మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్-2022 ప్రకటనల అమలుపై మేధోమథన వెబ్‌నార్‌ను నిర్వహించనున్న విద్యా మంత్రిత్వ శాఖ
- సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 FEB 2022 10:59AM by PIB Hyderabad
బడ్జెట్ ప్రకటనలను సమర్ధవంతంగా మరియు త్వరితగతిన అమలు చేయడానికి భారత ప్రభుత్వం వివిధ కీలక రంగాలలో వెబ్‌నార్ల శ్రేణిని నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, విద్యాసంస్థలు మరియు పరిశ్రమలకు చెందిన నిపుణులతో మేధోమథనం చేయడం, మరియు వివిధ రంగాల కింద వివిధ సమస్యల అమలు దిశగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వ్యూహాలను గుర్తించడం ఈ మేథోమథనాల లక్ష్యం. ఈ సిరీస్‌లో భాగంగా భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 21న విద్య మరియు నైపుణ్య రంగంపై వెబ్‌నార్‌ను నిర్వహిస్తోంది. వెబ్‌నార్‌లో వివిధ అంశాలకు సంబంధించిన సెషన్‌లు ఉంటాయి.
వివిధ మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు, విద్యావేత్తలు, విద్యార్థులు మరియు ఇతర నిపుణులు ఇందులో పాల్గొంటారు.
వెబ్‌నార్ నిమిత్తం గుర్తించబడిన థీమ్‌లు
1. డిజిటల్ యూనివర్సిటీ: ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం
2. డిజిటల్ టీచర్: సమగ్రత, మెరుగైన అభ్యాస ఫలితాలు, నైపుణ్యం కోసం నాణ్యమైన ఈ-కంటెంట్ మరియు వర్చువల్ ల్యాబ్‌లను సృష్టించడం
3. వన్ క్లాస్ వన్ ఛానల్‌ను విస్తరించడం: నాణ్యమైన డిజిటల్ విద్యను సుదూర ప్రాంతాల మూలకు కూడా చేరుకోవడం
4. అర్బన్ ప్లానింగ్ మరియు డిజైన్‌లో భారతదేశం నిర్దిష్ట పరిజ్ఞానం
5. బలమైన పరిశ్రమ-నైపుణ్య అనుసంధానాన్ని పెంపొందించే దిశగా చర్యలు
6. గిఫ్ట్ సిటీలో విద్యా సంస్థలను అభివృద్ధి చేయడం
7. ఏవీజీసీలో పరిశ్రమ-నైపుణ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం
ప్లీనరీ సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. గుర్తించబడిన థీమ్‌ల క్రింద ఏడు సమాంతర బ్రేక్‌అవుట్ సెషన్‌లు నిర్వహించబడతాయి. విద్యలో సౌలభ్యం మరియు ఉపాధి అవకాశాలను వినియోగించుకోవడంపై దృష్టి పెట్టే సూత్రాలకు అనుగుణంగా అమలు చేయడానికి కార్యాచరణ పాయింట్లు, విస్తృత వ్యూహాలు మరియు సమయపాలనలను పాల్గొనే బృందాలు గుర్తిస్తాయి.
******
(रिलीज़ आईडी: 1799871)
आगंतुक पटल : 167