశ సాంస్కృతిక విలువలు, నైతికత్వాన్ని  ప్రతిబింబిస్తోందని,  సమ్మక్క, సారలమ్మ జీవితాలు , అన్యాయాలు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వారి పోరాటం మనందరికీ స్ఫూర్తినియిస్తూనే ఉందని అన్నారు.

" మేడారం సమ్మక్క సారలమ్మ  జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగలలో ఒకటి. దీనికి ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతును అందిస్తోంది. ఈ జాతరను పురస్కరించుకుని ఇటీవల ప్రధాన మంత్రి  ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా మొత్తం రూ.2.5 కోట్లు ఈ జాతర నిర్వహణ కోసం విడుదల చేసింది.

2014 నుండి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, దేశీయ ప్రోత్సాహం , ఆతిథ్యం సహా  ప్రచార పథకం కింద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక పండుగలను జరుపుకోవడానికి 2.45 కోట్లు విడుదల చేసింది" అని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు.

 

కేంద్ర మంత్రి మాట్లాడుతూ, "మేడారం జాతర గిరిజన సంస్కృతి ,సంప్రదాయానికి చిహ్నంగా నిలుస్తుంది. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా పర్యాటక మంత్రిత్వ శాఖ ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, దామరావి, మల్లూర్, బొగత జలపాతాల గిరిజన సర్క్యూట్ ను అభివృద్ధి చేయడానికి ప్రాజెక్టులను చేపట్టింది. మేడారంలో అతిథి గృహాన్ని నిర్మించింది. తెలంగాణలో గిరిజన సర్క్యూట్ కోసం భారత ప్రభుత్వం సుమారు 80 కోట్లు మంజూరు చేసింది.  ఇందులో మేడారం లో పర్యాటకులకు   సౌకర్యాల కేంద్రం, యాంఫి థియేటర్, మరుగు దొడ్లు, కాటేజీలు, గుడార వసతి, గాజెబోస్, సిటింగ్ బెంచీలు, ఘన వ్యర్థాల నిర్వహణ మౌలిక సదుపాయాలు, సోలార్ లైట్లు, ల్యాండ్ స్కేపింగ్ త్రాగునీటి ఫౌంటెన్ల నిర్మాణం కూడా ఉన్నాయి. ఇంకా ములుగు లో.రూ.45 కోట్ల వ్యయంతో గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి ఇవి త్వరలో పూర్తవు తాయి‘‘ అని శ్రీ కిషన్ రెడ్డి చెప్పారు.

"దేశా నిర్మాణం లో గిరిజన సమాజం సేవ ను గుర్తించడానికి , ఏళ్ల తరబడి కోల్పోయిన సరైన గుర్తింపును వారు పొందడానికి , జనాభాలో సుమారు 10% ఉన్న 705 గిరిజన సమాజాల వారసత్వం, సంస్కృతి , విలువలను కాపాడేందుకు మేము కట్టుబడి ఉన్నాము" అని కూడా శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇంకా, "దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్న సమయంలో 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశాన్ని , దాని ప్రజల, సంస్కృతుల ,విజయాల అద్భుతమైన చరిత్రను స్మరించుకుంటున్నాం. ఇటీవల గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా

జన్ జాతీయ గౌరవ్ దివస్ ను జరుపుకున్నాము..ఇప్పటి వరకు మన స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన కొమరం భీమ్, రామ్‌జీ గోండ్, అల్లూరి సీతారామరాజు వంటి ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుల గౌరవార్థం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మన స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో సుమారు 85 తిరుగుబాటుల్లో పాల్గొన్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించడానికి దేశవ్యాప్తంగా 10 గిరిజన మ్యూజియంలను కూడా నిర్మిస్తున్నాము.ఇందులో తెలంగాణలో రాంజీ గోండ్ గిరిజన మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లోన అల్లురి సీతారామరాజు గిరిజన మ్యూజియం ఒక్కొక్కటి రూ.15 కోట్ల కేటాయింపుతో ఏర్పాటవుతున్నాయి. ఇవి బ్రిటిష్ వారి అణచివేత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మన వీరోచిత గిరిజన యోధుల సాహస జీవితాలను ఆవిష్కరిస్తాయి‘‘ అని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు.

***


(Release ID: 1799880) Visitor Counter : 160